Political News

కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ఉద్యోగ వ్యవస్థకు సంబంధించి పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలనలో ఇకపై ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులుగానే ఉంటారని, ఇకపై కాంట్రాక్టు ఉద్యోగులన్నమాటే వినిపించదని ఆప్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆప్ కేబినెట్ రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మాన్ సర్కారు తీసుకున్న ఫలితంగా పంజాబ్ లోని 51 ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్టు పద్దతిన పనిచేస్తున్న 65,048 మంది ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోయారు.

ఆయా ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు పద్దతిన 5 ఏళ్లకు మించి పనిచేసిన వారంతా ఇకపై ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడతారని ఈ సందర్భంగా మాన్ సర్కారు తేల్చి చెప్పింది. పంజాబ్ అవుట్ సోర్స్ డ్ బిల్లు 2026 పేరిట కేబినెట్ ఆమోదం పొందిన ఈ చట్టంతో కాంట్రాక్టు ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారడంతో పాటుగా ప్రభుత్వ ఉధ్యోగులకు మాదిరిగా అన్ని ప్రభుత్వ సదుపాయాలకు అర్హత పొందుతారు.

రోజువారీ విధుల్లో భాగంగా అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేసే అగ్నిమాపక శాఖ, పీఎస్ పీఎల్ లైన్ మన్, పట్టణ, స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మూడేళ్ల కాంట్రాక్ట్ పూర్తి చేసిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోతారని ఈ బిల్లు చెబుతోంది.

ఈ కొత్త బిల్లు గురించి పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్వయంగా ఈ విషయాలను మీడియాకు వివరించారు. కేబినెట్ భేటీ అనంతరం నేరుగా మీడియా సమావేశానికి వచ్చిన మాన్.. రాష్ట్రంలో ఇకపై కాంట్రాక్ట్ బేసిస్ కింద పనిచేసే కార్మికులు ఉండబోరని ఆయన ప్రకటించారు.

తమ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న వేలాది మంది కాంట్రాక్టు కార్మికులకు లబ్ధి చేకూరనుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ఇకపై ఆయా విభాగాల్లో కాంట్రాక్టు పద్దతిన పనికి కుదిరే కార్మికులు నిర్ణీత కాలం పనిచేయగానే… నేరుగా ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోతారని కూడా ఆయన ప్రకటించారు.

This post was last modified on May 31, 2026 10:44 pm

Share

Recent Posts

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

2 hours ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

5 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

7 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

8 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

8 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

9 hours ago