తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధిపతి విజయ్ రాజకీయ విమర్శలకు కేంద్రంగా మారారు. ఆయనను కార్నర్ చేస్తూ.. బీజేపీసహా ఇతర పార్టీలు తీవ్రస్థాయిలో విమర్షషశలు గుప్పిస్తున్నాయి. ఇదేసమయంలో కాంగ్రెస్ పార్టీని కూడా పెద్ద ఎత్తున విమర్శిస్తున్నాయి. దీనికి కారణం.. ఎల్‌టీటీఈ(లిబరేషన్ ఆఫ్ తమిళ్ ఈలం) చీఫ్.. వేలుపిళ్లై ప్రభాకరన్‌కు విజయ్ తాజాగా నివాళులర్పించడమే. ఇదే పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేపింది. బీజేపీ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఎవరీ ప్రభాకరన్..
శ్రీలంకలోని తమిళులకు ప్రత్యేక హక్కులు కల్పించాలని..వారికి ప్రత్యేక రాష్ట్రం , దేశం కేటాయించాలని కోరుతూ.. పెద్ద ఎత్తున గెరిల్లా దాడులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో శ్రీలంక ప్రభుత్వానికి ఆయన కంటిపై కునుకు లేకుండా చేశారు. అనేక మంది శ్రీలంక అధికారులు, ప్రజాప్రతినిధులను కూడా ఎల్‌టీటీఈ హతమార్చింది.
ఆ సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న రాజీవ్ గాంధీ.. శ్రీలంకకు అండగా నిలిచారు. ఎల్‌టీటీఈపై శ్రీలంక చేపట్టిన ఆపరేషన్‌కు సాయం చేశారు. దీంతో శ్రీలంక ప్రభుత్వం ఎల్‌టీటీఈపై పైచేయి సాధించింది. ఈ పరిణామాలకు రాజీవే కారణమని భావించిన ప్రభాకరన్.. రాజీవ్ గాంధీ హత్యకు ప్లాన్ చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులోని శ్రీపెరుంబదూరు నియోజకవర్గానికి వచ్చిన రాజీవ్‌గాంధీని ఎల్‌టీటీపీ ఆత్మా హుతి బాంబర్.. రాజీవ్ గాంధీకి పూల మాల వేసేందుకు ఆయనకు దగ్గరగా వచ్చి.. తనను తాను పేల్చేసుకుని.. రాజీవ్‌ను హతమార్చింది.
ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. కాగా.. నేడు అదే కాంగ్రెస్ పార్టీ మద్దతుతో తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్.. రాజీవ్ గాంధీని హతమార్చిన ఎల్‌టీటీఈ చీఫ్ ప్రభాకరన్‌కు నివాళులర్పించడం.. రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపై బీజేపీ నాయకులు నిప్పులు చెరిగారు.
అయితే.. తమ నాయకుడు విజయ్.. నివాళులర్పించింది.. ప్రభాకరన్‌కు కాదని.. తమిళుడికని టీవీకే వర్గాలు సమర్థించాయి. నాడు ప్రభాకరన్‌ను.. శ్రీలంక సైన్యం వేలాది మంది తమిళులను ఊచకోత కోసిందని.. దీనిలో ప్రభాకరన్ ఒకరని.. అందుకే.. ఆయన నివాళులర్పించారని పేర్కొంది.
కానీ, ఈ సమాధానం పట్ల బీజేపీ సంతృప్తి చెందలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా సమాధానం చెప్పాలని నిలదీసింది. అంతేకాదు.. తన తండ్రిని చంపిన సంస్థకు.. మద్దతు ఇచ్చే పార్టీలతో రాహుల్‌చేతులు కలపడం ఇది కొత్తకాదని దుయ్యబట్టింది. గతంలో డీఎంకేతోనూ ఆయన పొత్తు పెట్టుకున్నారని.. డీఎంకే కూడా ప్రభాకరన్‌కు నివాళులర్పించిందని గుర్తు చేశారు. కాగా.. ఈ వ్యవహారంపై సీఎం విజయ్ మౌనంగా ఉన్నారు.
This post was last modified on May 19, 2026 9:41 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…