Political News

మెగా డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌పై జగన్‌కు అన్ని డౌట్లు!

మెగా డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు ఏడాది అవుతోంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరి ఆరు నెలలు దాటిపోయింది. మరో డీఎస్సీకి, టెట్‌కు అభ్యర్థులు సిద్ధమవుతున్న తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆ డీఎస్సీ నిర్వహణ, ఎంపికపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. గతంలో డీఎస్సీలో ఉద్యోగాలు రాని అభ్యర్థులతో సమావేశం నిర్వహించిన జగన్, ఈరోజు ప్రెస్‌మీట్ పెట్టి డీఎస్సీ ప్రక్రియపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మెగా డీఎస్సీ రిక్రూట్‌మెంట్ జరిగి 9 నెలలు పూర్తయ్యేంతవరకు వైసీపీ దీనిపై ఎటువంటి ఆరోపణలు చేయలేదు. ఇందులో అక్రమాలు జరిగాయంటూ గత నెలలో జగన్ అనుకూల మీడియా పలు కథనాలను ప్రచురించింది. ఇంతసేపు ఆగి ఒక్కసారిగా ఎటాక్ చేయడం వ్యూహాత్మకమని పలువురు భావిస్తున్నారు.

డీఎస్సీలో తమకు అన్యాయం జరిగిందంటూ కొంతమంది తెరపైకి వచ్చారు. వారంతా వైఎస్ జగన్‌ను కలిశారు. ఆ తర్వాత ప్రభుత్వం డీఎస్సీ నిర్వహణపై పూర్తి వివరణ ఇచ్చింది. అయినా కూడా వైఎస్సార్సీపీ ఆందోళనలు ఆపలేదు. జిల్లా కేంద్రాల్లో వైసీపీ శ్రేణులు కొంతమంది అభ్యర్థులతో కలిసి ఆందోళనలు చేపట్టారు.

స్పోర్ట్స్ కోటా కింద 421 పోస్టుల భర్తీలో నిబంధనలు ఉల్లంఘించారని, జీవోలను మార్చడం ద్వారా తప్పుడు సర్టిఫికెట్లు ఉన్నవారికి లబ్ధి చేకూర్చారని మాజీ మంత్రి పేర్ని నాని వంటి సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. ఉద్యోగం రాని నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకుని, కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెంచాలనే ఉద్దేశంతోనే ఈ పేపర్ లీక్, అక్రమాల అస్త్రాన్ని ఆ పార్టీ ప్రయోగించిందని భావిస్తున్నారు.

ఈరోజు ప్రెస్‌మీట్‌లో జగన్ మాట్లాడుతూ, ‘మెగా డీఎస్సీ పేరుతో మీరు నిర్వహించిన 16 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చూస్తే ఎంతమంది ఆవేదనతో ఉన్నారు? మీరు చేసిన గోల్‌మాల్ వ్యవహారాలతో ఎంతమంది కన్నీళ్లు పెడుతున్నారు? ఎంతమంది రోదిస్తున్నారు? డీఎస్సీ మాత్రమే కాదు, ఏ పరీక్షకైనా పేపర్ తయారీ, ప్రశ్నలు అప్‌లోడ్ చేయడం, డిజిటల్ నిర్వహణ ఇవన్నీ కూడా అత్యంత భద్రతతో జరగాలి. కానీ ఈ ప్రభుత్వంలో ఆ రహస్య ప్రక్రియకు పూర్తిగా తూట్లు పొడిచారు’ అని ఆయన ఆరోపించారు.

దీంతోపాటు పలు అంశాలను ఆయన లేవనెత్తారు. గతంలో వైఎస్ జగన్‌ను అభ్యర్థులు కలిసిన సమయంలో నారా లోకేష్ మాస్కో పర్యటనలో ఉన్నారు. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ అందుబాటులోనే ఉన్నారు. జగన్ చేసిన తీవ్ర ఆరోపణలపై ఆయన ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

This post was last modified on June 11, 2026 12:41 pm

Share

Recent Posts

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

7 minutes ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

2 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

2 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

2 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

3 hours ago

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

6 hours ago