Movie News

బుచ్చిబాబు… గురువుకు తగ్గ శిష్యుడే

దర్శకుడిగా రెండో సినిమాకే రామ్ చరణ్ లాంటి టాప్ హీరోతో సినిమా చేసే అవకాశం లభించడం అంటే చిన్న విషయం కాదు. బుచ్చిబాబు సానా ఈ అరుదైన అవకాశాన్నే అందుకున్నాడు. కొత్త హీరో హీరోయిన్లతో అను రూపొందించిన ‘ఉప్పెన’కు బాక్సాఫీస్ టైమింగ్ భలేగా కలిసొచ్చి అది ఏకంగా వంద కోట్ల సినిమాగా నిలిచింది.

బుచ్చిబాబుకు దర్శకుడిగా గొప్ప పేరు తెచ్చి పెట్టింది. ఆ వెంటనే అతడికి అవకాశాలకు లోటు లేకపోయినా.. ఒక పెద్ద హీరోతోనే రెండో సినిమా చేయాలని పట్టుబట్టి కూర్చున్నాడు.
జూనియర్ ఎన్టీఆర్‌తో అనుకున్న సినిమా ముందుకు కదలేకపోయినా.. ఓపిగ్గా ఎదురు చూసి రామ్ చరణ్‌తో సినిమాను పట్టాలెక్కించాడు. ఆ చిత్రమే.. పెద్ది.

ఈ సినిమా మొదలైనపుడు మరీ అంచనాలేమీ లేవు. ఒక చిన్న సినిమా తీసిన అనుభవంతో బుచ్చిబాబు ఒక పెద్ద హీరోను ఏమాత్రం డీల్ చేస్తాడో అనే సందేహాలుండేవి. దీనికి తోడు రామ్ చరణ్ చివరి రెండు చిత్రాలు ఆచార్య, గేమ్ చేంజర్ డిజాస్టర్లు కావడం ఈ చిత్రానికి మైనస్ అయింది. కానీ ‘పెద్ది’ రిలీజ్ దగ్గర పడేసరికి అంతా మారిపోయింది. ఈ సినిమా ప్రోమోలన్నీ భలేగా క్లిక్ అయ్యాయి. దీనికి తోడు బాక్సాఫీస్ పరిస్థితులు కూడా ఈ చిత్రానికి భలేగా కలిసొచ్చాయి.

ఫస్ట్ గ్లింప్స్‌లో చరణ్ సిగ్నేచర్ బ్యాటింగ్ మూమెంట్, చికిరి పాట సినిమాకు కావాల్సినంత ప్రమోషన్ చేసి పెట్టాయి. దీనికి తోడు సంక్రాంతి తర్వాత సరైన సినిమా పడకపోవడమూ ఈ చిత్రానికి బాగా కలిసొచ్చింది. ఇప్పుడు ఇటు ఇండస్ట్రీ, అటు ప్రేక్షకులు మొత్తంగా ‘పెద్ది’ మీదే ఆశలు పెట్టుకునే పరిస్థితి వచ్చింది.

ఇండస్ట్రీ జనాలతో పాటు ప్రేక్షకులు అందరూ ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు గత కొన్ని రోజులుగా. వచ్చే నెల జూన్ 3 రాత్రి నుంచి తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో మెజారిటీ ‘పెద్ది’ సినిమానే ప్రదర్శించబోతున్నాయి. మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు మంచి హైప్ ఉంది.

విడుదలకు ముందు ఈ రకమైన బజ్ తెలుగులో బాహుబలి, బాహుబలి-2, ఆర్ఆర్ఆర్, పుష్ప-2 చిత్రాలకు మాతర్మే వచ్చింది. బుచ్చిబాబు రెండో సినిమాకే తన గురువు సుకుమార్‌ను మ్యాచ్ చేసేశాడు. రామ్ చరణ్‌తో సుకుమార్ తీసిన ‘రంగస్థలం’కు కూడా ఈ స్థాయి హైప్ లేదు.

అలాంటిది చరణ్‌తో తాను తీసిన సినిమాతో ఇంకా ఎక్కువ హైప్ క్రియేట్ చేయగలిగాడు బుచ్చిబాబు. ఇదొక రేర్ ఫీట్ అని చెప్పొచ్చు. మరి సినిమా అంచనాలకు తగ్గట్లే ఉంటే.. బుచ్చిబాబు టాలీవుడ్ నుంచి రీజనల్ ఇండస్ట్రీ హిట్ కొట్టడమే కాక.. పాన్ ఇండియా స్థాయిలోనూ సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం.

This post was last modified on May 17, 2026 4:55 pm

Share

Recent Posts

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

2 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

4 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

4 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

5 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

13 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

15 hours ago