Political News

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిన్ననాటి నుంచి తన పేరు ఎలా మారుతూ వచ్చిందో, ‘పవన్’ అనే పదం తన పేరులో ఎలా చేరిందో వివరించారు. తన అసలు పేరు ‘శ్రీ కల్యాణ్ కుమార్’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.

తిరుమలలోని యోగ నరసింహస్వామి ఆలయంలో నామకరణం సందర్భంగా ఆ పేరు పెట్టారని చెప్పారు. అయితే పాఠశాల రికార్డుల్లో ‘శ్రీ’ అనే పదాన్ని నమోదు చేయకపోవడంతో పేరు ‘కల్యాణ్ కుమార్’గా మారిందన్నారు. అనంతరం ఇంటి పేరుతో కలిసి ‘కొణిదెల కల్యాణ్ కుమార్’, తర్వాత ‘కె. కల్యాణ్ కుమార్’గా కొనసాగిందని వివరించారు.

సినీ రంగంలోకి రాకముందు తాను మార్షల్ ఆర్ట్స్‌లో కఠిన శిక్షణ పొందేవాడినని చెప్పారు. ఆ సమయంలో తన శారీరక దారుఢ్యాన్ని పెంచుకునేందుకు ప్రత్యేక సాధన చేసేవాడినని, ఛాతీపై వందల కిలోల బరువును ఉంచి విన్యాసాలు చేయడంతో పాటు రాతి పలకలను కూడా పగలగొట్టేవారని గుర్తుచేసుకున్నారు.

తన సామర్థ్యాన్ని చూసిన మార్షల్ ఆర్ట్స్ గురువుల్లో ఒకరు హనుమంతుడితో పోల్చుతూ “నువ్వు పవనపుత్ర హనుమంతుడిలా ఉన్నావు” అని చెప్పారని తెలిపారు. ఆ తర్వాత తన పేరుకు ‘పవన్’ అనే పదాన్ని జోడించారని, అప్పటి నుంచి ‘పవన్ కల్యాణ్’ అనే పేరు స్థిరపడిందన్నారు. సినీ రంగంలోకి అడుగుపెట్టకముందే ఈ పేరు తనకు వచ్చిందని, తర్వాత అదే తన ప్రత్యేక గుర్తింపుగా మారిందని చెప్పారు.

మార్షల్ ఆర్ట్స్‌పై పవన్ కల్యాణ్‌కు ఉన్న ఆసక్తి కేవలం సాధనకే పరిమితం కాలేదు. జపాన్‌కు చెందిన సంప్రదాయ యుద్ధకళలు, సమురాయ్ సంస్కృతిపై కూడా ఆయన లోతైన అధ్యయనం చేశారు. ప్రముఖ బుడో నిపుణుడు హాన్షి ప్రొఫెసర్ డాక్టర్ సిద్ధిక్ మహ్మూదీ మార్గదర్శకత్వంలో ‘కెండో’లో ఉన్నత స్థాయి శిక్షణ పొందారు.

ఈ క్రమంలో సాంకేతిక నైపుణ్యంతో పాటు యుద్ధకళల తాత్విక అంశాలపైనా అవగాహన పెంపొందించుకున్నారు. ఇటీవల జపాన్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక యుద్ధకళల సంస్థ ‘సాగో బుడో కన్‌రికై’ ఆయనకు ‘ఫిఫ్త్ డాన్’ గౌరవాన్ని ప్రదానం చేసింది. అలాగే జపాన్ వెలుపల ‘టకెడా షింగెన్ క్లాన్’లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా గుర్తింపు సాధించారు.

మరోవైపు ‘గోల్డెన్ డ్రాగన్స్’ సంస్థ పవన్ కల్యాణ్‌ను ‘టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్’ బిరుదుతో సత్కరించింది. సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా యుద్ధకళల సాధకుడిగా కూడా పవన్ కల్యాణ్ ప్రత్యేక గుర్తింపు పొందడం విశేషం.

This post was last modified on June 10, 2026 10:28 pm

Share

Recent Posts

పోటీ హడావిడి… నిలుస్తుందా గరివిడి

దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…

4 minutes ago

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

54 minutes ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

3 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

3 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

3 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

4 hours ago