Movie News

నిన్న మల్లెపూల పల్లకి… రేపు రఘుకుల తిలకా రారా

ఫిలిం ఇండ‌స్ట్రీలో ఒక సినిమా పెద్ద హిట్ట‌యిందంటే.. ఆ చిత్రానికి క‌లిసొచ్చిన పాయింట్లేంటో చూసుకుని… ఆ అంశాలు త‌మ చిత్రాల్లో ఉండేలా చూసుకుంటుంటారు ఫిలిం మేక‌ర్స్. కొన్ని అంశాలు సెంటిమెంటుగా కూడా మారిపోతుంటాయి. గ‌త కొన్నేళ్ల‌లో టాలీవుడ్ నుంచి అతి పెద్ద సెన్సేష‌న్‌గా మారిన‌ ఇరుముడి సినిమాను కూడా ఇక‌పై చాలామంది అనుస‌రిస్తార‌న‌డంలో సందేహం లేదు.

యువ క‌థానాయ‌కుడు కిర‌ణ్ అబ్బ‌వ‌రం కూడా ఇరుముడి ఇన్‌స్పిరేష‌న్‌తో త‌న సినిమాలో ఒక ఫేమ‌స్ దేవుడి పాట‌ను పెట్టుకోబోతున్న‌ట్లు స‌మాచారం. ఇరుముడిలో మ‌ల్లెపూల ప‌ల్ల‌కి పాట ఎంత పెద్ద సెన్సేష‌న్ అయిందో తెలిసిందే. ప్రేక్ష‌కులే డిమాండ్ చేసి మ‌రీ ఈ పాట సినిమాలో పెట్టేలా చేశారు. పాట రిలీజ్ చేసిన‌పుడు కొంత నెగెటివిటీ క‌నిపించినా.. సినిమాలో మాత్రం ఆ సాంగ్ బాగా హైలైట్ అయింది. సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ కావ‌డానికి తోడ్ప‌డింది.

ఇప్పుడు కిర‌ణ్ అబ్బ‌వ‌రం త‌నే డైరెక్ట్ చేస్తున్న రియాలిటీ సినిమాలో మ‌ల్లెపూల ప‌ల్ల‌కి లాంటి పాట‌నే వాడుకోబోతున్నాడ‌ట‌. ఈ మ‌ధ్య కాలంలో సోష‌ల్ మీడియాలో బాగా పాపుల‌ర్ అయిన ఫోక్ సాంగ్ ర‌ఘుకుల తిలక రారా పాట‌కు సంబంధించిన హ‌క్కుల‌ను కిర‌ణ్ తీసుకున్నాడ‌ట‌. ఫోక్ సింగ‌ర్స్ పాడిన ఈ పాట తెలుగువారిని అమితంగా ఆక‌ట్టుకుని సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఈ పాట‌ను రియాలిటీ సినిమాలో సంద‌ర్భానికి త‌గ్గ‌ట్లు వాడుకోబోతున్నార‌ట‌.

భీమ్స్ ఒరిజిన‌ల్ సాంగ్ తీసుకుని దానికి సొబ‌గులు అద్దే ప్ర‌య‌త్నంలో ఉన్నాడు. సిచువేష‌న్ స‌రిగ్గా కుదిరితే ఈ పాట కూడా సెన్సేష‌న్ క్రియేట్ చేయొచ్చు. సినిమాకు అసెట్ కావ‌చ్చు. ఆల్రెడీ పాపుల‌ర్ అయిన పాట‌ను త‌న సినిమాలో వాడుకుని ట్రెండింగ్‌లోకి తీసుకురావ‌డం కిర‌ణ్‌కు కొత్త కాదు. కేర్యాంప్ సినిమాలో ఇదేమిటమ్మా మాయ పాట ఎలా వైర‌ల్ అయిందో తెలిసిందే. ర‌ఘుకుల త‌న‌యా పాట కూడా అలా క్లిక్ అయితే.. ఇక‌పై ప్ర‌తి సినిమాకూ ఈ ట్రెండ్ కొన‌సాగిస్తాడేమో అబ్బ‌వ‌రం.

This post was last modified on September 20, 2026 1:18 pm

Share

Recent Posts

249 కొట్టినా గెలవలేని టీం ఇండియా

టీ20 మ్యాచ్‌లో 249 పరుగులు చేస్తే గెలుపు దాదాపు ఖాయమని అనుకుంటాం. కానీ వెస్టిండీస్ బ్యాటర్లు ఆ అంచనాలను తలకిందులు…

6 hours ago

బ్లాక్ బస్టర్ మనకెందుకు నచ్చడం లేదంటే

కన్నడలో గత నెల 25 ప్యారడైజ్ తో పాటుగా విడుదలైన ప్రేమద ఊరల్లీ భీభత్సమైన కలెక్షన్లతో కర్ణాటకలో అదరగొడుతోంది. రెండో…

7 hours ago

అష్ట‌దిగ్భంధ‌నంలో దేశ రాజధాని

వైద్య విద్య ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించిన నీట్ ప‌రీక్ష పేప‌ర్ లీక్‌కు సంబంధించి కాక్రోచ్ జ‌న‌తా పార్టీ చేసిన నిర‌స‌న…

8 hours ago

తెలంగాణ హీరో రాయలసీమ యాస పేలిందా

ఒక ప్రాంతానికి సంబంధించిన పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ సినిమాలు తీసేటప్పుడు యాస విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డైలాగులు రాయడం…

8 hours ago

కొత్త ప్రభుత్వాలు బలంగానే ఉన్నాయి

తాజాగా మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో అధికారంలో ఉన్న పార్టీలే హ‌వా చూపించాయి.…

8 hours ago

బీసీ రిజర్వేషన్ల విషయంలో తగ్గేదెలే అంటున్న చంద్రబాబు

బీసీలంటే వెనక బడిన కులాలు కాదు బ్యాక్ బోన్ కులాలంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నానికి సుప్రీం కోర్టు తీర్పుతో ఆటంకం…

9 hours ago