Political News

మంట‌లు రేపుతున్న `ఫాం-6..`

కొత్త‌గా ఓటు న‌మోదు చేసుకోవాల‌ని అనుకునేవారు.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం వెబ్ సైట్ లేదా..అధికారుల నుంచి ఫాం-6ను తీసుకుని దానిని ఫిల‌ప్ చేసి అందిస్తే.. విచార‌ణ త‌ర్వాత అధికారులు ఓటు హ‌క్కును ప‌రిశీలించి ఓటును క‌ల్పిస్తారు. ఇది.. ఇప్ప‌టి వ‌ర‌కు అంటే.. ఈ ఏడాది జూలై వ‌ర‌కు ఎలాంటి వివాదాల‌కు అవ‌కాశం లేకుండా జ‌రిగిన సాఫీ ప్ర‌క్రియ‌. కానీ, జూలై త‌ర్వాత‌.. అనూహ్యంగా ఫాం-6కు సంకెళ్లు ప‌డ్డాయి. ఈ ఫాం-6లో న‌మోదు చేసే వివ‌రాల‌కు.. 2002 నాటి ఎన్నిక‌ల జాబితాతో(సుమారు 14 ఏళ్ల కింద‌టి జాబితా) కేంద్ర ఎన్నిక‌ల సంఘం ముడి పెట్టింది. ఇది కాస్తా వివాదం అయింది.

తాజాగా ఈ వ్య‌వ‌హారంపై విచార‌ణ జ‌రిపిన సుప్రీంకోర్టుకు.. అయ్యా మీరు చెబితేనే అలా చేశాం అంటూ ఎన్నిక‌ల సంఘం వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. దీనిని సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించింది. మేం అలా చెప్ప‌లేదు. మీరేమైనా క‌ల‌గ‌న్నారా? అని ఘాటుగానే వ్యాఖ్యానించి.. ఎన్నిక‌ల సంఘాన్ని త‌ప్పుబ‌ట్టింది. అంతేకాదు.. అస‌లు ఫాం -6లో మార్పులు ఎందుకు చేశారు? ఎవ‌రు ఛేశారు? ఎన్నిక‌ల సంఘంలోని ముగ్గురు క‌మిష‌నర్ల సంయుక్త నిర్ణ‌య‌మా? ఒక్క‌రే తీసుకున్న నిర్ణ‌య‌మా? అని కూడా నిల‌దీసింది. మొత్తంగా ఈ వ్య‌వ‌హారంపై త‌మ‌కు అఫిడ‌విట్ రూపంలో వివ‌ర‌ణ స‌మ‌ర్పించాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

క‌ట్ చేస్తే..

తాజాగా ఫాం-6పై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య‌ల‌తో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్ చుట్టూ మ‌రిన్ని ప్ర‌శ్న‌లు అల్లుకున్నాయి. సుప్రీంకోర్టు చెప్ప‌న‌ప్పుడు.. ఫాం-6లో మార్పులు చేయాల‌ని ఎవ‌రు చెప్పారు? ఎందుకు చేశారు? అని ప్ర‌తిప‌క్షాలు స‌హా.. సోష‌ల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. ఫాం-6లో 2002 నాటి జాబితాను ఎందుకు పేర్కొన్నారు? మార్పులు ఎందుకు చేశారు? ఎవ‌రి ప్రోద్బ‌లంతో మార్పులు చేశార‌ని ప్ర‌శ్న‌లు గుప్పిస్తున్నారు. దీనికి ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం స‌మాధానం చెప్ప‌లేదు. అయితే.. ఇప్ప‌టికే ఆ నిబంధ‌న‌(2002 నాటి జాబితా)ను తొల‌గించాం అని మాత్రమే పేర్కొంది.

అస‌లేంటి వివాదం?

దేశంలో ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (స‌ర్‌) ప్రక్రియలో భాగంగా జూలైలో ఆన్‌లైన్ ఫాం-6లో ఒక కొత్త డిక్లరేషన్‌ను ఎన్నిక‌ల సంఘం జోడించింది. దీని ప్రకారం, దరఖాస్తుదారుడు తన పేరుగానీ, లేదా వారి తల్లిదండ్రులు, తాతముత్తాతల పేర్లు గత ఎస్‌ఐఆర్(2002) ఓటర్ల జాబితాలో ఉన్నాయా లేదా అనే వివరాలను తప్పనిసరిగా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇవి లేక‌పోతే.. ఓటు హ‌క్కుల‌భించ‌దు. ఆన్‌లైన్ పోర్టల్‌లో ఈ డిక్లరేషన్ పూర్తి చేయకుంటే ఫాం-6 సబ్మిట్ చేయడం సాధ్యమ‌య్యేది కాదు. దీంతో దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఓట్ చోరీ అంటూ.. ప్ర‌తిప‌క్షాలు ఎన్నిక‌ల సంఘంపై నిప్పులు చెరిగాయి. ఇప్పుడు ఈ వివాద‌మే భోగి మంట‌గా మారింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on October 6, 2026 8:35 am

Share

Recent Posts

టీనేజ్ ప్రేమలు కాసులు కురిపిస్తాయా

మొన్న గాంధీ జయంతికి విడుదలైన సినిమాల్లో బడ్జెట్ తక్కువే అయినా తెల్లకాగితం అంతో ఇంతో సౌండ్ చేయడంలో సక్సెసయ్యింది. వీడియోలు…

18 minutes ago

అఖండ-3 నిజంగా సాధ్యమేనా?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బాలయ్య చాలా ఏళ్ల…

5 hours ago

మరో విమానంలో సీరియస్ సిగ్నల్స్

విమానాలు భయపెడుతున్నాయి. గత వారం ఫ్లై దుబాయ్ విమానాన్ని కూల్చివేసేందుకు కో పైలట్ ప్రయత్నం చేయడం ప్రపంచ వ్యాప్తంగా వార్తయ్యింది.…

7 hours ago

పవన్ మాటల్లో ఆవేశం ఎందుకు తగ్గింది

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 2024 ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆవేశపూరిత ప్రసంగాలు చేసిన సంగతి…

9 hours ago

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

10 hours ago

సూప‌ర్ హిట్ సీక్వెల్… సైలెంటుగా రెడీ

టాలీవుడ్లో ఏ అంచ‌నాలు లేకుండా వ‌చ్చి సర్పైజ్ హిట్ట‌యిన కొన్ని సినిమాలున్నాయి. అలాంటిదే.. 2018లో విడుద‌లై హుషారు సినిమా. అందులో…

10 hours ago