సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోక నాయకుడు కమల్ హాసన్ నిర్మాణంలో ఒక సినిమా తీయాలని ఏడాది కిందట్నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐతే ఘనంగా ఈ కాంబినేషన్‌ను అనౌన్స్ అయితే చేశారు కానీ.. దర్శకుడి విషయమే ఒక పట్టాన తేలట్లేదు. ముందుగా రజినీతో అరుణాచలం మూవీ తీసిన సీనియర్ సుందర్‌ను ఎంచుకున్నారు.
కానీ ఘనంగా ప్రకటన చేశాక.. రెండు వారాలు తిరిగే సరికే ఈ ప్రాజెక్టుకు తాను న్యాయం చేయలేననంటూ సుందర్ వైదొలిగారు. ఆ తర్వాత కొన్ని నెలలకు శివకార్తికేయన్‌తో డాన్ మూవీ తీసిన శిబి చక్రవర్తిని దర్శకుడిగా ఎంచుకున్నారు. దీని గురించి కూడా ఘనంగా ప్రకటన చేశారు. ఈ సినిమాలో రజినీ పాత్ర కోసం 80కి పైగా లుక్స్ డిజైన్ చేశాడంటూ సోషల్ మీడియాలో రజినీ ఫ్యాన్స్ శిబికి ఎలివేషన్ ఇచ్చారు.
కానీ కొన్నాళ్లకు శిబి కూడా ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అధికారికంగా ఏ సమాచారం లేదు. తర్వాత రజినీ సినిమా కోసం ప్రదీప్ రంగనాథన్‌తో డ్రాగన్ సినిమా తీసిన అశ్వత్ మారిముత్తు పేరు తెరపైకి వచ్చింది. కానీ నిజంగా దర్శకుడు మారాడా లేదా అన్నది స్పష్టత లేకపోయింది.
కానీ కోలీవుడ్ నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం రజినీ సినిమా.. అశ్వత్ మారిముత్తు చేతికే వెళ్లిందట. అతను నిర్మాత కమల్ హాసన్‌కు కథ చెప్పి ఓకే చేయించుకున్నారట. శిబి చక్రవర్తి ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగిన సంగతి ఖాయం చేసుకోవచ్చని అంటున్నారు. కానీ శిబిని కమల్ పూర్తిగా వదిలేయట్లేదు. తన సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్‌లోనే వేరే అవకాశంఇస్తున్నాడట.
తన ప్రొడక్షన్లో అమరన్ సినిమా చేసిన శివకార్తికేయన్ హీరోగా.. శిబి దర్శకత్వంలో కమల్ సినిమా చేయనున్నాడట. ఇక అశ్వత్ విషయానికి వస్తే.. అతడి దర్శకత్వంలో సినిమాను అనౌన్స్ చేయడానికి కొంత సమయం పడుతుందట. ఫుల్ స్క్రిప్టు రెడీ చేసి రజినీ కూడా పూర్తి సంతృప్తి వ్యక్తం చేశాకే ఈ ప్రాజెక్టును ప్రకటించమని అశ్వత్ కోరాడట. ఒకట్రెండునెలల తర్వాత అధికారిక ప్రకటన రావచ్చని సమాచారం.
This post was last modified on June 3, 2026 6:59 pm
అగ్గిపెట్టి మచ్చా.. సోషల్ మీడియా వాడే తెలుగు వాళ్లకు ప్రత్యేకంగా ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతడి…
న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…
అటు ఇటుగా ఇంకో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘జైలర్-2’ సినిమా. 2023లో ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన…
రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడం వరకు చాలామంది చేస్తుంటారు. కానీ ఆ గుంతను బాగు…
ఫౌజీ వాయిదా పడింది. సంతోషం. ఇలాంటి పోస్టుపోన్లు చూడటం కొత్తేమి కాదు కాబట్టి అందులో ఫీలవ్వడానికి ఏం లేదు. మరి…
ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో వివాదాల నేపథ్యంలో ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కాక్రోచ్…