Political News

లవర్ కోసం కోటిన్నర కొట్టేసిన యువతి!

జెన్ జీ యుగంలో యువత ఎక్కడికి పోతోందో?… ఏమేం చేస్తుందోనన్న విషయాలపై అంతు చిక్కడం లేదని చెప్పాలి. ఏదో ఒక విషయం బుర్రలోకి చేరినంతనే… దాని పర్యవసానాల గురించి ఎంతమాత్రం ఆలోచించని ప్రస్తుత యువత…ఆ పనులను ఇట్టే ముగించేస్తున్నారు. ఆపై అడ్డంగా దొరికిపోతున్నారు కూడా. తాజాగా ఆదివారం హైదరాబాద్ లో చోటుచేసుకున్న ఓ ఘటనను చూస్తే… ఈ వాదనలు అక్షర సత్యమని చెప్పవచ్చు.

బీఆర్ఎస్ కు చెందిన నేత సురేశ్… సనత్ నగర్ లోని జెక్ కాలనీలో ఫ్యామిలీతో కలిసి నివాసం ఉంటున్నారు. సురేశ్ కు ఓ కుమార్తె ఉంది. ఆమె పేరు గానీ, ఇతరత్రా వివరాలు గానీ బయటకు రాలేదు గానీ..ఇటీవలే ఆమె ఓ యువకుడి ప్రేమలో పడిపోయింది. ఈ క్రమంలో ఈ జంట మధ్య ఎలాంటి చర్చలు జరిగాయో తెలియదు గానీ… తన లవర్ అడిగాడో, ఈమే అతడికి సాయం చేయాలనుకుందో తెలియదు గానీ… తన సొంతింటిలోనే ఆమె దొంగగా మారిపోయింది.

సురేశ్ ఈ మధ్యే తన ఇంటిలో భారీగా నగదును తీసుకొచ్చారట. ఈ విషయం ముందుగా తెలిసిందో, లేదంటే…నగదు ఇంటికి వచ్చిన తర్వాత ప్లాన్ చేసిందో తెలియదు గానీ… ఆ డబ్బు నుంచి ఆమె ఏకంగా రూ.1.5 కోట్లను చోరీ చేసింది. ఇంత భారీ మొత్తాన్ని ఆమె ఎలా బయటకు తీసుకెళ్లిందో తెలియదు గానీ… దానిని ఆమె తన ప్రియుడికి అందజేసింది. ఆ తర్వాత ఇంటిలో ఉన్న నగదు కనిపించకపోవడంతో సురేశ్ పోలీసులకు సమాచారం అందించారు.

జెక్ కాలనీలో భారీ చోరీపై ఫిర్యాదు అందగా.. కనిపించకుండా పోయిన మొత్తం రూ.1.5 కావడంతో పోలీసులు వేగంగానే రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ముందుగా ఇంటి వారినే పోలీసులు ప్రశ్నించారు. అందులో భాగంగా సదరు యువతిని కూడా పోలీసులు ప్రశ్నించారు. పోలీసులను చూడగానే కంగారుపడిపోయిన ఆ యువతి… పోలీసుల ముందు ఇట్టే నోరు విప్పేసింది. తన లవర్ కోసమే తానే ఈ మొత్తాన్ని తీసుకున్నానని ఆమె చెప్పడంతో పోలీసులతో పాటుగా సురేశ్ ఫ్యామిలీ షాక్ కు గురైంది.

This post was last modified on June 7, 2026 4:41 pm

Share

Recent Posts

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

1 hour ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

1 hour ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

2 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

2 hours ago

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

5 hours ago

అంతా బానే ఉన్నట్టుగా వైసీపీ ప్రచారం

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యం మాట ఎలా ఉన్నా.. నాయ‌కుల‌ను బ‌లోపేతం చేసేందుకు.. వారిని కొంత ఉత్తేజ ప‌రిచేందుకు…

6 hours ago