Movie News

చరణ్ సుకుమార్‌… ఈసారి రిస్క్ ఎక్కువ బ్రో

‘రంగస్థలం’ వచ్చిన టైమ్‌లో రామ్ చరణ్, సుకుమార్ ఇద్దరూ ప్రూవ్ చేసుకోవాలనే కసితో పనిచేశారు. ఇప్పుడు RC17 టైమ్‌కి మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. కానీ ఈసారి లెక్క వేరు. అప్పుడు ఎదగాలి అనే తపన. ఇప్పుడు నిలబడాలి అనే టెన్షన్. 2018లో ‘రంగస్థలం’ వచ్చేముందు చరణ్ పరిస్థితి అంత ఈజీగా లేదు. ‘ధృవ’ పర్వాలేదు అనిపించినా, పర్ఫెక్ట్ నటుడిగా మాస్ హిట్ పడి చాలా ఏళ్లయింది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా, తనకంటూ ఒక ఐడెంటిటీ కావాలి. అటు సుకుమార్‌కి ‘నాన్నకు ప్రేమతో’, ‘1 నేనొక్కడినే’ తర్వాత కమర్షియల్ సక్సెస్ అవసరం.

ఇద్దరూ బాక్సాఫీస్ ప్రెజర్‌లో ఉన్నారు. ఆ కసే చిట్టిబాబుని పుట్టించింది. ఊరి పొలిటిక్స్, వినికిడి లోపం ఉన్న పల్లెటూరి కుర్రాడిగా చరణ్ ఒదిగిపోయాడు. రిజల్ట్ కల్ట్ క్లాసిక్. ఇప్పుడు 2026. సీన్ రివర్స్ అయ్యింది. సుకుమార్ ‘పుష్ప’తో వేల కోట్లు కొట్టి పాన్ ఇండియా టాప్ డైరెక్టర్ అయిపోయాడు. ఇక చరణ్ ‘RRR’ తో గ్లోబల్ స్టార్ అయ్యాడు. కానీ సమస్య ఏంటంటే, ‘RRR’ తర్వాత సోలోగా గ్రాండ్ హిట్ లేదు. ‘ఆచార్య’ తేలిపోయింది. ‘గేమ్ ఛేంజర్’ డిజాస్టర్.

ఇప్పుడు ‘పెద్ది’ మీదే ఆశలు. ‘పెద్ది’ హిట్ అయితే ఓకే. కానీ తేడా కొడితే చరణ్‌కి RC17తో మళ్ళీ పెద్ద ఛాలెంజ్. సుకుమార్‌కి కూడా ‘పుష్ప 2’ రేంజ్‌ని బీట్ చేయాలి లేదా దాని పక్కన నిలబెట్టాలి అనే ప్రెజర్ ఉంటుంది. అప్పటి కసి, ఇప్పటి కసి మధ్య తేడా ఉంది. ‘రంగస్థలం’ టైమ్‌లో మనం ఏంటో చూపిద్దాం.. అనే ఆకలి ఉంది. రిస్క్ తీసుకోవడానికి భయపడలేదు. విలేజ్ బ్యాక్‌డ్రాప్, 80ల కాలం, హీరోకి లోపం, కమర్షియల్ ఫార్ములాకి అపోజిట్. అయినా నమ్మి చేశారు.

ఇప్పుడు ఇద్దరూ స్టార్ స్టేటస్‌లో ఉన్నారు. ఫ్యాన్స్ అంచనాలు, మార్కెట్ లెక్కలు, బయ్యర్ల నమ్మకం అన్నీ ఉన్నాయి. ఈ బరువుతో ఎక్స్‌పెరిమెంట్ చేయగలరా? ‘రంగస్థలం’ లాంటి సోల్ ఉన్న కథని మళ్ళీ పట్టుకోగలరా? అనేదే అసలు ఛాలెంజ్.

సుకుమార్ బలం ఎప్పుడూ క్యారెక్టర్ రైటింగ్. చిట్టిబాబు, పుష్పరాజ్ ఇద్దరూ సాధారణ మనుషులు అసాధారణంగా మారిన కథలు. RC17లో చరణ్ కోసం అలాంటి రా, రస్టిక్, రూటెడ్ క్యారెక్టర్ రాస్తేనే వర్కవుట్ అవుతుంది. ముంబైలో లుక్ టెస్ట్ జరిగింది అంటే మోడర్న్ సెటప్ అయ్యుండొచ్చా అనే డౌట్.

ఏదేమైనా స్టార్‌డమ్ వచ్చాక కంఫర్ట్ జోన్‌లోకి వెళ్తే కథ దెబ్బతింటుంది. ‘పెద్ది’ రిజల్ట్ ఎలా ఉన్నా, RC17 సెట్స్ మీదకు వెళ్లేముందు ఇద్దరూ 2018 నాటి మైండ్‌సెట్‌లోకి వెళ్లాలి. అప్పుడే ‘రంగస్థలం’ మ్యాజిక్ రిపీట్ అవుతుంది. లేదంటే కేవలం ఒక పెద్ద బడ్జెట్ సినిమాగా మిగిలిపోతుంది.

This post was last modified on May 18, 2026 11:08 am

Share

Recent Posts

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

1 hour ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

2 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

2 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

10 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

12 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

13 hours ago