Political News

రోడ్డు పక్కన తాటిముంజలు తిన్న సీఎం దంపతులు

ఏపీలో భానుడు భగభగ మండుతున్న వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు రోడ్డు పక్కన ఆగి తాటి ముంజలు తింటూ గ్రామీణ జీవన శైలిని గుర్తుచేసుకున్నారు. కుప్పం పర్యటనలో భాగంగా ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు వెళ్లి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం తిరుగు ప్రయాణంలో తంజమ్మకొట్టాలు సమీపంలో కల్లుగీత కార్మికులు తాటి ముంజలు తీస్తుండటాన్ని గమనించిన సీఎం దంపతులు అక్కడే ఆగారు.

ఈ సందర్భంగా తాజాగా తీసిన తాటి ముంజలను రుచి చూసిన సీఎం చంద్రబాబు.. “కల్తీ లేదు.. కార్బైడ్ లేదు.. పురుగుమందుల గోల లేదు.. మా కుప్పం ప్రజల మనసుల్లాంటి స్వచ్ఛమైన, చల్లనైన తాటి ముంజలు తింటుంటే ఎంతో హాయిగా ఉంది. మన గ్రామీణ ఆహార ఉత్పత్తులను మించింది ఏముంటుంది” అంటూ సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యానించారు.

మరోవైపు నారా భువనేశ్వరి కూడా ఈ అనుభూతిని పంచుకున్నారు. చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయని పేర్కొంటూ.. గ్రామీణ ప్రాంతాల్లో లభించే సహజ ఆహార పదార్థాలకు ప్రత్యేకమైన రుచి ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా కల్లుగీత కార్మికులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు వారి వృత్తి సమస్యలు, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ వృత్తులు, సంప్రదాయ ఆహారాలకు ప్రోత్సాహం అవసరమని అభిప్రాయపడ్డారు.

This post was last modified on May 20, 2026 4:38 pm

Share

Recent Posts

ఆలస్యం ‘ఆదర్శం’ కాకుంటే చాలు

ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…

2 hours ago

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

7 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

9 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

9 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

11 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

12 hours ago