Movie News

సోగ్గాడి స్థానంలో కింగ్ వస్తున్నాడా ?

కొన్ని నెలల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. 2027 సంక్రాంతికి థియేటర్లను బ్లాస్ట్ చేయబోతున్నాం అనే తరహాలో ఒక ట్వీట్ వేశారు. సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు కలయికని కన్ఫర్మ్ చేస్తూ అందులో సంకేతాలిచ్చారు. నాగార్జున ఒక్కరే కాకుండా నాగచైతన్య, అఖిల్ కూడా అందులో ఉంటారనే ప్రచారం జోరుగా జరిగింది. అయితే ఇప్పటిదాకా ఇది సెట్స్ కి వెళ్లడం కాదు కదా కనీసం ప్రారంభోత్సవం కూడా జరుపుకోలేదు. అసలు ట్విస్టు వేరే ఉందట.

ప్రస్తుతం రా కార్తీక్ దర్శకత్వంలో తన వందో సినిమా చేస్తున్న నాగార్జున ఇప్పుడు సోగ్గాడే సీక్వెల్ స్థానంలో కింగ్ 100 సంక్రాంతి రిలీజ్ చేసే దిశగా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. లాటరీ కింగ్ టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ క్రైమ్ అండ్ మనీ హీస్ట్ థ్రిల్లర్ ద్వారా చాలా గ్యాప్ తర్వాత టబు నాగ్ మూవీలో నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటిదాకా సగానికి పైగా షూట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ బయటికి రాలేదు.

ఎలాగూ ఆగస్ట్ నుంచి డిసెంబర్ దాకా చాలా ప్యాన్ ఇండియా సినిమాలు క్యూ కట్టి ఉన్నాయి. జైలర్ 2, ది ప్యారడైజ్, విశ్వంభర, స్వయంభు, సంబరాల ఏటిగట్టు మొదలైనవన్నీ నెలకు ఒకటి రెండు చొప్పున క్యూ కట్టి ఉన్నాయి. ఇలా వీటితో పోటీ పడేకంటే సంక్రాంతికి పెద్ద సినిమాలతో క్లాష్ అవ్వడం వల్ల వచ్చే ప్రయోజనమే ఎక్కువ ఉంటుందని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కాబట్టి నిర్ధారించలేం.

ఒకవేళ నిజమే అయితే కింగ్ 100 సెలెబ్రేట్ చేసుకోవడానికి ఫ్యాన్స్ కి సంక్రాంతికి మించిన మంచి ఆప్షన్ వేరే ఉండదు. స్టార్ డైరెక్టర్ కాకుండా కార్తీక్ కి అవకాశం ఇవ్వడం పట్ల ఫ్యాన్స్ లో పలు అనుమానాలు ఉన్నప్పటికీ కంటెంట్ చాలా బాగా వచ్చిందని, పీరియాడిక్ సెటప్ లో నాగార్జునని వివిధ షేడ్స్ లో చూడటం ఆశ్చర్యానికి గురి చేస్తుందని యూనిట్ సభ్యులు అంటున్నారు. డీ ఏజింగ్ టెక్నాలజీ కూడా దీనికి వాడారు. దసరాకు టీజర్ వచ్చే అవకాశాలున్నాయి.

This post was last modified on June 11, 2026 10:09 am

Share

Recent Posts

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

1 hour ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

1 hour ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

1 hour ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

2 hours ago

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

5 hours ago

అంతా బానే ఉన్నట్టుగా వైసీపీ ప్రచారం

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యం మాట ఎలా ఉన్నా.. నాయ‌కుల‌ను బ‌లోపేతం చేసేందుకు.. వారిని కొంత ఉత్తేజ ప‌రిచేందుకు…

5 hours ago