Movie News

తెలుగు దుకాణంలో డబ్బింగ్ వ్యాపారం

వేసవిలో కీలకమైన నెలగా చెప్పుకునే మే అయిపోయింది. స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ఉండే ఈ ముఖ్యమైన సీజన్ టాలీవుడ్ వృథా చేసుకుంది. ఒక్కటంటే ఒక్కటి స్ట్రెయిట్ సినిమా లేక మూవీ లవర్స్ కు డబ్బింగులే దిక్కయ్యాయి. వీరభద్రుడుకి నెగటివ్ టాక్, రివ్యూస్ వచ్చినా సరే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయనే కారణంతో జనం బాగానే చూశారు. ఫలితంగా సూర్యకు చాలా కాలం తర్వాత తెలుగులో చెప్పుకోదగ్గ వసూళ్లు వచ్చాయి. అది కూడా ప్రతికూల వాతావరణంలో.

దృశ్యం 3 బాలేదన్నారు. సోషల్ మీడియా మద్దతు కూడా పెద్దగా లేదు. వెంకటేష్ చేయకపోవడంతో ఆయన అభిమానులు మోహన్ లాల్ ని చూడలేమంటూ లైట్ తీసుకున్నారు. కానీ విచిత్రంగా ఫ్యామిలీ ఆడియన్స్ కొంత మేర అండగా నిలబడ్డారు. ముగింపు ఎలా ఉంటుందోననే నమ్మకంతో జీతూ జోసెఫ్ కోసం థియేటర్లకు వచ్చారు. తాజాగా అర్జున్ బ్లాస్ట్ జోన్ సైతం మంచి ఆక్యుపెన్సీలతో ఏ మాత్రం ఊహించని విధంగా ట్రెండింగ్ లోకి రావడం ట్రేడ్ ని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇక్కడ చెప్పిన మూడు సినిమాలు మన దగ్గర బ్లాక్ బస్టర్లు కాదు. కానీ చాలా సేఫ్ గేమ్ ఆడాయి. కొన్నవాళ్లకు నష్టం రాలేదు. కారణం మన బంగారంలో మెరుగు లేకపోవడమే. గాయపడ్డ సింహం, జెట్లీ, రేజర్, సతీ లీలావతి, గోదారి గట్టుపైన, పురుషః, రమణి కళ్యాణం, అగ్లీ స్టోరీ, త్రికాల, సందిగ్ధం, ఫస్ట్ టైం, హరుడు, దూరదర్శిని, మరీచిక ఇలా చెప్పుకుంటూ పొతే పెద్ద లిస్టు అవుతుంది కానీ వీటిలో ఒకటి రెండు తప్ప మిగిలినవి కనీసం జనం దృష్టిలో రిలీజైన పేరు కూడా తెచ్చుకోలేదు.

ఇంత బ్యాడ్ సమ్మర్ గత కొన్నేళ్లలో ఎప్పుడూ చూడలేదని డిస్ట్రిబ్యూటర్లు ఓపెన్ గా కామెంట్ చేస్తున్నారు. బంగారం లాంటి అవకాశం చేజేతులా పోయి డబ్బింగులతో నెట్టుకురావడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూన్ 4 రాబోతున్న పెద్దితోనే మళ్ళీ పునర్ వైభవం రావాలని కోరుకుంటున్నారు. దానికి తగ్గట్టే సరిపడా హైప్ ఉంది కానీ అది భారీ వసూళ్లుగా మారడం టాక్ మీద ఆధారపడి ఉంది. యావరేజ్ పైనా ఉన్నా చాలు కలెక్షన్ల మోత మోగడం ఖాయం.

This post was last modified on May 31, 2026 9:54 pm

Share

Recent Posts

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

2 hours ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

5 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

7 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

8 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

8 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

9 hours ago