Political News

పవన్ మాటల్లో ఆవేశం ఎందుకు తగ్గింది

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 2024 ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆవేశపూరిత ప్రసంగాలు చేసిన సంగతి తెలిసిందే. ఆ మాటకొస్తే 2019-24 మధ్యలో వైసీపీని, జగన్ ను టార్గెట్ చేస్తూ పవన్ చాలా సార్లు ఫైర్ అవుతూ పవన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే, 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ స్పీచుల్లో ఫైర్ తగ్గిందని, గతంలో మాదిరి జగన్ పై విరుచుకుపడడం లేదని టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే ఆ విషయంపై పవన్ ఈ రోజు క్లారిటీనిచ్చారు.

ఎలక్షన్స్ టైంలో తన స్పీచ్ లు వేరుగా ఉన్నాయని, ఇప్పుడు ఇలా ఎందుకు ఉంటున్నాయని జనసేన కార్యకర్తలు అనుకుంటున్నారని, అది తనకు అర్థమవుతోందని పవన్ లన్నారు. అయితే, ఎన్నికల సమయంలో తన స్పీచ్ లు వేరని, ఇప్పుడు వేరని పవన్ చెప్పారు. యుద్ధం వచ్చినప్పుడు మాట్లాడతానని, అవతలి వారు హద్దులు దాటినప్పుడు తాను ఆవేశంతో మాట్లాడతానని అన్నారు. ఇప్పుడు రాయలసీమ పౌరుషంతో మాట్లాడనని, ఇది శాంతి సమయం అని, అభివృద్ధి సమయం అని పవన్ చెప్పారు. గొడవలు, గొడ్డలి పోట్లు, కొట్లాటలు కాదని, రాయలసీమ అభివృద్ధే తన లక్ష్యమని పవన్ అన్నారు.

వైసీపీ హయాంలో ఇదే ప్రొద్దుటూరులో తాళ్లమాపురం జనసేన కార్యకర్త తన గ్రామ సమస్యలపై వినతి పత్రం ఇస్తే..అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ఆ పత్రాన్ని అక్కడే నలిపి పడేశారని గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన యువకులను జైల్లో పెట్టారని గత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే, ఆ సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ఆయా గ్రామాలకు ఐదు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నానని, ఆ గ్రామ సమస్యలను పరిష్కరించాలని సీఎం చంద్రబాబు సమక్షంలో అధికారులను ఆదేశించారు పవన్.

This post was last modified on October 6, 2026 8:38 am

Share

Recent Posts

టీనేజ్ ప్రేమలు కాసులు కురిపిస్తాయా

మొన్న గాంధీ జయంతికి విడుదలైన సినిమాల్లో బడ్జెట్ తక్కువే అయినా తెల్లకాగితం అంతో ఇంతో సౌండ్ చేయడంలో సక్సెసయ్యింది. వీడియోలు…

17 minutes ago

మంట‌లు రేపుతున్న `ఫాం-6..`

కొత్త‌గా ఓటు న‌మోదు చేసుకోవాల‌ని అనుకునేవారు.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం వెబ్ సైట్ లేదా..అధికారుల నుంచి ఫాం-6ను తీసుకుని దానిని…

25 minutes ago

అఖండ-3 నిజంగా సాధ్యమేనా?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బాలయ్య చాలా ఏళ్ల…

5 hours ago

మరో విమానంలో సీరియస్ సిగ్నల్స్

విమానాలు భయపెడుతున్నాయి. గత వారం ఫ్లై దుబాయ్ విమానాన్ని కూల్చివేసేందుకు కో పైలట్ ప్రయత్నం చేయడం ప్రపంచ వ్యాప్తంగా వార్తయ్యింది.…

7 hours ago

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

10 hours ago

సూప‌ర్ హిట్ సీక్వెల్… సైలెంటుగా రెడీ

టాలీవుడ్లో ఏ అంచ‌నాలు లేకుండా వ‌చ్చి సర్పైజ్ హిట్ట‌యిన కొన్ని సినిమాలున్నాయి. అలాంటిదే.. 2018లో విడుద‌లై హుషారు సినిమా. అందులో…

10 hours ago