Movie News

గ్రేట్ ఇండియన్ డైరెక్టర్ నుంచి వెబ్ సిరీస్

రాజ్ కుమార్ హిరాని.. రాశి కంటే వాసి ముఖ్యం అనే మాటకు నిలువెత్తు నిదర్శనం ఈ బాలీవుడ్ దర్శకుడు. మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగేరహో మున్నాభాయ్, 3 ఇడియట్స్, పీకే, సంజు, డంకి.. దర్శకుడిగా ఇవీ ఆయన రూపొందించిన చిత్రాలు. ఇందులో అన్నీ విజయవంతమైన చిత్రాలే. ‘డంకి’ జస్ట్ హిట్ అయింది. మిగతావన్నీ బ్లాక్ బస్టర్లు అయ్యాయి. హిరాని అనే పేరు పోస్టర్ మీద కనిపిస్తే కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయే ప్రేక్షకులు దేశంలో లక్షల మంది ఉన్నారు.

ఐతే ‘డంకి’ తర్వాత ఆయన కొత్త సినిమా విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. మున్నాభాయ్-3 అని, 3 ఇడియట్స్ సీక్వెల్ అని రకరకాల వార్తలు వస్తున్నాయి కానీ.. ఇంకా ఏ సినిమా అధికారికంగా ప్రకటించలేదు. ఈ లోపు హిరాని షో రన్నర్‌గా ఒక వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతుండడం విశేషం. దాని పేరు.. ప్రీతమ్ అండ్ పెడ్రో.

జియో హాట్ స్టార్ వేదికగా ‘ప్రీతమ్ అండ్ పెడ్రో’ స్ట్రీమ్ కాబోతోంది. జులై 3 నుంచి ఈ సిరీస్ ప్రసారం అవుతుంది. ఈ సిరీస్‌కు హిరాని క్రియేటర్ మాత్రమే కాదు.. ప్రొడ్యూసర్ కూడా. అవినాశ్ అరుణ్ దర్శకత్వం వహించాడు. ఇందులో హిరాని తనయుడు వీర్ హిరాని లీడ్ రోల్ చేయడం విశేషం. అతడితో పాటు ‘మున్నాభాయ్’ ఫేమ్ అర్షద్ వార్సీ మరో ముఖ్య పాత్ర చేస్తున్నాడు.

కొడుకును హిరాని సినిమాలతో కాకుండా ఇలా వెబ్ సిరీస్‌తో ప్రమోట్ చేయడం విశేషమే. ఈ సిరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బట్టి చూస్తే ఇది ఒక ఏటీఎం దొంగతనం చుట్టూ తిరిగే కథలా అనిపిస్తోంది. ఇది స్ట్రీమింగ్ అయ్యాక హిరాని నుంచి తర్వాతి సినిమాకు సంబంధించి అప్‌డేట్ వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుత సంకేతాలను బట్టి చూస్తే ఆమిర్ ఖాన్‌తో ఆయన ‘3 ఇడియట్స్’ సీక్వెల్‌నే పట్టాలెక్కించే అవకాశముంది.

This post was last modified on May 20, 2026 11:58 am

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

5 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

8 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

8 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

8 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

8 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

9 hours ago