Movie News

ఇవి ‘టైమింగ్’ హిట్లు

ఈ రోజుల్ల సినిమాలు తీయడం కంటే.. వాటిని సరిగ్గా రిలీజ్ చేయడం కీలకంగా మారింది. రిలీజ్ టైమింగ్‌ను బట్టి కొన్నిసార్లు సినిమాల ఫలితాలు కూడా మారిపోతుంటాయి. కొన్ని సినిమాలకు బాక్సాఫీస్ టైమింగ్ కలిసి రాక అనుకున్న ఫలితాన్ని అందుకోవు. కొన్నేమో బాక్సాఫీస్ దగ్గర అనుకూల పరిస్థితులను ఉపయోగించుకుని అనుకున్న దాని కంటే పెద్ద విజయం సాధిస్తుంటాయి.

గత ఏడాది తెలుగులో ‘లిటిల్ హార్ట్స్’ అనే చిన్న సినిమా ఏకంగా రూ.40 కోట్ల వసూళ్లు సాధించడం అనూహ్యం. సమ్మర్లో సరైన సినిమాలు లేని టైంలో ఈ చిన్న చిత్రం మంచి టాక్ తెచ్చుకోవడంతో జనం ఎగబడి చూశారు. సినిమా ఎవ్వరూ ఊహించని రేంజికి వెళ్లిపోయింది. వేరే టైంలో రిలీజైతే ఆ సినిమా హిట్టయ్యేదేమో కానీ.. ఆ స్థాయిలో అయితే వసూళ్లు రాబట్టేది కాదు.

ఇక ఈ ఏడాది సంక్రాంతి సినిమాల సంగతి తెలిసిందే. మన శంకర వరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి.. వీటిలో ఏ సినిమా అయినా వేరే టైంలో రిలీజైతే ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టేవి కావు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతికి రాకుండా రీజనల్ ఇండస్ట్రీ హిట్టయ్యేంత సినిమానా అంటే టక్కున అవునని చెప్పలేం.

అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి చిత్రాలు వేరే సమయంలో అయితే యావరేజ్ అనిపించుకునేవేమో. కానీ సంక్రాంతి టైంలో అవి సూపర్ హిట్లు అయ్యాయి. గత నెలలో వచ్చిన ‘డెకాయిట్’కు కూడా టైమింగ్ బాగా కలిసొచ్చింది. సరైన సినిమాలు లేని టైంలో రిలీజ్ కావడం వల్ల యావరేజ్ టాక్‌తోనూ సినిమా మంచి వసూళ్లు సాధించింది.

ఇక వర్తమానంలోకి వస్తే.. ‘కరుప్పు’ అయితే పైన చెప్పుకున్న ఏ చిత్రంతో పోల్చి చూసినా తక్కువ స్థాయి చిత్రమే. తెలుగులో అయితే ఈ సినిమాకు నెగెటివ్ టాకే వచ్చింది. కానీ మిడ్ సమ్మర్లో స్టార్ హీరోల సినిమాలు లేక ప్రేక్షకులు తీవ్రంగా నిరాశ చెందుతున్న సమయంలో రిలీజ్ కావడం దీనికి బాగా కలిసొచ్చింది.

సినిమాకు టాక్ అంత బాలేదని తెలిసినా.. జనం థియేటర్లకు వచ్చి ఈ సినిమా చూశారు. తెలుగులో కూడా అనుకున్న దాని కంటే చాలా బాగా ఆడిన సినిమా.. తమిళంలో అయితే బ్లాక్ బస్టర్ రేంజికి వెళ్తోంది. దీన్ని బట్టి సినిమాలకు రిలీజ్ టైమింగ్ అన్నది చాలా ముఖ్యం అని అర్థం చేసుకోవాలి.

This post was last modified on May 20, 2026 12:06 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

7 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

9 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

9 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

10 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

10 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

11 hours ago