Political News

పెద్ద‌ల స‌భ‌కు విజ‌య్‌.. మంచిదేనా.. ?

అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ రాజ్యసభకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నర్సీపట్నం నియోజకవర్గంలో నిర్వహించిన మహానాడు వేదికగా ఆయనను సమర్ధించే కార్యకర్తలు, నాయకులు విజయ్ కు రాజ్యసభ టికెట్ ఇవ్వాలని తీర్మానం చేశారు. అయితే, ఈ సీటు వస్తుందా.. రాదా.. అనే విషయాన్ని పక్కన పెడితే అసలు విజయ్‌కు రాజ్యసభ సీటు ఇవ్వడం ఎంతవరకు మంచిది? ఎంతవరకు భవిష్యత్తు ఉంటుంది? అనే అంశాలు ఆసక్తిగా మారాయి. ప్రధానంగా పెద్దల సభ అనగానే వయసు మళ్ళిన వాళ్ళు.. లేదా బాగా అనుభవజ్ఞుడైన వారికి మాత్రమే ఒకప్పుడు టికెట్లు ఇచ్చేవారు.

తద్వారా లోక్‌స‌భ‌ తీసుకునే నిర్ణయాలు రాజ్యసభలో చర్చించి అనంతరం వాటిని ఆమోదించే పరిస్థితి ఉండేది. అయితే రాను రాను పెద్దల సభ కూడా రాజకీయ పునరావసర కేంద్రంగా మారింది అనేది ప్రధాన విమర్శ. ఈ క్రమంలోనే అనేకమంది రాజ్యసభకు వస్తున్నారు. ఇటీవల రెండు దశాబ్దాలుగా రాజ్యసభకు వెళుతున్న వారిని గమనిస్తే వయసుతో నిమిత్తం లేకుండా అనేకమంది రాజ్యసభలో కూర్చునే పరిస్థితి ఉంది. కానీ ఇది వ్యక్తిగత రాజకీయాలను గమనించినప్పుడు సదరు నేతలకు పెద్దగా కలిసి రావడం లేదు.

దీనికి ప్రధాన కారణం రాజ్యసభకు వెళ్ళిన వారిపై ప్రజల్లో పెద్దగా ఇమేజ్ లేకపోవడంతో పాటు స్థానిక సమస్యలపై వారు పోరాటం చేసే పరిస్థితి కూడా ఉండదనే ఆలోచన బలంగా నాటుకుపోయింది. ఈ నేపథ్యంలో విజయ్ లాంటి ఫ్యూచర్ ఉన్న యువ నాయకులకు రాజ్యసభ అనేది అంత సరైన వేదిక కాదన్న చర్చ నడుస్తోంది. ప్రస్తుతం విజయ్ వయసు 40లలోపే ఉంది. ఆయనకు మంచి భవిష్యత్తు కూడా ఉంది. మరొక మూడు సంవత్సరాలు ఆగితే అదే నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంటుంది.

తద్వారా ప్రజలకు మరింత ఎక్కువగా సేవ చేసేందుకు కూడా అవకాశం లభిస్తుంది. దీనికి తోడు ప్రధానంగా క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులు కార్యకర్తలతో ఆయనకు ఉన్న అనుబంధం మరింత పెంచుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు పదవి కావాలి అన్న ఏకైక లక్ష్యమో.. లేకపోతే తాను కూడా ఏదో ఒక పదవిని దక్కించుకోవాలన్న ఆలోచనతో ఉండటమో తెలియదు కానీ మొత్తానికి రాజ్యసభకు వెళ్లాలన్న ఆలోచనలో అయితే విజయ్ ఉన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయ్ లాంటి యువ నాయకుడు అసెంబ్లీకి వెళ్లడం ద్వారా స్థానిక సమస్యలను ప్రస్తావించడంతోపాటు వ్యక్తిగతంగా ఇమేజ్ను పెంచుకునేందుకు కూడా అవకాశం ఉంటుందన్న వాదన బలంగా వినిపిస్తోంది.

కాబట్టి విజయ్ లాంటి యువకులకు ముఖ్యంగా భవిష్యత్తు నాయకులుగా పేరు తెచ్చుకున్న వారికి స్థానిక అసెంబ్లీ లేదా లోక్‌స‌భ‌కు పోటీ చేయడమే సరైన మార్గం. ఈ నేపథ్యంలో విజయ్ కు రాజ్యసభ అంతగా పేరు తీసుకురాకపోవచ్చు అన్న చర్చ నడుస్తోంది. దూకుడు స్వభావంతో పాటు వారసత్వంగా వచ్చిన రాజకీయాలను కాపాడుకునేందుకు రాజ్యసభకు వెళితే ఒక గేటు మూసుకుపోతుందన్న చర్చ కూడా నడుస్తోంది. కాబట్టి విజయ్ మరొక మూడు సంవత్సరాలు ఆగి నర్సీపట్నం నియోజకవర్గ నుంచి పోటీ చేయడమే ఉత్తమమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

This post was last modified on May 29, 2026 7:41 am

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

13 minutes ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

50 minutes ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

1 hour ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

2 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

2 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

2 hours ago