Movie News

కొరటాలతో బాలయ్య 2.O?

నందమూరి బాలకృష్ణ సినిమా అంటే ఇప్పటివరకు ఫ్యాక్షన్, పంచ్ డైలాగ్స్ గుర్తుకొస్తాయి. కానీ కొరటాల శివ ఇప్పుడు ఆ ఇమేజ్‌ని బ్రేక్ చేయబోతున్నాడు. ఆగస్టులో సెట్స్‌పైకి వెళ్లే ఈ ప్రాజెక్ట్‌లో బాలయ్య అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తాడని టాక్. దానికి బాలీవుడ్ స్టార్ హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ హకీమ్ వర్క్ చేస్తున్నాడు. ఇది మామూలు మేకోవర్ కాదు.

ఆలీమ్ హకీమ్ దాదాపు ఇండియన్ స్టార్స్ అందరితో వర్క్ చేశారు. అతను జుట్టు కత్తిరించడు, క్యారెక్టర్ డిజైన్ చేస్తాడు. 64 ఏళ్ల బాలయ్యకి ఇప్పుడు కావాల్సింది యాటిట్యూడ్ చూపించే కట్. గ్రే షేడ్స్‌ని కూడా గ్రేస్‌గా మార్చే డిజైన్. ‘భరత్ అనే నేను’లో మహేష్‌ని సీఎంగా క్లాస్‌గా చూపించిన కొరటాల, ఇప్పుడు బాలయ్యని ‘మాస్ మహారాజ్’ నుంచి ‘స్టైలిష్ ఐకాన్’గా మార్చాలని చూస్తున్నాడు.

ఇది బాలయ్య కెరీర్‌ లో 2.O లెక్క తరహాలో ఉందని చెప్పవచ్చు. అఖండ తర్వాత మాస్‌లో పీక్స్ చూశాడు. కానీ మళ్ళీ దాని సీక్వెల్ తో ఫ్లాప్ చూశారు. ఇక ‘జైలర్’లో రజినీ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌తో ఎలా కనెక్ట్ అయ్యాడో, అలాంటి ట్రాన్సిషన్ ఇప్పుడు బాలయ్యకి అవసరం. మాస్ యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుందని టీమ్ చెబుతోంది.

రిస్క్ లేకపోలేదు. బాలయ్య ఫ్యాన్స్ ఊర మాస్ కోరుకుంటారు. గ్లాసెస్, జెల్ పెట్టిన హెయిర్ చూసి “మా బాలయ్యేనా?” అని డౌట్ పడతారు. కానీ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో రాజు గెటప్‌ని యాక్సెప్ట్ చేశారు. కథలో దమ్ముంటే, స్టైలిష్‌గా ఉన్నా ఓన్ చేసుకుంటారు. లుక్ కోసం లుక్ కాకూడదు. క్యారెక్టర్ డిమాండ్ చేయాలి. త్వరలోనే సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రానున్నట్లు తెలుస్తోంది.

This post was last modified on May 18, 2026 12:26 pm

Share

Recent Posts

ఆప‌ద వేళ‌.. అర్ధ‌రాత్రి వ‌ర‌కు… చంద్ర‌బాబు రివ్యూలు!

మురసు తుఫాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ముందస్తు చర్యలపై దృష్టి సారించారు. ఈ నేప‌థ్యంలో…

1 hour ago

చిరు లిస్టులోకి ఇంకో పేరు

70 ఏళ్లు పైబడ్డా సరే, ఈ వయసులోనూ మెగాస్టార్ చిరంజీవి చాలా ఉత్సాహంగా సినిమాలు చేస్తున్నారు. ఈ తరం దర్శకులతోనూ…

3 hours ago

లాస్ట్ మినిట్ డైరెక్టర్లకు సెన్సార్ షాక్

మేకింగ్ టైంలో మాత్రం తాపీగా షూటింగ్ చేయడం.. అవసరం లేని షాట్లు తీసుకోవడం.. యాక్టర్ల డేట్లు వేస్ట్ చేయడం.. రీషూట్లు…

3 hours ago

బచ్చన్ సాబ్ బయటకి రావాలన్నా భయమే

కొన్ని రోజుల కింద‌ట బాలీవుడ్ స్టార్ టైగ‌ర్ ష్రాఫ్ మీద న‌డి రోడ్డుపై కొంద‌రు దుండ‌గులు తుపాకుల‌తో దాడికి పాల్ప‌డ‌డం…

4 hours ago

మోదీ షాలను దేశం నుంచి పారిపోనివ్వం

ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు చేసింది అత్యంత అరుదైన నేరం, వారు న్యాయ ప్రక్రియ నుంచి ఎప్పటికీ…

6 hours ago

‘సినిమా – హింస’లోకి రామాయణాన్ని తెచ్చిన ఆర్జీవీ

రాప్తాడు ఘ‌ట‌న వెనుక యానిమ‌ల్ .. ఆర్జీవీ కౌంట‌ర్నిన్న ఏపీలోని అనంత‌పురం జిల్లా రాప్తాడులో జ‌రిగిన పాఠ‌శాల ఘ‌ట‌న ఎంత‌టి…

7 hours ago