Political News

న‌మ్మ‌కం-ల‌క్ష్యం-భ‌విష్య‌త్తు.. అదే అమ‌రావ‌తి

ఏపీ రాజ‌ధాని విష‌యంలో అనూహ్య స్పంద‌న ల‌భిస్తోంద‌ని మంత్రి నారా లోకేష్ చెప్పారు. వాస్త‌వానికి ఏ న‌గ‌రం అయినా.. నిర్మాణం పూర్తి చేసుకున్న‌ప్పుడు.. దానికి సంబంధించిన ప్ర‌చారం ల‌భిస్తుంద‌ని తెలిపారు. కానీ, అమ‌రావ‌తి విష‌యంలో మాత్రం నిర్మాణ ద‌శ‌లో ఉండ‌గానే.. రాజ‌ధానిపై దేశ‌వ్యాప్తంగా ఆశ‌లు రేకెత్తుతున్నాయ‌న్నారు. న‌మ్మకం-ల‌క్ష్యం-భ‌విష్య‌త్తుకు రాజ‌ధాని అమ‌రావ‌తి నిలువెత్తు నిద‌ర్శ నంగా ఉంద‌న్నారు.

అమ‌రావ‌తిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటం కంప్యూటింగ్ కోసం.. ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చిన ఇంజ‌నీర్లు ప‌నిచేస్తున్నార‌ని.. వారంతా ఎంతో అంకిత భావాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. ముంబై నుంచి వ‌చ్చిన గోపాల్‌, ల‌క్ష్మ‌య్య‌లు.. క్వాంటం కోసం ప‌నిచేస్తున్నార‌ని తెలిపారు. వారిని అభినందిస్తున్నాన‌న్నారు. సీఎం చంద్ర‌బాబు విజ‌న్‌ను న‌మ్మి.. భ‌విష్య‌త్తు త‌రాల కోస‌మే వీరంతా శ్ర‌మిస్తున్నార‌ని పేర్కొన్నారు. రాజ‌ధాని అమ‌రావతిని భవిష్య‌త్తు మార్గ‌నిర్దేశక న‌గ‌రంగా అభివ‌ర్ణించారు.

ప‌నులు వ‌డివ‌డి..

అమ‌రావ‌తి రాజ‌ధాని ప‌నులు వ‌డివ‌డిగా సాగుతున్నాయి. ప్ర‌స్తుతం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స‌హా.. న్యాయ మూర్తుల భ‌వ‌నాల‌ను పూర్తి చేశారు. ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారులకు కేటాయించే భ‌వ‌నాల‌ను కూడా పూర్తి చేస్తున్నారు. వీటిని త్వ‌ర‌లోనే ప్ర‌భుత్వ పాల‌నా విభాగానికి హాండోవ‌ర్ చేయ‌నున్నారు.

త‌ద్వారా ఇక్క‌డ నివాసాలు పెరిగి.. కార్య‌క‌లాపాలు పుంజుకుంటాయ‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ప్ర‌స్తుతం కాంటం కంప్యూటింగ్ ప‌నులు కూడా శ‌ర వేగంగా జ‌రుగుతున్నాయి. వ‌చ్చే మూడు మాసాల్లోనే వీటిని పూర్తి చేయ‌నున్నారు.

This post was last modified on May 17, 2026 4:37 pm

Share

Recent Posts

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

48 minutes ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

3 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

3 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

4 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

12 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

14 hours ago