Political News

రేవంత్ వర్సెస్ కిషన్ రెడ్డి… హీటెక్కిపోయింది!

తెలంగాణ రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలతో మరోమారు వేడి రాజుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డిల మధ్య సెలవు దినం ఆదివారం ఓ రేంజిలో మాటల యుద్ధం జరిగింది.

ఉప్పల్ లో జరిగిన అదికారిక కార్యక్రమంలో పాలుపంచుకున్న సందర్భంగా రేవంత్ రెడ్డి…మూసీ ప్రక్షాళన వేదికగా కిషన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు గుప్పించారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలు విన్నంతనే కిషన్ రెడ్డి కూడా ఓ రేంజిలో ఫైరవుతూ రేవంత్ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వెరసి ఇద్దరు కీలక నేతల మధ్య వాదోపవాదాలు జరిగి… ఇరు పార్టీల్లో వేడి రాజుకుంది.

మూసీ ప్రక్షాళను కేంద్రంలోని బీజేపీ సర్కారు అడ్డుకుంటోందని రేవంత్ ఆరోపించారు. మూసీ కలుషితాల వల్ల హైదరాబాద్ తో పాటు నల్లగొండ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న రేవంత్… ఈ కారణంగానే తమ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు నడుం బిగించిందని చెప్పారు.

కేంద్ర కేబినెట్ లోని తెలంగాణకు చెందిన ఓ సీనియర్ నేత, పెద్ద నేత మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్నారని పరోక్షంగా కిషన్ రెడ్డిని ప్రస్తావించారు. మూసీ ప్రక్షాళనను చేసి తీరతామన్న రేవంత్… దానిని కిషన్ రెడ్డి ఎలా అడ్డుకుంటారో చూస్తానని సవాల్ విసిరారు. అంతేకాకుండా తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే… మూసీ ప్రక్షాళనకు కేంద్రం నుంచి అనుమతులతో పాటు నిధులను కూడా తీసుకురావాలని ఆయన కోరారు.

అక్కడితోనే ఆగని రేవంత్… తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న కిషన్ రెడ్డికి ఈ నెల 15 తర్వాత అసలు సిసలు సినిమా చూపిస్తామని, కిషన్ రెడ్డి సంగతి చూస్తామని హెచ్చరించారు. మూసీ ప్రక్షాళనకు కేంద్రం నుంచి కిషన్ రెడ్డే అనుమతులు తీసుకుని రావాలన్న రేవంత్… లేనిపక్షంలో తెలంగాణ ప్రజల ఆగ్రహానికి కిషన్ రెడ్డి గురి కాక తప్పదని వార్నింగ్ ఇచ్చారు.

తనను ఎవరూ ఏమీ చేయలేరని కిషన్ రెడ్డి అనుకుంటున్నారన్న రేవంత్… ప్రజల ఆగ్రహానికి గురైన ఏ ఒక్క నేత కూడా బతికి బట్ట కట్టిన దాఖలా లేదన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు అనుమతుల కోసం 50 సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిశానన్న రేవంత్… తెలంగాణ సమస్యల పట్ల కిషన్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి తనను టార్గెట్ చేస్తూ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కిషన్ రెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు. రేవంత్ తనను బెదిరించే రీతిలో సాగుతున్నారన్న కిషన్ రెడ్డి… ఈ తరహా తాటాకు చప్పుళ్లకు తాను భయపడబోనని తెలిపారు. త్వరలోనే దళితులు, బీసీలు రేవంత్ ఇంటిని ముట్టడిస్తారని ఆయన జోస్యం చెప్పారు. ప్రజల ఆగ్రహానికి గురయ్యేది తాను కాదన్న కిషన్ రెడ్డి… రేవంతే ప్రజల ఆగ్రహానికి గురి కాక తప్పదన్నారు.

రేవంత్ లా తాను పార్టీలు మారిన వ్యక్తిని కాదని ఆయన సెటైర్లు సంధించారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని రేవంత్ కలలు కంటున్నారన్న కిషన్ రెడ్డి… ఈ జీవితంలో రాహుల్ గాంధీ ప్రధాని కాలేరని సంచలన వ్యాఖ్య చేశారు. కావాలంటే రాసిపెట్టుకోండి.. రాహుల్ ప్రధాని అయ్యే అవకాశమే లేదని ఆయన చెప్పారు. మొత్తంగా ఇద్దరు కీలక నేతల ఆరోపణలు, పత్యారోపణలతో తెలంగాణ రాజకీయం ఆదివారం వాడీవేడీగా సాగింది.

This post was last modified on June 8, 2026 7:13 am

Share

Recent Posts

భీమవరం బ్యాగ్రౌండ్ ఉన్నా వాడుకోలేదా రవితేజ…

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి చాలా కష్టపడి పెద్ద స్టార్లలో ఒకడిగా ఎదిగాడు మాస్…

4 hours ago

అనుపమకు నరకం చూపించిన అపరిచితుడు

తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న మ‌ల‌యాళ భామ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప‌దేళ్ల కెరీర్లో పెద్ద‌గా ఎఫైర్ వార్త‌లేమీ వ‌చ్చింది లేదు.…

4 hours ago

షూట్ లేకున్నా ప్రభాస్ ఫౌజి సెట్లోనే

ప్ర‌భాస్ సినిమా అంటే చాలు.. హైప్‌కు ఏమీ లోటు ఉండ‌దు. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డేకొద్దీ అభిమానుల‌తో పాటు సామాన్య ప్రేక్ష‌కుల్లోనూ…

4 hours ago

జెన్ జీ ఎఫెక్ట్… కేటీఆర్ ను సీఎం చెయ్యాలంటున్న కేసీఆర్?

ఇదేమీ ఊహాజ‌నిత వార్త‌కాదు. కొంద‌రు పుట్టించిన గ్యాసిప్ కూడా కాదు!. అక్షరాలా.. తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ పార్టీలో గ‌త…

5 hours ago

అయ్య‌న్న‌ అలా.. జ‌గ‌న్ ఇలా… ఇద్ద‌రి ఆశ‌లూ తీరేనా?

ఏపీ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు.. ఎప్ప‌టి నుంచో ఒక మాట చెబుతున్నారు. చెప్ప‌డ‌మే కాదు.. అంత‌ర్జాతీయ వేదికల‌పైనా ఆయ‌న త‌న వాణిని…

7 hours ago

‘ఇరుముడి’ సరుకులు… అన్నీ సరిపోయాయి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి ఆగస్ట్ 21 విడుదల కానుంది. వరస ఫ్లాపుల నుంచి బయటపడేసే సినిమాగా అభిమానులు దీని…

8 hours ago