Movie News

రాంబాబు స్థానంలో జార్జ్ కుట్టిని చూడగలరా

ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో వెంకటేష్ దీన్ని రీమేక్ చేయడం లేదనే క్లారిటీ ఫుల్ గా వచ్చేసింది. ఆదర్శ కుటుంబం, అనిల్ రావిపూడి సినిమాలతో బిజీగా ఉండటంతో ఇంకో ఆరేడు నెలల దాకా వెంకీ మామ అందుబాటులోకి రావడం కష్టమే. అందుకే నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు భాగాల్లో రాంబాబుని చూసిన కళ్ళతో జార్జ్ కుట్టిని ఎలా జనం ఎలా రిసీవ్ చేసుకుంటారో.

హైదరాబాద్ లో ఉదయం ఎనిమిది గంటలకు ఫ్యాన్స్ షో వేయడం గమనార్హం. మలయాళంలో ట్రెండింగ్ అయితే బాగానే ఉంది కానీ ఏపీ తెలంగాణలో ఇంకా ఊపందుకోవాల్సి ఉంది. దృశ్యంకున్న బ్రాండ్ వేల్యూనే జనాన్ని థియేటర్లకు రప్పిస్తుందనే నమ్మకంతో నిర్మాతలున్నారు. చాలా సంవత్సరాలుగా మోహన్ లాల్ డబ్బింగ్ మూవీ తెలుగులో ఆడిన దాఖలాలు లేవు. ఒక్క మన్యం పులి మాత్రమే కమర్షియల్ గా ప్రొడ్యూసర్ కు వర్కౌట్ అయ్యింది.

దృశ్యం 3తో ఈ సిరీస్ కి ముగింపు పలకబోతున్నారు. అంత బాగానే ఉంది గతంలో బరోజ్, ఎంపురాన్ లాంటి వాటికి హైదరాబాద్ వచ్చి మరీ ప్రమోషన్లు చేసిన మోహన్ లాల్ ఈసారి మాత్రం దూరంగా ఉన్నారు. టైం లేదనో లేక హీరో మారడం గురించి మీడియా నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయనే సంశయమో ఏమో కానీ మొత్తానికి పబ్లిసిటీ లైట్ తీసుకోవడం విచిత్రం. కొంచెం ప్రచారం హడావిడి చేసి ఉంటే ఓపెనింగ్స్ కి హెల్ప్ అయ్యేది.

ప్రస్తుతం వీరభద్రుడు తప్ప బాక్సాఫీస్ వద్ద వేరే ఆప్షన్ లేదు. గోదారి గట్టుపైన అక్కడక్కడా నెట్టుకొస్తోంది కానీ మరీ చెప్పుకునేంత అయితే కాదు. పెద్ది వరకు గ్యాప్ ఉండటంతో ఇమేజ్ ఉన్న హీరోలెవరూ రెండు వారాలు ముందు వెనుకా దానికి పోటీకి వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు. ఒకవేళ దృశ్యం 3కి మన దగ్గర పాజిటివ్ టాక్ వస్తే ఒక వారం దాకా డీసెంట్ నెంబర్లు చూడచ్చు. మెయిన్ టార్గెట్ కేరళం కాబట్టి మన దగ్గర ఎంత వచ్చినా నిర్మాతలకు అది బోనస్ కిందకే వస్తుంది.

This post was last modified on May 19, 2026 11:14 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

5 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

7 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

8 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

8 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

8 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

9 hours ago