Political News

పవన్ తెలంగాణ రాకూడదంటే… రాహుల్ కూడా అంతేగా?

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలంగాణ‌పై కాంగ్రెస్ నేత‌ల వైఖ‌రిని సూటిగా ప్ర‌శ్నించారు. తెలంగాణ‌లో త‌న‌ను అడుగు పెట్టొద్ద‌ని అన్నార‌ని చెప్పిన ఆయ‌న‌.. అలాంట‌ప్పుడు.. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ కూడా ఉత్త‌రాదికి చెందిన నాయ‌కుడు కాబ‌ట్టి.. ఆయ‌న కూడా తెలంగాణ స‌హా.. ద‌క్షిణాది రాష్ట్రాల్లోకి రాకూడ‌ద‌ని వ్యాఖ్యానించారు. అయితే.. తాను అలా చెప్పే వ్య‌క్తిని కాద‌న్నారు. సువిశాల భారత దేశంలో ఎవ‌రు ఎక్క‌డినుంచి ఎక్కడికైనా వెళ్లొచ్చ‌ని.. నివసించొచ్చ‌ని రాజ్యాంగ‌మే చెబుతోంద‌ని తెలిపారు. ఢిల్లీలో ప‌ర్య‌టిస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌..ఓ జాతీయ మీడియా పాడ్ కాస్ట్ లో పాల్గొన్నారు.

రేవంత్‌కు చుర‌క‌లు..

ఈ సంద‌ర్భంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డికి ప‌రోక్షంగా చుర‌క‌లు అంటించారు. ముఖ్య‌మంత్రుల స్థాయిలో ఉన్న‌వారే.. ఉత్త‌రాది, ద‌క్షిణాది రాష్ట్రాలు అంటూ.. గోడ‌లు క‌ట్టుకుంటున్నార‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. కానీ, ఇది ఆ స్థాయిలో ఉన్న నాయ‌కుల‌కు స‌రైన విధానం కాద‌న్నారు. 550 సంస్థాల‌ను ఏకం చేసి.. ఏర్ప‌రుచుకున్న దేశంలో నాది.. నీది అంటూ ఏమీ ఉండ‌ద‌ని.. అన్నీ అంద‌రివీ అనే భావ‌న ముఖ్య‌మని చెప్పారు. ఇలా మాట్లాడుతున్న సీఎంలు స‌రిచేసుకోవాల‌ని సూచించారు. అంతేకాదు.. తాను తెలంగాణ‌లోకి రావాల‌ని.. పార్టీని విస్త‌రించాల‌ని అనుకోవ‌డం లేద‌న్నారు. కానీ, తన పార్టీ కార్య‌క‌ర్త‌లు కోరితే.. వ‌చ్చాన‌న్నారు.

తెలంగాణ అన్ని విధాలా అభివృద్ధి చెందాల‌ని కోరుకునే వ్య‌క్తుల్లో తానే ముందుంటాన‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు. తాను తెలంగాణ‌కు వ్య‌తిరేక‌మ‌ని కొంద‌రు ప్ర‌చారం చేస్తున్నార‌ని.. కానీ, ఇది త‌ప్ప‌ని చెప్పారు. తాను తెలంగాణ ఏర్పాటుకు ఎప్పుడూ వ్య‌తిరేకం కాద‌న్నారు. కానీ.. విభ‌జ‌న జ‌రిగిన తీరును మాత్ర‌మే తాను విమ‌ర్శించాన‌ని తెలిపారు.

చెప్పే మాటల్లో చేసే ప‌నుల్లో హేతు బ‌ద్ధ‌త అత్యంత ముఖ్య‌మని.. అలాంటి వారినే నేటి యువ‌త కోరుకుంటున్నార‌ని చెప్పారు. తెలంగాణ యువ‌త‌కు చాలానే ఆకాంక్ష‌లు ఉన్నాయ‌ని.. వారు స‌రైన నేత కోసం ఎదురు చూస్తున్నార‌ని తెలిపారు. పార్టీని విస్త‌రించేందుకు దృష్టి పెడ‌తామ‌ని తెలిపారు. తాను ఎవ‌రికీ… వ్య‌తిరేకం కాద‌న్నారు. జాతీయ భావాల‌ను నేటి యువ‌త తెలుసుకోవాల‌ని ఆయ‌న సూచించారు.

This post was last modified on June 10, 2026 10:35 pm

Share

Recent Posts

నాని జడల లుక్… అందరూ వద్దే వద్దన్నా

టాలీవుడ్ దర్శకుల్లో కొత్త కథలతో ప్రయాణం చేస్తూ, ఒక కన్విక్షన్‌తో సినిమాలు తీసే దర్శకుల్లో సుకుమార్ పేరు ముందు వరుసలో…

5 hours ago

ఎగతాళి చేస్తారని ఆ విషయం దాచేసిన సందీప్ కిషన్

సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టి.. ఎన్నికల్లో పోటీ చేసిన తొలి ప్రయత్నంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి అయిపోయాడు విజయ్.…

5 hours ago

లైవ్ లోనే టీ-షర్ట్ విప్పేసిన సల్మాన్ ఖాన్

నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే.. ఎక్కడ చూసినా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ వీడియోనే…

6 hours ago

విద్యార్థినుల సింగిల్ జడలు కత్తిరించింది ఎవరు?

ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రభుత్వ హాస్టల్ లో నిద్రస్తున్న విద్యార్థినుల జడలు కత్తిరించడం కలకలం రేపింది. కేవలం సింగిల్ జడ…

6 hours ago

నిన్న మల్లెపూల పల్లకి… రేపు రఘుకుల తిలకా రారా

ఫిలిం ఇండ‌స్ట్రీలో ఒక సినిమా పెద్ద హిట్ట‌యిందంటే.. ఆ చిత్రానికి క‌లిసొచ్చిన పాయింట్లేంటో చూసుకుని… ఆ అంశాలు త‌మ చిత్రాల్లో…

6 hours ago

హైదరాబాద్‌లో వరల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్.. చిరు మాస్టర్ ప్లాన్

వరల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్ మన హైదరాబాద్‌కు రాబోతోందనే వార్త నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాను ఊపేస్తోంది. టాలీవుడ్ స్టార్…

10 hours ago