వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నిరసన బాట పట్టారు. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలన్న డిమాండ్ తో సోమవారం ఏపీవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే.
గుంటూరులో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాలుపంచుకున్న అంబటి…టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న నారా లోకేశ్ పై విరుచుకుపడిపోయారు. ఈ సందర్భంగా ఆయన లోకేశ్ కు ఓ కొత్త పేరు కూడా పెట్టారు. లోకేశ్ కు లవ్ క్యాష్ అనే పేరు అయితే సూటవుతుందని ఆయన సంచలన వ్యాఖ్య చేశారు.
తాము అధికారంలోకి వస్తే… అన్నింటి ధరలను తగ్గిస్తామని లోకేశ్ ఏపీ ప్రజలకు హామీ ఇచ్చారని అంబటి గుర్తు చేశారు. లోకేశ్ మాట నమ్మి జనం టీడీపీకి ఓటేస్తే.. అధికారంలోకి వచ్చిన తర్వాత తానిచ్చిన హామీని విస్మరించిన లోకేశ్… ధరలను పెంచుకుంటూ పోతున్నారని ఆయన ఆరోపించారు.
లోకేశ్ కు కమీషన్ల మీద అలవిమాలిన ప్రేమ ఉందన్న అంబటి…తనకు కమీషన్లు వచ్చే రంగాల రేట్లను పెంచని లోకేశ్… పెట్రోల్ బంకుల యాజమాన్యాలు కమీషన్లు ఇవ్వవు కాబట్టే పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచారంటూ తనదైన శైలి ఆరోపణలు గుప్పించారు.
అమెరికా, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ముడి చమురు, గ్యాస్ దిగుమతులకు ఒకింత ఇబ్బంది కలుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరిస్థితులను తట్టుకునేందుకు ఇంధన పొదుపు చర్యలకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిస్తే… వాటిని టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు కూడా అందిపుచ్చుకుంది.
ఇక దినదినానికి పెరుగుతున్న ఇంధన కొరతను తట్టుకునే క్రమంలోనే ఇటీవలే లీటరుకు రూ.3 చొప్పున పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం పెంచింది. ఈ పెంపుదల ఒక్క ఏపీలోనే జరిగిందన్న భావనతో వైసీపీ ఆంధోళనలకు తెర తీసిందంటూ టీడీపీ నుంచి కూడా సెటైర్లు పడిపోతున్నాయి.
This post was last modified on May 18, 2026 12:36 pm
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…