Movie News

పెహల్వాన్ అసలు కుస్తీ ఇప్పుడు మొదలు

పెద్ది మొదటి వారాంతం ఘనంగా పూర్తి చేసుకుంది. రెండు వందల యాభై కోట్లకు కొంచెం అటు ఇటు నెంబర్ నమోదు కావడం ఖాయమే. ఇక అసలు కుస్తీ సోమవారం అంటే ఈ రోజు నుంచి మొదలుకానుంది. వీక్ డేస్ వచ్చేశాయి. ఇదే వారంలో స్కూళ్లు కాలేజీలు ఓపెన్ చేయబోతున్నారు. ఇంకో నాలుగు రోజులు పిల్లలకు సెలవులున్నాయి కాబట్టి ఆక్యుపెన్సీలు మరీ తీవ్రంగా పడిపోవనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కరెంట్ బుకింగ్స్ ఎక్కువగా నమోదు కావొచ్చు.

మిక్స్డ్ టాక్ నుంచి చాలా బాగుంది అనే వరకు పెద్ది గురించిన డిస్కషన్లు సోషల్ మీడియాలో జరుగుతూనే ఉన్నాయి. బాలేదని ఎవరూ అనకపోయినా ఆ స్థాయిలో అనుమానం వచ్చేలా కొంత నెగటివ్ క్యాంపైన్ జరిగిన మాట వాస్తవం. ఆ యాంటీ ఫ్యాన్స్ ఎవరు అనేది పక్కనపెడితే ఈ ప్రతికూలతను తట్టుకుని పెద్ది నిలబడాలి. అప్పుడే బ్లాక్ బస్టర్ ముద్ర పడుతుంది. ఇంకా చేయాల్సిన ప్రయాణం చాలా ఉంది. పోటీ లేని వాతావరణాన్ని పెద్ది వీలైనంత ఫుల్లుగా వాడుకోవాలి.

ఒక సమస్య ఏంటంటే పెద్దికి ఉత్తరాదిలో ఆశించినంత వేగంగా ఆదరణ లేదు. బాలీవుడ్ ప్రేక్షకులు రామ్ చరణ్ పెర్ఫార్మన్స్ ని మెచ్చుకుంటున్నప్పటికీ ఇలాంటివి గతంలో సుల్తాన్, దంగల్ తదితర రూపాల్లో చూసి ఉండటంతో వాళ్ళు మరీ ఎగ్జైట్ అవ్వడం లేదు. నార్త్ అమెరికాలో అయిదు మిలియన్ మార్క్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అంత కంటే ఎక్కువ వస్తుందా అనే ప్రశ్నకు సమాధానం ఇప్పుడప్పుడే దొరకదు. ఇంకా వెయిట్ చేయాలి.

ఇప్పుడు పెద్ది పహిల్వాన్ ను అసలైన పరీక్ష మొదలయ్యింది. ఈ వారం కూడా గెలిస్తే ఇంకే టెన్షన్ అక్కర్లేదు. పెంచిన టికెట్ రేట్లు జూన్ 13 దాకా అమలులో ఉంటాయి. కొన్ని ఏరియాల్లో తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ఓవరాల్ గా కాదు. ఉత్తరాంధ్రలో చాలా స్ట్రాంగ్ గా ఉన్న పెద్ది అదే దూకుడుని ఇతర ప్రాంతాల్లో కూడా కొనసాగించాలి. రామ్ చరణ్ చెప్పుకున్నట్టు ఇది తన కెరీర్ బెస్ట్ అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. కాకపోతే లెక్కల్లో ఆ మార్క్ చేరుకుంటుందా లేదానేది వేచి చూడాలి.

This post was last modified on June 8, 2026 12:36 pm

Share

Recent Posts

టాలీవుడ్ స్టార్లు ఆ మాయలో పడి నష్టపోతున్నారా

మన టాలీవుడ్ స్టార్లు ఇప్పుడు లోకల్ మార్కెట్ ను దాటేసి అంతకుమించి అనేలా అడుగులు వేస్తున్నారు. నార్త్ ఆడియన్స్ తో…

54 minutes ago

అబ్బవరం ఈసారి బయటపడగలడా?

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నుంచి ఒక టైంలో వచ్చిన సినిమాలు చూస్తే.. తన పనైపోయిందనే అనిపించింది. ఐతే కెరీర్…

2 hours ago

అసలు ఈ మస్క్ వివాదం ఏంటి?

గ‌త రెండు రోజులుగా ఇటు సోష‌ల్ మీడియాలోను, అటు ప్ర‌ధాన మీడియా ఛానెళ్ల‌లోను.. తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం.. ప్ర‌పంచ…

7 hours ago

బడ్జెట్ రూ. 2 కోట్లు కలెక్షన్లు 50 కోట్లు…

పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…

8 hours ago

కమల్ కోసం రజినీ త్యాగం?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…

11 hours ago

‘కామ్రేడ్ కళ్యాణ్’ను కాపాడిన మెగాస్టార్

ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…

11 hours ago