టాలీవుడ్ దర్శకుల్లో కొత్త కథలతో ప్రయాణం చేస్తూ, ఒక కన్విక్షన్‌తో సినిమాలు తీసే దర్శకుల్లో సుకుమార్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఆయన శిష్యుల్లోనూ ఇదే తపనను చూడొచ్చు. ‘దసరా’ సినిమాతో తాను గురువుకు తగ్గ శిష్యుడినే అని శ్రీకాంత్ ఓదెల రుజువు చేశాడు. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’తో అంతకుమించి సెన్సేషన్ క్రియేట్ చేసేలా కనిపిస్తున్నాడు. ఫస్ట్ గ్లింప్స్ చూస్తేనే శ్రీకాంత్ సంచలనాత్మకంగా ఏదో చేయబోతున్నాడని అర్థమైంది.
ఆ గ్లింప్స్ చివర్లో వచ్చిన డైలాగ్.. నాని చేతి మీద పచ్చబొట్టు.. రెండు జడలతో నాని లుక్ చూసి ప్రేక్షకుల మతిపోయింది. ఐతే ఇంత కొత్తగా, బోల్డ్‌గా ఏదైనా రాయాలన్నా, తీయాలన్నా రచయితలు-దర్శకులకు హీరోల ప్రోత్సాహం తప్పనిసరి. వాళ్లు అంగీకరించకపోతే కొత్త ఆలోచనలు బయటికే రావు. తెలుగు సినిమా ఎంత మారినా సరే.. ఒక స్టార్ హీరో రెండు జడలతో కనిపించడం అన్నది ఊహకందని విషయం.
నిజానికి తాను ఈ ఆలోచన చెప్పినపుడు తన టీంలో అందరూ వ్యతిరేకించారని మీడియాకు తెలిపాడు శ్రీకాంత్ ఓదెల. కానీ నాని మాత్రం వెంటనే ఈ లుక్‌కు ఓకే చెప్పడంతో తనకు కొండంత బలం వచ్చినట్లయిందని అతనన్నాడు. ఈ చిత్రంలో ఆ జడలే నాని క్యారెక్టర్ ఆయుధమని.. యాక్షన్ సీక్వెన్సుల్లో అవి తిరుగుతుంటే గూస్‌బంప్స్ గ్యారెంటీ అని శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు.
ఇక ఈ సినిమాకు చాలా రీషూట్లు జరిగాయనే ప్రచారం గురించి శ్రీకాంత్ స్పందిస్తూ.. సినిమాలో రీషూట్లు అనే ముచ్చటే లేదని.. కానీ షాట్ పర్ఫెక్ట్‌గా వచ్చే వరకు వంద సార్లయినా తీస్తానని అతనన్నాడు. అందుకే ఈ సినిమాకు 171 వర్కింగ్ డేస్ అయ్యాయని.. ప్రతి సీన్లో వందల మంది జనంతో తిరుగుబాటును చూపించాలంటే అన్ని రోజులు కష్టపడక తప్పలేదని చెప్పాడు.
సినిమాలో నాలుగు భారీ యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయన్న శ్రీకాంత్.. అవి ఎంత మంచి అనుభూతిని ఇచ్చినా సరే, థియేటర్ల నుంచి ప్రేక్షకుడు ఇంటికి మోసుకెళ్లేది మాత్రం ప్యూర్ ఎమోషనే అని స్పష్టం చేశాడు. సినిమా చూసి బయటకొచ్చేటప్పుడు యాక్షన్ కాదు… ఎమోషనే రక్తాన్ని మరిగిస్తుందన్నాడు. మోహన్ బాబునే సినిమాలో మెయిన్ విలన్ అని.. ఆయనతో నాని ఫేస్-ఆఫ్ సీన్లో థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని అన్నాడు.
టీజర్లో డైలాగులు మరీ ఫాస్ట్‌గా ఉన్నాయని విమర్శించిన వాళ్లకు థియేటర్లలో సన్నివేశాల ఫ్లో చూశాక మైండ్ బ్లాంక్ అవుతుందన్నాడు. సినిమాలో మొత్తం ఆరు పాటలుంటాయని.. బీజీఎంకు థియేటర్లు హోరెత్తిపోతాయని శ్రీకాంత్ చెప్పాడు. ఈ సినిమాకు పార్ట్-2, సీక్వెల్ లాంటివేమీ ఉండవని.. ఇది ఒకటే కథ అని శ్రీకాంత్ స్పష్టం చేశాడు.
This post was last modified on September 20, 2026 2:36 pm
మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…
ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…
యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…
అగ్గిపెట్టి మచ్చా.. సోషల్ మీడియా వాడే తెలుగు వాళ్లకు ప్రత్యేకంగా ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతడి…
న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…