Political News

తెలంగాణలో జనసేన సింగిల్ గా గర్జిస్తుందా?

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీకి జనసేనతో పొత్తు అవసరం లేదు అని పవన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో జనసేన స్వతంత్రంగా పోటీ చేసి పరిమిత సీట్లు గెల్చుకున్న అనంతరం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే పవన్ ఈ కామెంట్లు చేసినట్లుగా అనిపిస్తోంది. జనసేనతో పొత్తు లేదు, స్వతంత్రంగా పోటీ చేశామని ఆయన చెప్పారు. దానికి స్పందనగానే పొత్తు లేకుండానే జనసేన బలంగా నిలబడుతుందని పవన్ ప్రకటించినట్లు కనిపిస్తోంది.

అయితే, ఏపీ రాజకీయాల మాదిరిగా తెలంగాణ రాజకీయాల్లో జనసేన నిలబడడం అంత సులభం కాదు. తెలంగాణ రాజకీయాల్లో జనసేన అనేక సవాళ్లు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వంటి మూడు పెద్ద పార్టీలతో పాటు కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేనతో కూడా పోటీ పడాల్సి ఉంటుంది.

తెలంగాణలో స్థానిక సమస్యలు, అభివృద్ధి, అన్యాయాలపై పోరాడతామని పవన్ అన్నారు. అయితే, స్వతంత్రంగా నిలబడడం మూడు పెద్ద పార్టీలతో తలపడడం అంత ఈజీ కాదు.

ఆంధ్రా నాయకుడిగా పవన్ కు ముద్రపడింది. అందులోనూ అక్కడ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ఉన్నారు. కాబట్టి, పవన్ ను తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకోవడం కష్టం.

తెలంగాణ సెంటిమెంట్, ఆంధ్రా నేపథ్యం కారణంగా పవన్ వ్యతిరేకత ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆంధ్రాలో కూడా జనసేన సంస్థాగతంగా బలపడాల్సి ఉంది. ఇక తెలంగాణలో అయితే జనసేనకు ఉన్న సంస్థాగత బలం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కేడర్, లోకల్ లీడర్‌షిప్ పరంగా జనసేన గ్రౌండ్ లెవెల్ నుంచి బలపడాల్సి ఉంది.

రాజకీయాల్లో పొత్తు లేకుండా బలపడడం సాధ్యమే…కానీ చాలా కష్టం. పవన్ ఎప్పట్లాగే భావోద్వేగంతో మాట్లాడారు. తెలంగాణలో ఇది ఎంతవరకు పని చేస్తుంది అన్న ప్రశ్నకు కాలనీ సమాధానం చెప్పాలి.

This post was last modified on June 3, 2026 6:16 am

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

2 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

2 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

3 hours ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

3 hours ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

5 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

6 hours ago