Movie News

పట్టు వదలకుండా పరిగెత్తాలి పెద్ది

పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు పరుగులు పెడుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామాకు మరో వీకెండ్ దొరికనుంది. సెకండ్ సాటర్డే సెలవుతో పాటు ఆదివారం కలిసి రానుంది. శనివారంతో టికెట్ రేట్ల పెంపు రెండు రాష్ట్రాల్లో ముగింపుకొస్తుంది. అంటే సన్ డే నుంచి ఖచ్చితంగా రెగ్యులర్ ధరలే ఉండాలి. అక్కడి నుంచి ఆక్యుపెన్సీలు మళ్ళీ పెరిగే ఛాన్స్ పుష్కలంగా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది చాలా కీలకం.

ఇక అసలు విషయానికి వస్తే పెద్ది ఆల్రెడీ ఉత్తరాది రాష్ట్రాల్లో నెమ్మదిగా ఉంది. ఫైనల్ గా పాతిక కోట నెట్ చేరుకుంటే చాలనేలా పరిస్థితి మారిపోయింది. దారుణంగా పడిపోలేదు కానీ దాని పొటెన్షియాలిటీకి తగ్గట్టు వసూళ్లు రావడం లేదనేది వాస్తవం. కర్ణాటక కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ తమిళనాడు, కేరళలో సోసోగానే వెళ్తోంది. ఓవర్సీస్ లో పది మిలియన్ల అంచనాలు పెట్టుకుంటే ఇప్పుడు టార్గెట్ సగానికి కుదించేశారు. ఇదంతా ఒక రకంగా డేంజర్ సిగ్నల్.

అయితే ఏపీ తెలంగాణ చాలా ప్రాంతాల్లో పెద్ది స్ట్రాంగ్ గానే ఉంది. కొన్ని చోట్ల టికెట్ రేట్లు తగ్గించారు. మరికొన్ని ఏరియాల్లో కొనసాగిస్తున్నారు. ఇలా అన్ని ప్రాంతాల్లో సమతూకంగా లేకపోవడం ఇబ్బందిగా మారింది. ఉత్తరాంధ్రలో అదరగొడుతున్న పెద్ది సీడెడ్ లో బాగానే వెళ్తున్నా నైజామ్ లో కొంచెం నెమ్మదించింది. టికెట్ రేట్లు ఫ్యామిలీస్ కి ప్రతిబంధకంగా మారాయనే సూచనలు గత కొన్నేళ్లుగా టాలీవుడ్ నిర్మాతలు సీరియస్ గా తీసుకోవడం లేదు. ఇది రన్ మీద ప్రభావం చూపిస్తోంది.

కొత్త సీన్లు జోడించి అవసరం లేనివి తీసేసి కొత్త వెర్షన్ జోడించే ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ మొన్న వినిపించింది కానీ టీమ్ నుంచి ఎలాంటి సంకేతం లేదు. నిజంగా చేసే పనైతే వీలైనంత త్వరగా కానివ్వాలి. ఇంకోవైపు సక్సెస్ మీట్ కోసం ప్లానింగ్ జరుగుతోందట. చిరంజీవి లేదా బాలయ్య అతిథిగా రెండు ఆప్షన్లు చూస్తున్నారని సమాచారం. ఎన్బికె 111 తీస్తోంది వృద్ధి సినిమాస్, పైగా చరణ్ మీద బాలకృష్ణకు ప్రత్యేకమైన బాండింగ్ ఉండటంతో అది సాధ్యమైనా ఆశ్చర్యం లేదు.

This post was last modified on June 11, 2026 9:43 am

Share

Recent Posts

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

1 hour ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

1 hour ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

1 hour ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

2 hours ago

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

5 hours ago

అంతా బానే ఉన్నట్టుగా వైసీపీ ప్రచారం

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యం మాట ఎలా ఉన్నా.. నాయ‌కుల‌ను బ‌లోపేతం చేసేందుకు.. వారిని కొంత ఉత్తేజ ప‌రిచేందుకు…

5 hours ago