గత వారం భారీ అంచనాల మధ్య ప్రేక్షెకుల ముందుకు వచ్చిన పెద్ది సినిమా తొలి వీకెండ్లో అంచనాలకు తగ్గట్లే భారీ వసూళ్లు రాబట్టింది. వరల్డ్ వైడ్ ఈ చిత్రం ఇప్పటికే రూ.250 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో ది బెస్ట్‌గా పెర్ఫామ్ చేస్తున్న ఈ మూవీ.. తెలంగాణలో కూడా మంచి వసూళ్లు తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లో బయ్యర్లు 70 శాతం మేర పెట్టుబడిని తొలి వీకెండ్లోనే రాబట్టుకున్నారు.
ఈ వీకెండ్లో సింగ్ గీతం మినహా చెప్పుకోదగ్గ రిలీజ్ లేదు కాబట్టి.. రెండో వారాంతంలోనూ పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగానే పెర్ఫామ్ చేసే అవకాశముంది. కాబట్టి బయ్యర్లు సేఫ్ అన్నట్లే. తెలుగు రాష్ట్రాల బౌండరీ దాటితే.. కర్ణాటకలో పరవాలేదు అనిపించింది. కానీ మిగతా ఏరియాలన్నింట్లో సినిమా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. తమిళ, మలయాళ ప్రేక్షకులు అస్సలు ఈసినిమాను పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు. నార్త్ ఇండియాలోనూ పెద్ది హిందీ వెర్షన్ ప్రభావం అంతంతమాత్రంగానే ఉంది.
ఐతే ఇండియాలో ఏపీ, తెలంగాణ, కర్ణాటకను మించి మిగతా మార్కెట్లపై ఎక్కువ ఆశలేమీ లేవు. కానీ తెలుగు సినిమాకు తిరుగులేని మార్కెట్ ఉన్న యుఎస్‌లో ఈ సినిమా అండర్ పెర్ఫామ్ చేస్తోంది. పెద్ది మీద ఉన్న భారీ అంచనాల దృష్ట్యా భారీ రేటు పెట్టి హక్కులు తీసుకున్నారు. సేల్ ప్రైస్ దాదాపు రూ.30 కోట్లని ట్రేడ్ వర్గాల సమాచారం. అంటే ఈ చిత్రం 6.5 మిలియన్ డాలర్ల దాకా కలెక్ట్ చేస్తేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది.
కానీ వీకెండ్ అయ్యేసరికి పెద్ది యుఎస్‌లో 3 మిలియన్ డాలర్లే రాబట్టింది. ప్రిమియర్స్ నుంచి 1.5 మిలియన్ డాలర్లు రాగా.. తర్వాత పెద్ది అనుకున్నంతగా వసూళ్లు తీసుకురాలేకపోయింది. సినిమాకు మిక్స్డ్ టాక్ ఉండడంతో ఆశించినంతగా ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు.
లైట్ హార్టెడ్, క్లాస్ ఎంటర్టైనర్లను ఎక్కువగా ఆదరించే యుఎస్ తెలుగు ఆడియన్స్‌కు పెద్ది పెద్దగా అనుకున్నంతగా రీచ్ కాలేదని అర్థమవుతోంది. ఇక్కడి నుంచి ఎంత పెర్ఫామ్ చేసినా సరే.. పెద్దికి యుఎస్‌లో భారీ నష్టాలు తప్పేలా లేవు. సగానికి సగం నష్టం వచ్చే సంకేతాలు కనిపిస్తుండడంతో పెద్దికి యుఎస్‌లో పెద్ద షాక్ తగిలినట్లే.
This post was last modified on June 8, 2026 10:53 pm
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…
భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…
వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…