Movie News

ఆఫ్గనిస్తాన్ మాఫియాలో ‘డ్రాగన్’ మారణహోమం

దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా మూవీ డ్రాగన్ మీద ఉన్నాయి. ఇవాళ తారక్ పుట్టినరోజు సందర్భంగా నాలుగు నిమిషాల గ్లిమ్ప్స్ ని కానుకగా ఇస్తామని ముందే ప్రకటించడంతో ఫ్యాన్స్ అర్ధరాత్రి కోసం ఆతృతగా ఎదురు చూశారు. టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ ప్రాజెక్టుల్లో ఒకటిగా ఉన్న ఈ సినిమా మీద ప్రకటన స్టేజి నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటో చెప్పేశారు.

భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక ఆఫ్గనిస్తాన్, బెర్ముడా ట్రయాంగిల్ మధ్య భారతదేశం కేంద్రంగా ఓపియుమ్ అనే ప్రమాదకర డ్రగ్ వ్యాపారం జడలు విప్పుతుంది. బ్రిటిషర్లు వదిలేసి వెళ్ళిపోయిన చోట మాఫియా పురుడు పోసుకుని ఒక పెద్ద సామ్రాజ్యంగా రూపాంతరం చెందుతుంది. అందులో నుంచి పుట్టుకొస్తాడు లూగర్ (జూనియర్ ఎన్టీఆర్). శత్రువులను ఊచకోత కోయడమే పనిగా పెట్టుకున్న ఈ రాక్షసుడిని పట్టుకోవడానికి ప్రభుత్వం కదులుతుంది. ఆ తర్వాత ఏమయ్యిందో తెరమీద చూడాలి.

దర్శకుడు ప్రశాంత్ నీల్ మరోసారి డార్క్ వరల్డ్ ని ఎంచుకున్నాడు. ఈసారి కెజిఎఫ్ కంటే వెనక్కు వెళ్లి 1967లో ప్రపంచ దేశాలను కుదిపేసిన ఓపియం డ్రగ్ బిజినెస్ ని తీసుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ మరింత సన్నబడిన లుక్ లో చాలా ఇంటెన్స్ గా కనిపిస్తున్నాడు . శత్రువులను ఉద్దేశించి చెప్పే డైలాగు మాస్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. అనిల్ కపూర్, అశుతోష్ రానా తదితర పాత్రలను రుక్మిణి వసంత్ ద్వారా పరిచయం చేసిన విధానం కొంచెం డిఫరెంట్ గా ఉంది.

మొత్తానికి అంచనాలు రేపడంలో డ్రాగన్ తొలి అడుగు దిగ్విజయంగా పూర్తయ్యింది. ఇంకా షూటింగ్ చాలా ఉంది కాబట్టి కంటెంట్ గురించి ఎక్కువ ఆశించలేం కానీ ఉన్నంతలో నీల్ తన టేకింగ్ ఎలా ఉంటుందో సలార్ ని మించే స్థాయిలో చూపించారు. రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎప్పటిలాగే ఆయన స్టైల్ లో డెప్త్ గా సాగింది. తారక్ కనిపించేది కాసేపే అయినా డ్రాగన్ తాలూకు ముద్ర ఈ వీడియోలో బలంగా పడిపోయింది. సినిమా రిలీజ్ కు ఇంకో ఏడాది వెయిట్ చేయాల్సిందే

we

This post was last modified on May 20, 2026 12:13 am

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

4 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

6 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

6 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

6 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

6 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

7 hours ago