Movie News

అఖండ-3 నిజంగా సాధ్యమేనా?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బాలయ్య చాలా ఏళ్ల పాటు వరుస డిజాస్టర్లతో సతమతం అవుతున్న సమయంలో ‘సింహా’తో ఆయనకు మరపురాని విజయాన్నిచ్చిన ఘనత బోయపాటిదే. ఆ తర్వాత కూడా బాలయ్య కెరీర్ స్ట్రగుల్లో ఉన్న సమయాల్లోనే ‘లెజెండ్’, ‘అఖండ’ రూపంలో బ్లాక్ బస్టర్లు ఇచ్చాడు. కానీ వీరి కలయికలో వచ్చిన నాలుగో సినిమా ‘అఖండ-2’ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది.

కథ, సన్నివేశాల విషయంలో మరీ హద్దులు దాటిపోవడం, అంచనాలు మరీ ఎక్కువైపోవడం ఈ సినిమాకు మైనస్ అయింది. ‘అఖండ-2’ అనుకున్నంతగా ఆడని నేపథ్యంలో ఇక ఈ ఫ్రాంఛైజీకి తెరపడిపోతుందా అనే సందేహాలు కలిగాయి. కానీ అదేమీ లేదని తేల్చేశాడు దర్శకుడు బోయపాటి. అఖండ-3 కచ్చితంగా ఉంటుందని తాజాగా బోయపాటి క్లారిటీ ఇచ్చాడు. సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బోయపాటి.. అఖండ-3పై మాట్లాడాడు.

అఖండ-3 కచ్చితంగా ఉంటుందని.. కానీ ఈ ఫ్రాంఛైజీలో సినిమాలకు మధ్య మధ్యలో గ్యాప్ అవసరమని.. బాలయ్య కమిట్మెంట్లు, తన కమిట్మెంట్లు చూసుకుని ఈ సినిమా చేస్తామని బోయపాటి అన్నాడు. ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల కాంబినేషన్లో మల్టీస్టారర్ తీయడం గురించి బోయపాటి మాట్లాడాడు.

చిరు, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ ఇండస్ట్రీకి నాలుగు పిల్లర్లని.. వీరిలో చిరు, బాలయ్య కాంబినేషన్లో సినిమా వస్తే అద్భుతంగా ఉంటుందని.. అది రావాలని బోయపాటి అన్నాడు. తనకు ఆ అవకాశం వస్తే కచ్చితంగా చేస్తానని, అంతకంటే అదృష్టమా అని బోయపాటి అన్నాడు.

టాలీవుడ్ ఇప్పుడు దేశంలోనే నంబర్ వన్ స్థాయిలో ఉందని.. మన సినిమా ఇంకా గొప్ప స్థాయికి వెళ్తుందని బోయపాటి వ్యాఖ్యానించాడు. తన కొత్త సినిమా గురించి అతి త్వరలో ప్రకటన వస్తుందని.. ఆ ప్రకటన చేయడానికి ముందు స్వామి వారి ఆశీస్సులు తీసుకోవాలనే తిరుమలకు వచ్చానని బ్ోయపాటి చెప్పాడు. తన తర్వాతి సినిమా పూర్తి చేశాక బోయపాటి అఖండ-3 చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

This post was last modified on October 6, 2026 8:55 am

Share

Recent Posts

టీనేజ్ ప్రేమలు కాసులు కురిపిస్తాయా

మొన్న గాంధీ జయంతికి విడుదలైన సినిమాల్లో బడ్జెట్ తక్కువే అయినా తెల్లకాగితం అంతో ఇంతో సౌండ్ చేయడంలో సక్సెసయ్యింది. వీడియోలు…

19 minutes ago

మంట‌లు రేపుతున్న `ఫాం-6..`

కొత్త‌గా ఓటు న‌మోదు చేసుకోవాల‌ని అనుకునేవారు.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం వెబ్ సైట్ లేదా..అధికారుల నుంచి ఫాం-6ను తీసుకుని దానిని…

26 minutes ago

మరో విమానంలో సీరియస్ సిగ్నల్స్

విమానాలు భయపెడుతున్నాయి. గత వారం ఫ్లై దుబాయ్ విమానాన్ని కూల్చివేసేందుకు కో పైలట్ ప్రయత్నం చేయడం ప్రపంచ వ్యాప్తంగా వార్తయ్యింది.…

7 hours ago

పవన్ మాటల్లో ఆవేశం ఎందుకు తగ్గింది

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 2024 ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆవేశపూరిత ప్రసంగాలు చేసిన సంగతి…

9 hours ago

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

10 hours ago

సూప‌ర్ హిట్ సీక్వెల్… సైలెంటుగా రెడీ

టాలీవుడ్లో ఏ అంచ‌నాలు లేకుండా వ‌చ్చి సర్పైజ్ హిట్ట‌యిన కొన్ని సినిమాలున్నాయి. అలాంటిదే.. 2018లో విడుద‌లై హుషారు సినిమా. అందులో…

10 hours ago