Movie News

భాగ్యరేఖ మార్చాల్సిన బాధ్యత ‘లెనిన్’దే

అందం, అభినయం రెండూ ఉన్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. కాకపోతే బ్యాడ్ లక్ భుజాన వేసుకుని తిరుగుతోంది. ఆఫర్లకు లోటు లేకపోయినా సక్సెస్ అందని ద్రాక్షగా మారిపోయింది. డెబ్యూ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ ఫలితం రవితేజ అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘ఆంధ్రకింగ్ తాలూకా’ కూడా సేమ్ రిజల్ట్ అందుకుంది. విచిత్రంగా పాజిటివ్ టాక్, రివ్యూస్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద ఆ మూవీ నిలబడలేకపోవడం మహా విచిత్రం.

విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ ప్యాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెస్తుందనుకుంటే నిర్మాతకు నష్టాలు మిగిల్చింది. తమిళ క్రిటిక్స్ ఆమె పెర్ఫార్మన్స్ ని మెచ్చుకున్నప్పటికీ దుల్కర్ సల్మాన్ ‘కాంత’ మాములు ప్రేక్షకులను మెప్పించలేక ఫ్లాప్ ముద్ర వేయించుకుంది. ట్విస్ట్ ఏంటంటే క్యామియోలు చేసిన తొలి రెండు హిందీ సినిమాలు యారియాన్ 2, చందూ ఛాంపియన్ సైతం యావరేజ్ అనిపించుకున్నాయి. ఇప్పుడు జూన్ 26 ‘లెనిన్’ వంతు వస్తోంది.

ముందు నుంచి లెనిన్ మీద పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. అఖిల్ కి ఖచ్చితంగా కెరీర్ బ్రేక్ మూవీ ఇవ్వాలనే సంకల్పంతో సమయం, బడ్జెట్ రెండూ ఎక్కువ ఖర్చు పెట్టారు. సితార, అన్నపూర్ణ సంస్థలు చేతులు కలపడంతో రాజీ ప్రశ్న రాలేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం లెనిన్ కథ కేంద్ర బిందువుగా భాగ్యశ్రీ బోర్సే ఉంటుందట. లెనిన్ కత్తి పట్టుకుని అంత హింసాత్మకంగా మారడం వెనుక హీరోయిన్ పాత్ర తాలూకు నేపథ్యం చాలా స్ట్రాంగ్ గా దర్శకుడు మురళికిషోర్ అబ్బూరు రాసుకున్నారట.

ఒకవేళ లెనిన్ కనక అనుకున్నట్టు విజయం సాధిస్తే తనకు పెద్ద ప్రమోషన్ దొరికినట్టు అవుతుంది. తమిళంలో శివ కార్తికేయన్ సరసన నటిస్తున్న ‘సియోన్’ మీద కూడా కోలీవుడ్ వర్గాల్లో సానుకూలంగా మాట్లాడుతున్నారు. సో ఈ రెండు వర్కౌట్ అయితే మరిన్ని క్రేజీ ఆఫర్లు వస్తాయి. తనకే కాదు లెనిన్ అటు అఖిల్ కు కూడా అంతే ముఖ్యం. ఈసారి మొత్తం లుక్ మార్చేసి పల్లెటూరి కుర్రాడిగా కనిపిస్తున్నాడు. మంచి మాస్ టచ్ తో పాటు వయొలెంట్ యాక్షన్ చాలా బాగా వచ్చిందని యూనిట్ టాక్.

This post was last modified on June 7, 2026 10:59 pm

Share

Recent Posts

పోటీ హడావిడి… నిలుస్తుందా గరివిడి

దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…

56 minutes ago

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

2 hours ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

4 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

4 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

4 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

4 hours ago