Political News

మ‌ళ్లీ `ఇన్‌ఫ్లేష‌న్` భూతం… జేబుల‌కు చిల్లే!

దేశంలో గ‌త ఆరు మాసాలుగా ఒకింత అదుపులో ఉన్న ద్రవ్యోల్బ‌ణం(ఇన్‌ఫ్లేష‌న్‌) ప్ర‌స్తుతం పెరుగుతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆర్బీఐ కూడా ఇదే మాట చెబుతోంది. దీంతో త్వ‌ర‌లోనే అన్ని ర‌కాల వ‌స్తువుల ధ‌ర‌ల‌తోపాటు.. గృహ‌రుణాల‌పై వ‌డ్డీలు, ప‌ర్స‌న‌ల్ లోన్ల‌పైనా.. వాహ‌న రుణాల‌పైనా వ‌డ్డీలు మ‌రింత పెరగ‌నున్నాయ‌న్న సంకేతాలు వ‌స్తున్నాయి.

ఏంటీ ద్ర‌వ్యోల్బ‌ణం?

ద్రవ్యోల్బణం…. ఒక నిర్దిష్ట కాలంలో వస్తువులు, సేవల ధరలు నిరంతరంగా పెరిగి, ప్ర‌జ‌ల‌ కొనుగోలు శక్తి తగ్గిపోవడమే ద్ర‌వ్యోల్బ‌ణం. దీనివల్ల మార్కెట్‌లో నిత్యావసర సరుకులు, ఇంధన ధరలు, జీవన వ్యయం భారమవుతాయి. ప్రస్తుత దేశ ద్రవ్యోల్బణ పరిస్థితులు, దీని ప్రభావాలు ప్ర‌జ‌ల‌పై తీవ్ర స్థాయిలో ప్ర‌భావం చూప‌నున్నాయ‌ని తెలుస్తోంది. ముఖ్యంగా వినియోగదారుల ధరల సూచిక (CPI) ఆధారంగా ద్రవ్యోల్బణం 3.5% వరకు నమోదవుతోంది,

అందులోనూ ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం దాదాపు 4.2% కంటే ఎక్కువగా ఉంది. కూరగాయలు, పప్పుధాన్యాలు, ఇతర ఆహార పదార్థాల ధరలు మ‌రింత పెర‌గ‌నున్నాయి. ఇక‌, అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరుగుదల కార‌ణంగా రూపాయి మారకం విలువ బలహీనపడింది. దీంతో ఇంధ‌న ధ‌ర‌లు ఆకాశాన్ని చేరుకున్నాయి. ఫ‌లితంగా రవాణా, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి.

ఇక‌, కీల‌క‌మైన ప్ర‌పంచ‌ పరిణామాలు, యుద్ధ నేప‌థ్యంతో అంత‌ర్జాతీయ‌ సరుకుల రవాణా ఖర్చులు పెరిగిపోయాయి. ఇది ధరల పెరుగుదలకు దారితీసింది. సాధారణ జీవితంపై ప్రభావం ఎక్కువ‌గా ఉంటోంది. ప్ర‌జ‌ల కొనుగోలు శక్తి పతనమ‌య్యే అవ‌కాశం ఉంటుంది. సామాన్యుల నెలవారీ బడ్జెట్ పై తీవ్ర ప్రభావం పడుతుంది. పొదుపు, మదుపులపైనా ప్రభావం చూపుతుంది.

బ్యాంకులలో డబ్బు దాచుకుంటే వచ్చే వడ్డీ కంటే ద్రవ్యోల్బణం వల్ల ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇదే స‌మ‌యంలో బ్యాంకులు వ‌డ్డీల‌ను పెంచుతాయి. దీంతో గృహ రుణాలు, వాహ‌న రుణాలు, విదేశీ విద్యా రుణాల‌పై వ‌డ్డీల‌ను మ‌రింత పెంచే అవ‌కాశం ఉంది.

ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ఆర్బీఐ రెపో రేట్లను పెంచుతుంది. దీనివల్ల రుణాలపై వ‌డ్డీ పెరిగి.. మార్కెట్లో డబ్బు చలామణి తగ్గుతుంది. సో మొత్తంగా యుద్ధం తెచ్చిన తంటాల కార‌ణంగా.. సామాన్యుల జేబులకు చిల్లులు ప‌డ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు నిపుణులు.

This post was last modified on May 20, 2026 9:07 am

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

5 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

7 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

7 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

7 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

7 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

8 hours ago