ఇప్పుడంతా అప్ డేటెడ్ వెర్షన్లే వినిపిస్తున్నాయి. వ్యవహారికంతో పాటుగా పాలిటిక్స్ లోనూ నయా తరం వచ్చేసింది. ఆ ఫలితమే జన్ కాక్రోచ్ పార్టీ ఆవిర్భావం. అంతా అప్ డేట్ అవుతుంటే… తాను కూడా అదే బాటన నడవాలని అనుకున్నారో, ఏమో తెలియదు గానీ… వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అప్ డేట్ అయిపోతున్నారు. జగన్ లో ఈ అప్ డేషన్ గురువారం నాటి మీడియా సమావేశంలో విస్పష్టంగా కనిపించిందని చెప్పాలీ.
ఎప్పటిలానే తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం వేదికగా నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్ చాలా అంశాలనే ప్రస్తావించారు. వాటితో పాటుగా అప్ డేటెడ్ వెర్షన్లనూ ఆయన ప్రస్తావించారు. మనమంతా ఇప్పుడు జెన్ జీ యుగంలో ఉన్నామన్న జగన్… అప్పుడు జెన్ ఆల్ఫా కూడా వచ్చేసిందంటూ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగని ఆయన టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపైకి కాక్రోచ్ లు లేస్తాయంటూ సెటైరిక్ కామెంట్లు చేశారు.
చంద్రబాబు తన పాలనలో తప్పులు చేస్తున్నారని రూలింగ్ ఇచ్చిన జగన్.. ఆ తప్పులను చంద్రబాబు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. చేసిన తప్పులను ఒప్పుకోకుండా సాగడం చంద్రబాబుకు సాధ్యం కాదన్న మాటనూ జగన్ గట్టిగానే వినిపించారు. ఈ సందర్భంగానే జెన్ జీ, జెన్ ఆల్ఫాలను ప్రస్తావించిన జగన్.. చంద్రబాబు తన తప్పులను ఒప్పుకోని పక్షంలో ఆయనపైకి కాక్రోచ్ లు వచ్చి పడతాయని తెలిపారు.
ఈ అప్ డేటెడ్ వెర్షన్ల ప్రస్తావన సందర్భంగా జగన్ వాటిని పలికేందుకు ఒకింత ఇబ్బంది పడినట్లుగా కనిపించింది. అడ్వాన్స్ వెర్షన్లకు సంబందించిన పేర్లను ఓ నాలుగింటిని జగన్ బట్టి కొట్టి మరీ మీడియా మీట్ కు వచ్చినట్లుగా అనిపించిందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. జెన్ జీ.. జెన్ ఆల్ఫా, కాక్రోచ్ అనే పదాలను పలికిన సందర్బంగా జగన్ పడిన ఇబ్బంది స్పష్టంగా కనిపించింది.
This post was last modified on June 11, 2026 1:40 pm
సరైనోడు ఇచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు బోయపాటి శీను కాంబోలో ఒక సినిమా తెరకెక్కే అవకాశముందంటూ నిన్న…
ఒకప్పుడు ఆస్కార్ అవార్డుల గురించి ఇండియన్ ఫిలిం మేకర్స్ ఆలోచించడం కూడా కష్టంగా ఉండేది. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత…
మొన్న గాంధీ జయంతికి విడుదలైన సినిమాల్లో బడ్జెట్ తక్కువే అయినా తెల్లకాగితం అంతో ఇంతో సౌండ్ చేయడంలో సక్సెసయ్యింది. వీడియోలు…
కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలని అనుకునేవారు.. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్ లేదా..అధికారుల నుంచి ఫాం-6ను తీసుకుని దానిని…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బాలయ్య చాలా ఏళ్ల…
విమానాలు భయపెడుతున్నాయి. గత వారం ఫ్లై దుబాయ్ విమానాన్ని కూల్చివేసేందుకు కో పైలట్ ప్రయత్నం చేయడం ప్రపంచ వ్యాప్తంగా వార్తయ్యింది.…