Movie News

బంగారం వదిలేసిన టోవినో థామస్

నిన్న విడుదలైన డ్రాగన్ టీజర్ లో పాత్రల పరిచయం, జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రో అన్నీ చూపించేశారు. ఆఫ్గనిస్తాన్ మాఫియాలో ఎన్ని శక్తులు ఉంటాయనేది స్పష్టంగా పేర్లతో సహా చెప్పేశారు. హీరో, విలన్లను పట్టుకునే ఆఫీసర్ గా అనిల్ కపూర్ గురించి కూడా క్లారిటీ వచ్చేసింది. అయితే చాలా మంది మదిలో మెదులుతున్న ప్రశ్న ఒకటుంది. టోవినో థామస్ వదిలేసిన క్యారెక్టర్ ఏది అని. దానికి సమాధానం కొంచెం డీటెయిల్డ్ గా చూస్తే అర్థమవుతుంది.

దర్శకుడు ప్రశాంత్ నీల్ భారతదేశానికి ఓవైపు ఉండే ఆఫ్ఘన్ డాన్స్ చూపించాడు కానీ ఇంకోపక్క ఉండే గోల్డెన్ ట్రయాంగిల్ ని ఎవరు శాశిస్తారనేది చూపించలేదు. అంటే అసలు విలన్ అక్కడ ఉంటాడన్న మాట. ఇన్ సైడ్ టాక్ ప్రకారం టోవినో వదిలేసింది ఇదేనట. తారక్ తో సమానంగా వెయిట్ ఉండే ఈ పాత్ర కోసం చాలా ఆప్షన్లు పరిశీలించారు. దాని డెప్త్ తెలిసే టోవినో థామస్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. కానీ బల్క్ డేట్లు ఇవ్వలేక వదిలేసుకున్నారు.

ఇప్పుడీ గోల్డెన్ ట్రయాంగిల్ బాస్ ఎవరనేది తేలాల్సి ఉంటుంది. వివేక్ ఒబెరాయ్ తో పాటు రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి కానీ ప్రశాంత్ నీల్ ఎవరిని ఫైనల్ చేస్తాడనేది వేచి చూడాలి. సలార్ లో పృథ్విరాజ్ సుకుమారన్, కెజిఎఫ్ లో సంజయ్ దత్ వాటికి ఎంత బలమయ్యారో తెలిసిందే. అంతకు మించిన స్థాయిలో ఉండే డ్రాగన్ విలన్ గా ఆషామాషీ వ్యక్తి సరిపోడు. ఇమేజ్ పరంగా చాలా బలంగా ఉన్న నటుడు కావాలి. అందుకే ఇంత వేట.

ఇంకొన్ని వారాల్లో అదేంటో తేలుతుంది. యూనిట్ లో వినిపిస్తున్న దాని ప్రకారం డ్రాగన్ 1లో ఆఫ్ఘన్ మాఫియా ఉంటే రెండో భాగంలో రెండు వర్గాల మధ్య భీకరమైన యుద్ధం నేపధ్యంగా ఓపియం వార్ ఉంటుందట. ఇది చాలా కీలకం కాబట్టి దానికి తగ్గ యాక్టర్ కోసం ప్రశాంత్ నీల్ కసరత్తు చేస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ లో పార్ట్ 1, డిసెంబర్ లో పార్ట్ 2 రిలీజ్ కావడం దాదాపు ఖాయమే. ఏదైనా ఆలస్యాలు, అనుకోని అడ్డంకులు వస్తే తప్ప ఈ ప్లాన్ లో ఎలాంటి మార్పులు ఉండవు.

This post was last modified on May 20, 2026 12:10 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

4 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

6 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

6 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

6 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

6 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

7 hours ago