అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ సెట్స్ లోకి బన్నీతో పాటు బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొణె, జిమ్ సర్భ్, ఫెమినా జార్జ్ అడుగుపెట్టనున్నారు. మధ్య మధ్యలో కాస్త గ్యాప్ తీసుకున్న బన్నీ, ఇప్పుడు ఈ పాన్ ఇండియా సినిమా షూటింగ్ కోసం పూర్తిగా రంగంలోకి దిగుతున్నాడు.
ఈ మూవీ మేకింగ్ విషయంలో దర్శకుడు అట్లీ తెలివైన పద్ధతిని ఫాలో అవుతున్నాడు. సాధారణంగా హీరోలు సెట్స్ లోకి వచ్చాక సీన్స్ తీసి, ఆ తర్వాత గ్రాఫిక్స్ పనులు చేస్తారు. కానీ రాకా టీమ్ మాత్రం విజువల్స్, వీఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉండే భారీ యాక్షన్ సీక్వెన్స్ లను గత ఏడాది కాలంగా హీరో లేకుండానే షూట్ చేస్తూ వస్తోంది. గ్రీన్ మ్యాట్ సాయంతో టెక్నికల్ టీమ్ ఆ కష్టమైన గ్రాఫిక్స్ బ్యాక్ గ్రౌండ్ వర్క్ అంతా ముందే కంప్లీట్ చేసిందని సమాచారం. అసలు షూటింగ్ ఎప్పుడో మొదలైనా బయటకు మాత్రం సైలెంట్ గా పని కానిచ్చేశారని తెలుస్తోంది.
ఇలా ముందుచూపుతో ప్లాన్ చేయడం వల్ల బన్నీ కాల్ షీట్స్ అస్సలు వేస్ట్ కావట. ఇప్పుడు జరగబోయే షెడ్యూల్ లో నటీనటుల ముఖాలు కనిపించే క్లోజప్ షాట్స్, ఎమోషన్స్, డైలాగ్స్ తో కూడిన సీన్స్ మాత్రమే తీస్తున్నట్లు టాక్. ముందే రెడీగా ఉన్న గ్రాఫిక్స్ సీన్స్ లోకి ఈ విజువల్స్ ను సింక్ చేస్తారట.
దీనివల్ల పోస్ట్ ప్రొడక్షన్ టెన్షన్ కూడా చాలా వరకు తగ్గుతుంది. దాదాపు అరవై శాతం సీజీఐ వర్క్ ముందే పూర్తవ్వడంతో, సినిమా రిలీజ్ కి గ్రాఫిక్స్ పనుల వల్ల ఎలాంటి బ్రేకులు పడవు. జవాన్ టైమ్ లో ఎదురైన డిలే ఇబ్బందులు రిపీట్ కాకుండా అట్లీ పక్కా స్కెచ్ తో వెళ్తున్నాడని అర్ధమవుతుంది.
ఇక ఈ జూన్ షెడ్యూల్ రాకా సినిమాకి అసలైన ఆయుధం లాంటిదని టాక్ వస్తోంది. దీపికా క్యారెక్టర్ నెవ్వర్ బిఫోర్ అనేలా కథలో చాలా కీలకమైన పాత్రలో నటిస్తున్నారట. అలాగే టాలెంటెడ్ యాక్టర్ జిమ్ సర్భ్ పవర్ ఫుల్ విలన్ గా నటిస్తున్నాడు. వీళ్లందరి కాంబినేషన్ లో వచ్చే కీలకమైన టాకీ పార్ట్ ఇప్పుడే పూర్తి చేస్తారట.
ఇది పూర్తయితే సినిమాలో కష్టమైన భాగం ఎనభై శాతం అయిపోయినట్లే. ఆ తర్వాత కేవలం సాంగ్స్, చిన్న ప్యాచ్ వర్క్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంటాయి. విజువల్ క్వాలిటీ విషయంలో సన్ పిక్చర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు.
సుమారు 800 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు టాక్. ఇంత భారీ పెట్టుబడి పెడుతున్నప్పుడు హడావిడిగా రిలీజ్ చేయకుండా, పర్ఫెక్ట్ అవుట్ పుట్ తో 2028లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ కీలకమైన షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత గ్లింప్స్ అప్ డేట్ బయటకు వచ్చే అవకాశం ఉంది.
This post was last modified on June 2, 2026 10:54 pm
ఏ పార్టీ అయినా.. తీసుకునే నిర్ణయాలు.. చేసే ప్రకటనల విషయంలో ఆచి తూచి వ్యవహరించాలి. సమయం వచ్చిందనో.. సందర్భం చిక్కిందనో…
త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలను పూర్తిస్థాయిలో బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ఎన్నికల సంఘం కూడా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ కుటుంబం సృష్టించిన దుమారం ఇంకా కొనసాగుతుంది. పరకాల సీటు విషయంలో…
సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఆలోచనతో యువత చేస్తున్న కొన్ని ప్రయత్నాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. జార్ఖండ్‌లో రీల్ తీసుకునేందుకు…
మలయాళంలో చాలా మంచి పేరున్న స్టార్ హీరోల్లో నివిన్ పౌలీ ఒకడు. స్టార్ హీరో అన్న అహం లేకుండా చాలా…
సినిమా నచ్చితే మరోసారి చూడటం, టికెట్లు దొరకకపోతే మరో షోకు వెళ్లడం చూస్తుంటాం. కానీ తమకు కావాల్సిన సినిమాను థియేటర్…