Movie News

సరైన పుకారు ఎవరు సృష్టించారు

సరైనోడు ఇచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు బోయపాటి శీను కాంబోలో ఒక సినిమా తెరకెక్కే అవకాశముందంటూ నిన్న సోషల్ మీడియాలో కొందరు తెగ ఊదరగొట్టారు. నిజానికి గీత ఆర్ట్స్ అడ్వాన్స్ ఒకటి బోయపాటి దగ్గర ఎప్పటి నుంచో ఉంది. అయితే అది ఖచ్చితంగా బన్నీతో తీయాలనే కండీషన్ మీద అల్లు అరవింద్ ఇవ్వలేదు. సబ్జెక్టుకి తగిన హీరో ఎవరైనా సరే తమ బ్యానర్ మీద తీసేందుకు లాక్ చేసుకున్నారు. ఇదంతా అఖండ 2 తాండవంకు ఏడాది ముందు జరిగిన తతంగం.

తర్వాత దీన్ని అభిమానులు మర్చిపోయారు. కట్ చేస్తే అసలు అల్లు అర్జున్ రెగ్యులర్ కమర్షియల్ డైరెక్టర్లతో పని చేసే ఉద్దేశంలో ఎంత మాత్రం లేడనేది ఓపెన్ గా కనిపిస్తున్న వాస్తవం. అందుకే పుష్ప తర్వాత చాలా వెయిట్ చేసి స్క్రిప్ట్ పూర్తి సంతృప్తికరంగా వచ్చిందని నిర్ధారణ చేసుకున్నాకే రాకా ప్రకటన ఇప్పించాడు. బడ్జెట్ లెక్క చేయమని సన్ పిక్చర్స్ హామీ ఇచ్చాకే ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. ప్లానింగ్ లో అల్లు అర్జున్ ఇంత పర్ఫెక్షన్ మెయింటైన్ చేస్తాడు కాబట్టి ఫలితాలు అలాగే ఉంటాయి.

రాకా ఒక భాగమే వస్తుందా లేక రెండు పార్ట్స్ రిలీజ్ చేస్తారానేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ లెన్త్ ఎక్కువ అవుతోందనిపిస్తే సీక్వెల్ కి ఫిక్స్ అయిపోయి 2028కల్లా రెండూ వచ్చేస్తాయి. ఈలోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే సినిమా మొదలైపోతుంది. దీనికో రెండేళ్లు అవసరం పడొచ్చు. ఇంకోవైపు బాసిల్ జోసెఫ్ తో సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి.
అంతా ఓకె అనుకుంటే ఇది కార్యరూపం దాల్చేందుకు ఎక్కువ టైం పట్టకపోవచ్చు.

ఇంత టైట్ ప్లానింగ్ లో బోయపాటి కాంబో వార్త ఏదో టాపిక్ డైవెర్షన్ కోసం పుట్టించారా లేక ఇంకేదైనా వేరే కారణం ఉందానేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఐకాన్ స్టార్ కమిట్ మెంట్స్ దృష్ట్యా ఈ కలయిక అంత సులభంగా జరిగే పనిలా కనిపించడం లేదు. బన్నీ, బోయపాటి మధ్య రెండు మూడు చర్చలు జరిగాయనే టాక్ అయితే ఉంది..ఏది ఏమైనా బోయపాటి శీను ఇప్పటికిప్పుడు ఎవరితో చేస్తారనేది ఇంకా నిర్ధారణ కాలేదు. బాలయ్యతో అఖండ 3 కూడా ప్రతిపాదనే తప్ప కన్ఫర్మేషన్ కాదు.

This post was last modified on October 6, 2026 12:11 pm

Share

Recent Posts

త్రివిక్రమ్ బాధ్యత గురించి భేతాళ ప్రశ్న

నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా గురించి నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం…

8 minutes ago

రియాలిటీకి దగ్గరగా ఉన్నా కామెంట్స్ తప్పలేదు

నిన్న కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' టైటిల్ రివీల్ టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అరిటాకులో భోజనాలు వడ్డించే ఒక…

29 minutes ago

రాకాతో ఆస్కార్ కొట్టి త‌మిళంలో మాట్లాడ‌తా

ఒక‌ప్పుడు ఆస్కార్ అవార్డుల గురించి ఇండియ‌న్ ఫిలిం మేక‌ర్స్ ఆలోచించ‌డం కూడా క‌ష్టంగా ఉండేది. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా త‌ర్వాత…

3 hours ago

టీనేజ్ ప్రేమలు కాసులు కురిపిస్తాయా

మొన్న గాంధీ జయంతికి విడుదలైన సినిమాల్లో బడ్జెట్ తక్కువే అయినా తెల్లకాగితం అంతో ఇంతో సౌండ్ చేయడంలో సక్సెసయ్యింది. వీడియోలు…

4 hours ago

మంట‌లు రేపుతున్న `ఫాం-6..`

కొత్త‌గా ఓటు న‌మోదు చేసుకోవాల‌ని అనుకునేవారు.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం వెబ్ సైట్ లేదా..అధికారుల నుంచి ఫాం-6ను తీసుకుని దానిని…

4 hours ago

అఖండ-3 నిజంగా సాధ్యమేనా?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బాలయ్య చాలా ఏళ్ల…

9 hours ago