ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన సాయికృష్ణ తల్లి, మేనమామ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు న్యాయం చేస్తానని సీఎం చంద్రబాబు హామీనిచ్చారని, తనకు భరోసా కల్పించారని సాయికృష్ణ తల్లి తెలిపారు. తనకు అది చాలని ఆమె అన్నారు. తాను సీఎం చంద్రబాబును కలవాలని అనుకున్నానని, తన బిడ్డ కేసులో న్యాయం చేశారని తెలిపారు. తనకు ఏ సాయం కావాలన్నా చేస్తానని చంద్రబాబు భరోసానిచ్చారని చెప్పారు.
ఒక సామాన్యుడికి న్యాయం జరగదనుకున్నామని, కానీ, సీఎం చంద్రబాబు తమకు న్యాయం చేస్తానని భరోసానిచ్చారని, తమకు అంతకన్నా ఏం కావాలని సాయికృష్ణ మేనమామ అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ వంటి మహోన్నత వ్యక్తులున్నందుకు సంతోషిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు, పవన్, లోకేశ్ లకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. సాయికృష్ణకు అన్యాయం చేసిన వారిపై క్రిమినల్ కేసు పెట్టి జైలుకు పంపిస్తామని చంద్రబాబు హామీనిచ్చారని తెలిపారు.
సాయికృష్ణ తల్లి బాధను చంద్రబాబు విన్నారని, ఆమెకు ఆయన భరోసానిచ్చారని, తమకు అంతకన్నా ఇంకేం అవసరం లేదని అన్నారు. తమ బాధలు చంద్రబాబుతో చెప్పుకున్నామని, వాటిని చంద్రబాబు సావధానంగా విన్నారని అన్నారు. తమకు జరిగిన అన్యాయం రాష్ట్రంలో మరెవరికి జరగకూడదని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశామని తెలిపారు.
This post was last modified on June 19, 2026 7:49 pm
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…