Movie News

లైవ్ లోనే టీ-షర్ట్ విప్పేసిన సల్మాన్ ఖాన్

నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే.. ఎక్కడ చూసినా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ వీడియోనే కనిపిస్తోంది. బిగ్ బాస్ షోకు హోస్ట్‌గా వ్యవహరించే సల్మాన్.. లైవ్‌లో తన షర్ట్ విప్పేసి తీవ్ర ఆగ్రహంతో మాట్లాడుండడం కనిపిస్తోంది. మొదట ఇది చూసి బిగ్ బాస్ కంటెస్టెంట్లలో ఎవరితోనో వాగ్వాదం జరిగి.. వాళ్లకు బుద్ధి చెప్పడానికి సల్మాన్ ఇలా చేశాడేమో అనుకున్నారు చాలామంది.

కానీ సల్మాన్ బుద్ధి చెప్పాలనుకున్నది బిగ్ బాస్ పోటీదారులకు కాదు. సోషల్ మీడియాలో ఊరూ పేరు లేకుండా అకౌంట్లు నడుపుతూ.. ఫిలిం సెలబ్రెటీలతో పాటు అందరినీ అదే పనిగా ట్రోల్ చేసే వాళ్లకు. సోషల్ మీడియా ట్రోలింగ్, హేట్ క్యాంపైనింగ్ రోజు రోజుకూ పెరిగిపోతుండడం.. బాడీ షేమింగ్ అన్నది శ్రుతి మించుతుండడం.. అది సెలబ్రెటీల మానసిక ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపే స్థాయికి వెళ్తుండడం సల్మాన్ ఖాన్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఎన్నో రోజులుగా దాచుకున్న కోపాన్నంతా సల్మాన్.. నిన్న వెళ్లగక్కేశాడు.

ఈ మధ్య సల్మాన్ ఒక సందర్భంలో బయట కనిపించినపుడు ఆయన లుక్ అంత గొప్పగా అనిపించలేదు. మెయింటైనెన్స్ తగ్గినట్లు.. వయసు ప్రభావం పడుతున్నట్లు కనిపించింది. బహుశా ఆ సమయానికి ఆయన కొంచెం అనారోగ్యంతో ఉండి ఉండొచ్చు కూడా. అప్పుడు సల్మాన్ లుక్ మీద కొంత ట్రోలింగ్ జరిగింది.

ఇక వర్తమానంలోకి వస్తే.. రెండు రోజుల ముందు ముంబయిలో ఒక కార్యక్రమానికి హాజరైన కత్రినా కైఫ్‌ను చూసి నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. పెళ్లి తర్వాత క్రమంగా సినిమాలకు దూరమైన కత్రినా.. బాగా లావై కనిపించింది. దీంతో అప్పుడు, ఇప్పుడు అంటూ ఆమె పాత, కొత్త ఫొటోలు పెట్టి నెటిజన్లు కామెంట్లు చేశారు. సల్మాన్‌కు కత్రినా సన్నిహితురాలన్న సంగతి తెలిసిందే.

ఈ పరిణామాలన్నీ గమనించే సల్మాన్‌ ఇలా రియాక్టయ్యాడనిపిస్తోంది. 60 ఏళ్ల వయసులో నేనెంత ఫిట్‌గా ఉన్నానో చూడండి.. అంతకంటే ముందు మీ అవతారం చూసుకోండి.. మీ తల్లిదండ్రుల బాగోగులు చూడండి అంటూ ట్రోలర్స్‌కు గట్టిగా గడ్డిపెట్టాడు సల్మాన్. ఆయన చర్య పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

This post was last modified on September 20, 2026 1:19 pm

Share

Recent Posts

కమల్ కోసం రజినీ త్యాగం?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…

1 hour ago

‘కామ్రేడ్ కళ్యాణ్’ను కాపాడిన మెగాస్టార్

ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…

2 hours ago

కోన వెంకట్ భాషలో ‘క్రిమినల్స్’ ఎవరు

నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…

4 hours ago

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…

5 hours ago

విజయ్ చెప్పింది ప్రాక్టికల్‌గా సాధ్యమేనా

రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…

5 hours ago

జంతర్ మంతర్… కేసీఆర్ ముందే పసిగట్టారా?

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…

8 hours ago