Political News

ఏపీలో అధికారులు పని చేయట్లేదు!

నిజమే… ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా కూడా ఏపీలో అధికారులు పని చేయడం లేదని చెప్పక తప్పదు. స్వయంగా మంత్రులు ఆదేశాలు జారీ చేసినా పనులు కావడం లేదంటే… అధికారులు పని చేయనట్టే కదా. ఈ తరహా అధికారుల తీరుపై స్వయంగా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణే ఆగ్రహం వ్యక్తం చేశారు కదా. తాజాగా జనసేనకే చెందిన కీలక నేత, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పవన్ మాదిరే అధికారుల తీరుపై మండిపడ్డారు. అంతేకాదండోయ్…తాను చెప్పిన పనిని అధికారులు చేయలేదని గ్రహించిన నాదెండ్ల స్వయంగా 2 గంటల పాటు నడిరోడ్డుపై కూర్చుని మరీ సిబ్బందితో పని చేయించారు.

ఈ ఘటన బుధవారం నాదెండ్ల ప్రాతినిధ్యం వహిస్తున్న తెనాలి నియోజకవర్గ పరిధిలోనే చోటుచేసుకుంది. తెనాలి శాసనసభ్యుడిగా ఉన్న నాదెండ్ల రెండు రోజుల క్రితం పట్టణంలో పర్యటించిన సందర్భంగా ఓ ప్రదేశంలో పేరుకుపోయిన చెత్తను అధికారులకు చూపించారు. ఆ చెత్తను తక్షణమే తొలగించాలని, పట్టణంలోని అన్ని ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి చెప్పినప్పుడు వినయంగా సరేనని చెప్పిన అదికారులు… మంత్రి అటు వెళ్లగానే వీరూ ఇటు వెళ్లిపోయారు. ఎక్కడి చెత్త అక్కడే అన్నట్టుగా పరిస్థితి మారింది.

తాజాగా బుధవారం కూడా తెనాలిలో పర్యటించిన నాదెండ్ల రెండు రోజుల క్రితం తాను తిరిగిన ప్రదేశం నుంచే వెళ్లారు. ఈ సందర్భంగా తాను తీసేయమని చెప్పిన చెత్తా చెదారం అక్కడే ఆయనకు కనిపించింది. అంతే మునిసిపల్ అదికారులను పిలిచిన నాదెండ్ల.. ఇదేంటి?.. ఈ చెత్త ఇంకా ఇక్కడే ఉంది?. తీసివేయమని చెప్పా కదా అంటూ ఆరా తీశారు. మంత్రి తమ అసలత్వాన్ని గుర్తించారని తెలుసుకున్న అధికారులు… టెండర్లు పిలిచి చెత్త తీసి వేయాల్సి ఉందని తమను తాము కవర్ చేసుకునే యత్నం చేశారు.

అదికారుల నుంచి అలాంటి సమాదానం ఆశించని నాదెండ్ల… మునిసిపాలిటీలో చెత్తా చెదారాన్ని తీసివేసేందుకు పురపాలక సంస్థకు ట్రాక్టర్లు ఉన్నాయి, జేసీబీలు ఉన్నాయి కదా… మరి చెత్త తీసివేసేందుకు టెండర్లు ఎందుకు? అని ప్రశ్నించారు. పట్టణంలోని చెత్తను తీసివేసేందుకే కదా ట్రాక్టర్లు, జేసీబీలు కొన్నది అని కూడా మంత్రి గుర్తు చేశారు. అయినా ఇంకా అదికారులు నీళ్లు నములుతున్న వైనాన్ని చూసి మరింత ఆగ్రహానికి గురైన నాదెండ్ల… సదరు చెత్తను తీస్తే తప్పించి తాను ఇక్కడి నుంచి కదలబోనని రోడ్డు మీదే నిలబడిపోయారు. దీంతో పరుగు లంకించుకున్న అధికారులు.. అప్పటికప్పుడు పారిశుద్ధ్య సిబ్బందిని పిలిపించి ఆ చెత్తను తీసివేయించారు.

This post was last modified on June 10, 2026 9:34 pm

Share

Recent Posts

పోటీ హడావిడి… నిలుస్తుందా గరివిడి

దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…

11 minutes ago

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

1 hour ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

3 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

3 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

3 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

4 hours ago