విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ముప్పై సంవత్సరాల క్రితం అంజి చేసినప్పుడు చిరంజీవి అంతటి మెగాస్టార్ కే ఈ తిప్పలు తప్పలేదు. అమ్మోరు తీయడానికి ఆరేళ్ళు ఎందుకు పట్టిందంటే నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి కథలుగా చెబుతారు. ఇప్పటి జనరేషన్ లో కార్తికేయ 2 లాంటివి ఈ కోవలో మంచి విజయం సాధించాయి. నాగబంధం కూడా అదే క్యాటగిరీలో రానుంది.
హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో జరిగిన ఈవెంట్ లో ట్రైలర్ లాంచ్ చేశారు. ఆశ్చర్యకరంగా మూడున్నర నిమిషాలకు దగ్గరగా ఉన్న వీడియోని కట్ చేయడం ద్వారా దర్శకుడు అభిషేక్ నామా చిన్నపాటి షాక్ ఇచ్చారు. అనంత పద్మనాభ స్వామి ఆలయంలో సకల బ్రహ్మాండాన్ని శాశించే బ్రహ్మ కమలం అనే బంగారు పువ్వు ఉంటుంది. దాని కోసం రాక్షసులు, మనుషులు ఎందరో పోటీ పడుతుంటారు. నాగ సాధువులతో పాటు ఒక సాధారణ యువకుడు (విరాట్ కర్ణ) దాని రక్షణకు పూనుకుంటాడు.
క్లుప్తంగా కథను చెప్పడంతో పాటు కీలకమైన విజువల్స్ ని నాగబంధం ట్రైలర్ లో చూపించారు. కొన్ని షాట్స్ అబ్బురపరిచేలా ఉన్నాయి. ముఖ్యంగా అనకొండ లాంటి పాములు పువ్వుకి కాపలాగా ఉండటం, హిమాలయాల నుంచి సాధువులు మహిమాన్విత శక్తితో గుడి దగ్గరికి రావడం లాంటి ఎపిసోడ్స్ లో చాలా వెయిట్ కనిపిస్తోంది. శివుడి సాక్షాత్కారం కూడా సినిమాలో ఉంది కానీ దాన్ని చూపించీ చూపించనట్టు రివీల్ చేశారు. ఇంటెన్స్ యాక్షన్ చాలానే ఉంది.
అక్కడక్కడా కొంత ఏఐ వాడిన ఛాయలు కనిపించాయి. ఇలాంటి ప్యాన్ ఇండియా మూవీస్ తెరమీద పండాలంటే కంటెంట్ తో పాటు ఎమోషన్, యాక్షన్, డివోషన్ మూడు బాలన్స్ అవ్వాలి. అప్పుడే ఆడియన్స్ సూపర్ హిట్ చేసి పెడతారు. జునైద్ కుమార్ నేపధ్య సంగీతం కొత్త సౌండుతో డిఫరెంట్ గా ఉంది. టెక్నికల్ గా చాలా బలమైన సపోర్ట్ తో రూపొందిన నాగబంధం జూలై 3 విడుదల కానుంది. బిజినెస్ పరంగా ఏరియాల వారిగా ఇప్పటికీ మంచి డిమాండ్ చూస్తోంది.
This post was last modified on June 19, 2026 6:25 pm
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…
తల్లిదండ్రులపై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వరకు ఉండాల్సిందే. కానీ, జ్యాతస్యహి ధ్రువో మృత్యు.. అన్నట్టుగా కాలం…
భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…