Trends

డాన్ 3 గొడవ నుంచి బయటపడ్డ రణ్‌వీర్

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ కు ఒక పెద్ద ఊరట లభించింది. డాన్ 3 సినిమా వివాదం నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) విధించిన నాన్ కోఆపరేషన్ ఆదేశాలను ఎత్తివేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ముంబైలో జరిగిన ప్రెస్ మీట్ లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇంపా (IMPPA), సింటా (CINTAA) లాంటి ఇతర సినీ సంఘాలు చేసిన ప్రత్యేక విజ్ఞప్తి మేరకే ఈ బ్యాన్ ను రద్దు చేస్తున్నట్లు FWICE చీఫ్ అడ్వైజర్ అశోక్ పండిట్ స్పష్టం చేశారు.

ఈ గొడవను సామరస్యంగా కూర్చుని పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలకు వారు సూచించారు. అసలు ఈ వివాదం ఎలా మొదలైందంటే, ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన డాన్ 3 సినిమాలో రణ్‌వీర్ సింగ్ హీరోగా ఎంపికయ్యాడు. 2023 ఆగస్టులో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే 2025 డిసెంబర్ లో దురంధర్ సినిమా సూపర్ హిట్ అయిన పదిహేను రోజులకే, రణ్‌వీర్ సడెన్ గా డాన్ 3 ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు.

బడ్జెట్ 300 కోట్ల రూపాయల మేర ఉండాల్సి ఉండగా దానిని సగానికి తగ్గించడం, ఫైనల్ స్క్రిప్ట్ నచ్చకపోవడం లాంటి కారణాలతో ప్రాజెక్ట్ కు గుడ్ బై చెప్పినట్లు సమాచారం. ఆ సమయంలో 2026 జనవరిలో మొదటి షెడ్యూల్ కోసం విదేశాలకు వెళ్లాల్సిన 200 మంది క్రూ మెంబర్స్ ప్రయాణం కూడా క్యాన్సిల్ అయింది. హీరో హఠాత్తుగా తప్పుకోవడంతో డాన్ 3 నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ కు నష్టాలు తప్పలేదు. అప్పటికే ప్రీ ప్రొడక్షన్ కోసం సుమారు 45 కోట్లు ఖర్చు చేశామని, ఆ మొత్తాన్ని పరిహారంగా ఇవ్వాలని నిర్మాతలు డిమాండ్ చేస్తూ గిల్డ్ కు ఫిర్యాదు చేశారు.

అమీర్ ఖాన్, సిద్ధార్థ్ రాయ్ కపూర్ లాంటి పెద్దల సమక్షంలో చర్చలు జరిగినా ఎలాంటి ఫలితం రాలేదు. రణ్‌వీర్ కేవలం 10 కోట్లు ఇస్తానని చెప్పడంతో ఆ చర్చలు విఫలమయ్యాయి. దాంతో నిర్మాతలు FWICE ని ఆశ్రయించడంతో, రణ్‌వీర్ పై వారం రోజుల క్రితం నాన్ కోఆపరేషన్ ఆదేశాలు జారీ అయ్యాయి. సుమారు ఐదు లక్షల మంది సభ్యులున్న FWICE ఇలాంటి బ్యాన్ విధిస్తే నటీనటుల భవిష్యత్తుకు పెద్ద ఇబ్బందే ఎదురవుతుంది. అందుకే ఈ బ్యాన్ విధించిన వారం రోజులకే రణ్‌వీర్ సింగ్ టీమ్ తిరిగి ఫెడరేషన్ కు లీగల్ నోటీసులు పంపింది.

ఒక నటుడికి, నిర్మాణ సంస్థకు మధ్య ఉన్న వ్యవహారంలో జోక్యం చేసుకునే చట్టపరమైన హక్కు ఫెడరేషన్ కు లేదని లాయర్ సంజయ్ వాసుదేవన్ సైతం అభిప్రాయపడ్డారు. అయితే తాము ఎలాంటి ఒత్తిడికి తలొగ్గలేదని, 70 ఏళ్ల చరిత్ర ఉన్న తమ సంస్థకు ఇలాంటి నోటీసులు కొత్తేమీ కాదని FWICE ప్రెసిడెంట్ బి.ఎన్. తివారీ స్పష్టం చేశారు. ఇండస్ట్రీలో ప్రశాంతత కోసమే బ్యాన్ ఎత్తివేసినట్లు వెల్లడించారు.

This post was last modified on June 3, 2026 5:33 pm

Share

Recent Posts

‘బ్రేకింగ్ బ్యాడ్’తో ‘జైలర్‌’కేం పని?

అటు ఇటుగా ఇంకో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘జైలర్-2’ సినిమా. 2023లో ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన…

13 minutes ago

గుంత కనిపిస్తే AI చూసుకుంటుంది

రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడం వరకు చాలామంది చేస్తుంటారు. కానీ ఆ గుంతను బాగు…

49 minutes ago

ప్రభాస్ ఫ్యాన్స్ అయోమయం తీర్చాల్సిందే

ఫౌజీ వాయిదా పడింది. సంతోషం. ఇలాంటి పోస్టుపోన్లు చూడటం కొత్తేమి కాదు కాబట్టి అందులో ఫీలవ్వడానికి ఏం లేదు. మరి…

1 hour ago

రోడ్డుపై పడుకొని ప్రియాంకా గాంధీ నిరసన

ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో వివాదాల నేపథ్యంలో ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కాక్రోచ్…

2 hours ago

ఫుట్ పాత్ లపై ట్రాన్స్ ఫార్మర్లేంది స్వామీ?

మన దేశంలో పాదచారుల కోసం రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ఫుట్ పాత్ ల మీద బడ్డీ కొట్లు మొదలు...జ్యూస్…

2 hours ago

రేవంత్ ఫాంహౌస్ పాచిక పెద్దదే

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ ను నిశితంగా చూస్తే..ఆయనలో తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పని చేసిన అధినేతల నీడలు కొట్టొచ్చినట్లు…

3 hours ago