Movie News

పాలిటిక్స్ లొకి మరో సినీ స్టార్..?

తమిళ రాజకీయాలు దేశవ్యాప్తంగా అమితాసక్తి రేకెత్తిస్తున్నాయి. రెండేళ్ల క్రితం రాజకీయాల్లోకి దూకిన తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు విక్టరీ సాధించి… ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రి అయిపోయారు. ఇప్పుడు ఆయనే తన సహనటుడు, ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ నూ పాలిటిక్స్ లోకి తీసుకువస్తున్నట్లుగా పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఈ ఊహాగానాలపై స్పందించిన లారెన్స్ తాను రాజకీయాల్లోకి రాబోనని మాత్రం ప్రకటించలేదు. ఈ నెల 11న తన నిర్ణయం ఏమిటన్న దానిపై ప్రకటన చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికి ఈ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టని లారెన్స్ మరింత ఆసక్తిని రేకెత్తించారని చెప్పాలి.

మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేసి.. రెండు చోట్ల విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పెరంబూరు ఎమ్మల్యేగా కొనసాగేందుకు నిర్ణయించిన విజయ్… తిరుచ్చి ఈస్ట్ కు రాజీనామా చేశారు. ఈ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది. ఉప ఎన్నికలో విజయ్ పార్టీ టీవీకే అభ్యర్థికే విజయావకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ నుంచి.. విజయ్ పార్టీ అభ్యర్థిగానే లారెన్స్ బరిలోకి దిగుతారని ప్రచారం సాగుతోంది. గడచిన కొన్ని రోజులుగా ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే నిన్నటిదాకా ఈ విషయంపై ఏమాత్రం స్పందించని లారెన్స్ ఆదివారం సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

తిరుచ్చి బైపోల్స్ లో తాను బరిలోకి దిగుతానని చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయని లారెన్స్ చెప్పారు. బెంజ్ సినిమాతో బిజీగా ఉన్నానని చెప్పిన లారెన్స్…ఆ చిత్రం షూటింగ్ నుంచి ఈ నెల 10న బయటపడతానని చెప్పుకొచ్చారు. అయితే ఈ ఊహాగానాలు నిజమా? కాదా? అన్నవిషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు.

అయితే తన భవిష్యత్తుకు సంబంధించి ఈ నెల 11న ఓ కీలక ప్రకటన చేయనున్నానని ఆయన చెప్పారు. ఆ ప్రకటన రాజకీయపరమైనదా?.. లేదంటే తన సినీ ప్రయాణానికి సంబంధించి ప్రకటన ఉంటుందా? అన్న దానిపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. అయితే తన తల్లి దీవెనలు తీసుకుంటున్న ఫొటోను పోస్ట్ చేసిన లారెన్స్ తనకు తల్లి దీవెనతో మంచే జరుగుతందని చెప్పారు. ఆ మంచి ఏ విషయంలో అన్న మాటనూ ఆయన వెల్లడించకపోవడం గమనార్హం.

ఇదిలా ఉంటే.. తిరుచ్చి ఈస్ట్ నుంచి విజయ్ తో ఇటీవల అత్యంత సన్నిహితంగా మెలగుతున్న స్టార్ హీరోయిన్ త్రిష పోటీ చేస్తారని ఇటీవలే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ వార్తలపైనా ఎటువైపు నుంచి కూడా క్లారిటీ రాలేదు. తాజాగా ఇప్పుడు అదే తిరుచ్చి నుంచి లారెన్స్ పోటీ చేస్తారంటూ ఊహాగానాలు వినిపించడం గమనార్హం. వెరసి విజయ్ త్రిషను సైడ్ చేసేసి… ఆ స్థానంలో లారెన్స్ ను బరిలోకి దింపే దిశగా సాగుతున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొత్తంగా లారెన్స్ రాజకీయాల్లోకి వస్తున్నారా? లేదా? అన్నది తేలాలంటే ఈ నెల 11 దాకా ఆగాల్సిందేనని చెప్పక తప్పదు.

This post was last modified on June 7, 2026 7:43 pm

Share

Recent Posts

మనసు మార్చుకున్న ఆదర్శం… మంచిదే కానీ

గత కొన్ని రోజులుగా బయట ప్రచారం జరుగుతున్నట్టు ఆదర్శ కుటుంబం ఏకె 47 ఒక వారం వాయిదా పడింది. ముందు…

8 hours ago

పుష్ప విలన్ ‘ట్రబుల్’ కొత్తగా ఉందే

ఒక మీడియం బడ్జెట్ సినిమాకు రాజమౌళి ప్రెజెంట్స్ అని పడిందంటే అందులో విషయం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే…

9 hours ago

జపాన్ ఓడినా టీమిండియా గెలవలేదు…

జపాన్‌పై రెండు పరుగుల తేడాతో గెలిచారు. కానీ ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా బ్యాటింగ్‌పై మళ్ళీ సందేహాలు మొదలయ్యాయి. భారత…

9 hours ago

గిన్నిస్ బుక్కంటే క్రేజ్ తగ్గిందనుకోవాలా

ఒకప్పుడు గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించుకోవడమంటే అదో పెద్ద ఘనతగా భావించే వాళ్ళు. పెద్ద పెద్ద…

10 hours ago

నంది అవార్డులు వచ్చేస్తున్నాయహో…

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం ప్రకటించే నంది అవార్డుల‌కు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డుల‌తో స‌మానంగా చూసేవారు.…

12 hours ago

ఆలస్యం జరిగింది ఇక ఆగడం ఉండదు

టాలీవుడ్ సినిమాలకు అదేం శాపమో అర్థం కాదు కానీ కొన్నింటికి ప్రభుత్వాల నుంచి జిఓలు సకాలంలో రావు, చివరి నిమిషం…

13 hours ago