Political News

కాంగ్రెస్ మంత్రితో బీజేపీ ఎంపీ భేటీ!

జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పరిస్థితి. అలాంటిది కాంగ్రెస్ మంత్రితో బీజేపీ ఎంపీ భేటీ అంటే ఒకింత స్పెషలే కదా. ఈ స్పెషల్ సోమవారం భాగ్యనగరి హైదరాబాద్ లో చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి వచ్చిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య… తెలంగాణ కేబినెట్ లో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్న పొన్నం ప్రభాకర్ తో భేటీ అయ్యారు. రాజకీయాలను పక్కనపెట్టేసిన ఈ ఇద్దరు నేతలు…బీసీల సంక్షేమం పట్ల విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు.

బీసీ సంఘం తెలంగాణ నేతలతో కలిసి సెక్రటేరియట్ కు వచ్చిన కృష్ణయ్య… నేరుగా పొన్నం కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య బీసీల సంక్షేమ శాఖ వ్యవహారాలపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. బీసీ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, బీసీ పిల్లల పీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, బీసీ రోస్టర్ విధానాన్ని సవరించాలని, విదేశీ విద్య పథకంలో నిధులను పెంచి.. మరింత మంది విద్యార్థులకు చేయూతను అందించాలని ఈ సందర్భంగా మంత్రికి కృష్ణయ్య వినతి పత్రాన్ని అందజేశారు.

కృష్ణయ్యతో పాటుగా పొన్నం కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే. బీసీల సంక్షేమం కోసం తన జీవితకాలమంతా పోరాటం చేసిన కృష్ణయ్య… ఆదిలో టీడీపీ తరఫున ఎల్బీ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత రాజకీయాల నుంచి ఆయన తప్పుకున్నా… ఏపీలోని గత వైసీపీ హయాంలో ఆయనకు ఏపీ కోటా నుంచే రాజ్యసభ సభ్యత్వం దక్కింది. ఏపీలో కూటమి అధికారంలోకి రాగానే… రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీకి రాజీనామా చేసిన కృష్ణయ్య బీజేపీలో చేరిపోయారు. ఆ తర్వాత తాను రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యత్వాన్ని బీజేపీ ఆయనకే అందించింది.

బీజేపీతో కాంగ్రెస్ ఉప్పూనిప్పులా సాగుతున్న సంగతి తెలిసిందే. జాతీయ స్థాయిలో బీజేపీ నేతృత్వంలో అదికార ఎన్డీఏ కూటమి ఉండగా… కాంగ్రెస్ నేతృత్వంలో విపక్ష ఇండియా కూటమి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. నిన్నటికి నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిల మద్య మాటల యుద్ధం ఓ రేంజిలో జరిగిన సంగతి తెలిసిందే. ఆ రాజకీయ వేడిని తగ్గించేలా సోమవారం పొన్నంతో కృష్ణయ్య భేటీ జరిగిందన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

This post was last modified on June 8, 2026 10:48 pm

Share

Recent Posts

పోటీ హడావిడి… నిలుస్తుందా గరివిడి

దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…

14 minutes ago

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

1 hour ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

3 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

3 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

3 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

4 hours ago