Movie News

దత్తుగారికి నిద్ర పట్టనివ్వని మెగా మూవీ

టాలీవుడ్ అగ్ర నిర్మాత సి అశ్వినీదత్ ఇవాళ ఎమోషనల్ అయ్యారు. సింగ్ గీతం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ పాతిక సంవత్సరాల క్రితం సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఒక సినిమా మొదలుపెట్టాక మధ్యలో ఆగిపోయిందని, అప్పటి నుంచి సరిగా నిద్ర పట్టలేదని, ఆ కొరతను నాగ్ అశ్విన్ – స్వప్న – ప్రియాంకలు తీర్చారని, అందుకే ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. పేరు చెప్పలేదు ఆ మెగా మూవీ వెనుకో ఫ్లాష్ బ్యాక్ ఉంది.

1996 తర్వాత చిరంజీవి హీరోగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్వినిదత్ ‘భూలోక వీరుడు’ అనే భారీ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. హీరోయిన్ గా టబుని ఎంచుకున్నారు. ఇళయరాజాతో పాట రికార్డింగ్ కూడా అయ్యింది. కొన్ని ఎపిసోడ్ల చిత్రీకరణ జరిగింది. ఏమైందో ఏమో కానీ హఠాత్తుగా ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. చిరు – సింగీతం కాంబోని తెరమీద చూడాలని తహతహలాడిన మూవీ లవర్స్ తీవ్రంగా నిరాశ చెందారు.

ఆ తర్వాత వేరే కథతో రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో చిరంజీవితోనే ఇంకో మూవీ ప్లాన్ చేశారు దత్తు గారు. అది కూడా అచ్చంగా పైన చెప్పినట్టే ఒక షెడ్యూల్ తర్వాత ఆగిపోయింది. కట్ చేస్తే సీన్ లోకి గుణశేఖర్ ఎంటర్ కావడం, చూడాలని ఉంది సబ్జెక్టుతో మెప్పించడం, మెగాస్టార్ కు బ్లాక్ బస్టర్ ఇవ్వడం జరిగిపోయాయి. అంత జరిగాక మళ్ళీ ఎప్పుడైనా చిరంజీవి – సింగీతం కలయిక జరుగుతుందేమోనని ఫ్యాన్స్ ఎదురు చూశారు కానీ అది కలగానే ఉండిపోయింది.

సో అశ్వినిదత్తుని నిద్ర పట్టనివ్వకుండా చేసిన సినిమా వెనుక ఇంత కథ ఉంది. బాలయ్యతో భైరవద్వీపం, ఆదిత్య 369, శ్రీ కృష్ణార్జున విజయం లాంటి క్లాసిక్స్ తీసిన సింగీతం శ్రీనివాసరావు గారు నాగార్జునతో ఆకాశవీధిలో చేశారు. చిరంజీవి, వెంకటేష్ తో మాత్రం సాధ్యపడలేదు. సింగ్ గీతంని పర్యవేక్షిస్తున్న నాగ్ అశ్విన్ అన్ని తానై ప్రమోషన్లు చూసుకుంటున్నారు. తొంభై నాలుగేళ్ళ వయసులో సింగీతం శ్రీనివాసరావుగారు తెరమీద ఎలాంటి మేజిక్ చేయబోతున్నారో చూడాలి.

This post was last modified on June 7, 2026 4:37 pm

Share

Recent Posts

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

14 minutes ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

2 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

2 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

2 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

3 hours ago

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

6 hours ago