Political News

బీజేపీ మంత్రికి మూకుమ్మడి సెగ

బీజేపీ సీనియర్ నేత, ఏపీ కేబినెట్ లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా కొనసాగుతున్న సత్యకుమార్ కు ఇప్పుడు సొంత పార్టీకి చెందిన నేతల నుంచే సవాల్ లు వినిపిస్తున్న వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది. సత్యకుమార్ కు దమ్ముంటే రాజీనామా చేయాలని, పార్టీ తరఫున పోటీ చేస్తావో, లేదంటే సొంతంగానే పోటీ చేస్తావో చేయమని… ఎలా పోటీ చేసినా ఓడించి తీరతానని బీజేపీకి చెందిన ధర్మవరం స్థానిక నేత సుదర్శన్ రెడ్డి సవాల్ విసిరారు.

సొంత పార్టీ అని కూడా చూడకుండా తమపైనే దాడులకు దిగుతారా? అంటూ ఆయన సత్యకుమార్ పై ఒంటికాలిపై లేచారు. టీడీపీ, కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన మంత్రికి వ్యతిరేకంగా మూకుమ్మడి నిరసనకు దిగారు.

ఇలా తన సొంత పార్టీకి చెందిన ఓ స్థానిక నేత ధర్మవరం ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి సత్యకుమార్ పై ఈ తరహాలో బహిరంగంగా సవాల్ విసరడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఈ తరహా పరిణామాలకు దారి తీసిన విషయంలోకి వెళితే… ధర్మవరానికి చెందిన అంజన్ రెడ్డి అనే హైకోర్టు న్యాయవాదిపై సత్యకుమార్ అనుచరులు దాడికి పాల్పడ్డారట.

ఈ విషయం తెలుసుకున్న సుదర్శన్ రెడ్డి… బీజేపీ శ్రేణులతో పాటు టీడీపీ, కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మరీ ధర్మవరంలో నిరసనకు దిగారు. కూటమి మంత్రిపై ఇలా వైసీపి మినహా అన్ని పార్టీలకు చెందిన నేతలు మూకుమ్మడి నిరసనకు దిగిన వైనం కలకలం రేపుతోంది.

ధర్మవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సత్యకుమార్…అసలు స్థానికుడే కాదని సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. అయినా పార్టీ ప్రతిపాదించిన మేరకు స్థానికేతరుడైనా సత్యకుమార్ ను గెలిపించామన్న సుదర్శన్ రెడ్డి… గెలిచాక మంత్రి గారీ అరాచకాలను సహించడం కష్టంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నియోజకవర్గంలో సత్యకుమార్ అనుచరులు భూకబ్జాలకు పాల్పడుతున్నారని, సత్యకుమార్ నియోజకవర్గ వ్యాప్తంగా వసూళ్లకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. తాను చేసిన ఆరోపణలు అక్షర సత్యమని కూడా ఆయన పేర్కొన్నారు. తన ఆరోపణలు సత్యదూరమని సత్యకుమార్ భావిస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేయాలని సుదర్శన్ రెడ్డి సవాల్ విసిరారు. మరి సుదర్శన్ రెడ్డి సవాల్ కు సత్యకుమార్ ఎలాంటి బదులిస్తారన్న విషయంపై ఆసక్తికర చర్చకు తెర లేసింది.

This post was last modified on May 20, 2026 4:42 pm

Share

Recent Posts

ఆలస్యం ‘ఆదర్శం’ కాకుంటే చాలు

ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…

49 minutes ago

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

5 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

7 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

8 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

10 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

10 hours ago