Movie News

రామ్ చరణ్ 17… లాంగ్ వెయిటింగ్ తప్పదు

పెద్ది విజయాన్ని ఆస్వాదిస్తున్న రామ్ చరణ్ త్వరలోనే చేతికి కీలకమైన సర్జరీ చేయించుకోబోతున్నాడు. ప్రమోషన్ల కోసమే దాన్ని బ్రేక్ వేస్తూ వచ్చిన మెగా పవర్ స్టార్ ఇప్పుడా బాధ్యత తీరిపోవడంతో ఆరోగ్యం మీద దృష్టి పెట్టాల్సిన టైం వచ్చింది. మరీ సీరియస్ కాకపోవడంతో డాక్టర్ల సలహాలకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈవెంట్లు గట్రా పాల్గొన్నాడు. ఫ్యాన్స్ సమక్షంలో సక్సెస్ మీట్ ఉంటుందనే వార్తల నేపథ్యంలో అదయ్యాక ఆపరేషన్ ఉండొచ్చు.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం రామ్ చరణ్ పూర్తిగా మూడు నెలలు విశ్రాంతి తీసుకోబోతున్నాడు. అంటే నవంబర్ లేదా డిసెంబర్ దాకా అందుబాటులోకి వచ్చే ఛాన్స్ లేదు. ఈ లోగా ఆర్సి 17 కోసం దర్శకుడు సుకుమార్ ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధం చేయడంతో పాటు ప్రీ ప్రొడక్షన్ పనుల మీద దృష్టి పెట్టొచ్చు. అయితే ఫుల్ వెర్షన్ సిద్ధంగా ఉందా లేదానేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి సుకుమార్ బృందం ఆ పని మీద ఉన్నట్టు తెలిసింది. అంతా అయ్యాక చరణ్ కు వినిపిస్తారు.

ఈ లెక్కన రంగస్థలం కాంబోని మళ్ళీ తెరమీద చూడాలంటే 2028 దాకా వెయిట్ చేయాల్సి వచ్చేలా ఉంది. ఎందుకంటే సుకుమార్ స్టయిల్ కి ఎంత వేగంగా తీసినా కనీసం సంవత్సరం కావాలి. అంటే షూటింగ్ కే 2027 అయిపోతుంది. కాబట్టి ఆపై సంవత్సరమే రిలీజ్ ఉండొచ్చు. అది కూడా సంక్రాంతికని గ్యారెంటీగా చెప్పలేం. ఏ వేసవో దసరానో కావొచ్చు. చరణ్ ఏడాదికి ఒకటి రెండు సినిమాలు ఖచ్చితంగా ఇవ్వమని అడుగుతున్న ఫ్యాన్స్ కోరిక నెరవేరేలా లేదు.

కమర్షియల్ పెద్ది ఏ స్థాయిలో నిలబడుతుందనేది పక్కన పెడితే రామ్ చరణ్ కష్టాన్ని ఆడియన్స్ గుర్తించారు. తన ఫ్యాక్టరే మూడు వందల కోట్ల మైలురాయిని చేరుకోవడంలో దోహదం చేసింది. ఒకవేళ అంత ఎఫర్ట్ పెట్టకపోయి ఉంటే ఇంత రెస్పాన్స్ వచ్చేది కాదన్నది వాస్తవం. ఫైనల్ రన్ కు అయిదు వందల కోట్ల మార్కును అందుకుంటుందా లేదానేది వేచి చూడాలి. ఈసారి పల్లెటూరి బ్యాక్ డ్రాప్ కాకుండా సుకుమార్ నగర నేపథ్యంతో పాటు ఒక డిఫరెంట్ యాక్షన్ టచ్ రాసుకున్నారట.

This post was last modified on June 10, 2026 6:36 pm

Share

Recent Posts

కర్ణుడిగా లారెన్స్… రిస్క్ అవుతుందా

డాన్స్ మాస్టర్ గా కెరీర్ మొదలుపెట్టి, దర్శకుడు కం హీరోగా మారి, హారర్ కామెడీ అనే కొత్త జానర్ సృష్టించి,…

2 minutes ago

హీరోయిన్ రాధను సొంత అక్కే 46 కోట్లు మోసం చేసిందా?

ఆర్థిక వ్యవహారాలు రక్త సంబంధీకులు, తోడబుట్టిన వాళ్ల మధ్య కూడా చిచ్చు పెట్టే ఉదంతాలు ఎన్నో చూస్తుంటాం. సెలబ్రెటీల్లో కూడా…

1 hour ago

దిల్ రాజు ద‌గ్గ‌ర ఆ డ‌బ్బులు తీసుకోని ప‌వ‌న్‌

సామాన్య జ‌నాల్లోనే కాదు.. ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల్లోనూ పెద్ద సంఖ్య‌లో వీరాభిమానుల‌ను సంపాదించుకున్న హీరో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. తాము…

5 hours ago

క్లారిటీ ఇవ్వాలంటోన్న సేన‌.. వెయిట్ అంటోన్న సేనాని..!

ఏపీలో స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం రెడీ అయింది. దీనికి సంబంధించిన ఓట‌ర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు..…

5 hours ago

ఔరా అవినాష్‌… పోలీసుల‌తో చెల‌గాట‌మా?!

మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు, ప్ర‌స్తుత వైసీపీ నేత‌, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు దేవినేని అవినాష్ పోలీసుల‌తో…

5 hours ago

రాకా రికార్డులు అప్పుడే మొదలైపోయాయి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కలయికలో తెరకెక్కుతున్న రాకా విడుదల చాలా దూరంలో ఉండగానే రికార్డుల వేట…

6 hours ago