Political News

ఢిల్లీలో చర్చలు.. భారత్ పై కొత్త పన్నులు.. ట్రంప్ డబుల్ గేమ్!

భారత్ తో వాణిజ్య సంబంధాలు మరింతగా మెరుగుపరుచుకుంటామని చెబుతూనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. బలవంతపు చాకిరీ (Forced Labour) నిరోధించడంలో పూర్తిగా విఫలమయ్యారనే నెపంతో భారత్ తో సహా దాదాపు అరవై దేశాలపై కొత్తగా టారిఫ్ లు విధించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు అమెరికా వాణిజ్య ప్రతినిధి సంస్థ ఒక సంచలన నివేదికను బయటపెట్టింది. దీని ప్రకారం చైనా, జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాలతో పాటు మన దేశం పంపే ఉత్పత్తులపైనా పన్నెండున్నర శాతం అదనపు పన్ను వేయాలని నిర్ణయించింది.

గతంలో ట్రంప్ వేసిన పన్నులను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేయడంతో, ఇప్పుడు బలవంతపు చాకిరీ అనే కొత్త ఎత్తుగడతో ఈ టారిఫ్ లను తెరపైకి తెచ్చారు. ఇలాంటి పద్ధతుల్లో తయారైన వస్తువుల దిగుమతులను ఆపడంలో భారత్, చైనా, బ్రిటన్ లాంటి 54 దేశాలు ఫెయిల్ అయ్యాయని అమెరికా చెబుతోంది. ఇలాంటి వస్తువులు మార్కెట్లోకి రావడం వల్ల తమ దేశ కార్మికులు నష్టపోతున్నారని వారు వాదిస్తున్నారు. జూలై ఆరో తేదీ వరకు దీనిపై ప్రజల అభిప్రాయాలు సేకరించి, ఆ తర్వాత పబ్లిక్ హియరింగ్ నిర్వహించి ఫైనల్ డెసిషన్ తీసుకోనున్నారు.

ఒకవైపు ఈ పన్నుల భారం మోపేందుకు సిద్ధమవుతూనే, మరోవైపు అమెరికా బృందం ఢిల్లీలో వాణిజ్య చర్చలు జరపడం ఆసక్తికరంగా మారింది. బ్రెండన్ లించ్ నేతృత్వంలోని అమెరికా అధికారుల టీమ్ ప్రస్తుతం ఢిల్లీలో మకాం వేసింది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో భాగంగా రెండు దేశాల మధ్య ఒక మధ్యంతర ఒప్పందాన్ని ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. మార్కెట్ యాక్సెస్, నాన్ టారిఫ్ అడ్డంకులు, కస్టమ్స్, పెట్టుబడుల ప్రమోషన్ లాంటి కీలక అంశాలపై భారత వాణిజ్య శాఖ అధికారులతో వారు సీరియస్ గా చర్చిస్తున్నారు.

నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరి ఏడో తేదీన ఇరు దేశాలు ఒక ఫ్రేమ్ వర్క్ కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం భారత ఎగుమతులపై ఉన్న పన్నులను 18 శాతానికి తగ్గించడానికి అమెరికా ఒప్పుకుంది. రష్యా ఆయిల్ కొనుగోలుకు లింక్ చేస్తూ గతంలో వేసిన 50 శాతం పన్నుల భారాన్ని తగ్గించడం మన దేశ వాణిజ్య వర్గాలకు చాలా పెద్ద ఊరట. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవకుండానే ఫోర్స్డ్ లేబర్ పేరుతో మళ్లీ కొత్త పన్నుల బాంబు పేల్చడం అమెరికా ద్వంద్వ విధానం భయపడింది.

అమెరికా తీరు చూస్తుంటే వాణిజ్య చర్చల్లో తమదే పైచేయి అయ్యేలా ఇలాంటి మైండ్ గేమ్ ఆడుతున్నట్లు అర్థమవుతోంది. ఒకవైపు చర్చల టేబుల్ దగ్గర కూర్చుని పన్నులు తగ్గిస్తామని ఊరిస్తూనే, మరోవైపు కొత్త నిబంధనలతో ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేస్తోంది. అయితే కొన్ని వ్యవసాయ ఉత్పత్తులు, కాఫీ, దుస్తుల విషయంలో ఈ కొత్త పన్నుల ప్రభావం పడకుండా మినహాయింపు ఇచ్చారు. అయితే ఈ ద్వంద్వ వ్యూహాన్ని దీటుగా ఎదుర్కొని మన అధికారులు అమెరికాను ఎలా దారికి తెస్తారనేది అత్యంత కీలకంగా మారింది.

This post was last modified on June 3, 2026 3:57 pm

Share

Recent Posts

మాధ‌వ‌న్ గుండెలు గుబేల్‌

విజ‌య్ ముఖ్య‌మంత్రి అయ్యాక‌ త‌మిళ‌నాడు రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జ‌రిగినా ప‌రిస్థితి…

1 hour ago

సినీ పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోయింది

తెలుగు ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకున్న బాలీవుడ్ న‌టుడు ప్ర‌దీప్ రావ‌త్ హ‌ఠాత్తుగా క‌న్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండ‌రీ…

3 hours ago

రిస్కుకు రెడీ అవుతున్న కనకరాజు

ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…

5 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న బిక్షు యాదవ్

రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…

5 hours ago

ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చిన చంద్ర‌బాబు

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వ రెండేళ్ల పాల‌న‌పై సీఎం చంద్ర‌బాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక ప‌రిస్థితిని ఆయ‌న వివ‌రించారు.…

6 hours ago

దేవిలో ఇది గొప్ప లక్షణం

టీనేజీలోనే తన ప్రతిభను చాటుకుని చాలా వేగంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగాడు దేవిశ్రీ ప్రసాద్. ఎంత ఎదిగినా ఒదిగి…

8 hours ago