Political News

పోయే వాళ్లు పోండి: జ‌గ‌న్ దారిలో మ‌మ‌త?

రాజ‌కీయాల్లో చింత చ‌చ్చినా పులుపు చావ‌ద‌ని అన్న‌ట్టుగా కొంద‌రు నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తారు. ఇలాంటి వారిలో ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ ఒక‌రు. ఆయ‌న పార్టీ 11 స్థానాల‌కు ప‌రిమితం అయిన త‌ర్వాత కూడా మార్పు రాక‌పోగా.. పార్టీలో ఉన్న‌వారిని కించ‌ప‌రిచేలా వ్య‌వ‌హ‌రించార‌న్న వాద‌న ఉంది. ఉంటే ఉండండి పోతే పోండి! అన్న‌ట్టుగానే వ్య‌వ‌హ‌రించారు. దీంతో బ‌ల‌మైన నాయ‌కులు పార్టీని వ‌దిలేశారు.

ఇప్పుడు.. జ‌గ‌న్ దారిలోనే ప‌శ్చిమ బెంగాల్ మాజీ ముఖ్య‌మంత్రి, తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మ‌మ‌తా బెన‌ర్జీ కూడా న‌డుస్తున్నారు. పార్టీ నాయ‌కుల‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. మీలో ఎంత మంది నాతో ఉండాల‌ని అనుకుంటే అంత మందే ఉండండి. బీజేపీ కి భ‌య‌ప‌డే వాళ్లు.. పార్టీలో కోవ‌ర్టులుగా ఉంటూ.. ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించే వారు నాకు అవ‌స‌రం లేదు. నేను మిమ్మ‌ల్ని బుజ్జ‌గించ‌ను. బ్ర‌తిమాల‌ను. ఈ పార్టీ నా సొంతం అని నోరు జారారు.

వాస్త‌వానికి తాజాగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఎంసీ పార్టీ 80 మంది ఎమ్మెల్యేల‌ను మాత్ర‌మే గెలుచుకుంది. దీంతో అసెంబ్లీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదాను ద‌క్కించుకుంది. కానీ.. ఈ హోదా లేకుండా చేయాల‌న్న వ్యూహంతో బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. దాదాపు 30-40 మంది ఎమ్మెల్యేల‌ను త‌మ‌వైపు తిప్పుకొంటే.. టీఎంసీకి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదాను ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌న్న‌ది బీజేపీ నాయ‌కుల అంచ‌నా. దీంతో టీఎంసీ ఎమ్మెల్యేలు.. పార్టీకి గ‌త వారం రోజులుగా దూరంగా ఉంటున్నారు.

మ‌రోవైపు జిల్లాలు, మండ‌లాల స్థాయిలో పార్టీ కార్యాల‌యాల‌పై దాడులు జ‌రుగుతున్నాయి. క్షేత్ర‌స్థాయిలో బీజేపీ వ‌ర్సెస్ టీఎంసీ(మ‌మ‌త పార్టీ) నేత‌ల మధ్య తీవ్ర వివాదాలు.. హ‌త్య‌లు కూడా చోటు చేసుకుంటున్నాయి. అయితే.. ఇలాంటి స‌మ‌యంలో పార్టీ నాయ‌కుల‌ను బుజ్జ‌గించి.. వారికి ధైర్యం చెప్పాల్సిన మ‌మ‌తా బెన‌ర్జీ..

జ‌గ‌న్ త‌ర‌హాలో ఉంటే ఉండండి.. లేక‌పోతే పోండి! అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు. పైగా.. ఈ పార్టీ త‌న సొంతం అని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. కాగా.. 1998 సంవత్స‌రం వ‌ర‌కు కాంగ్రెస్‌లో ఉన్న మ‌మ‌తా బెన‌ర్జీ.. ఆ త‌ర్వాత‌.. సొంత‌గా పార్టీ పెట్టుకున్నారు. దాదాపు 10 సంవ‌త్స‌రాలు పోరాడి 2011లో అధికారంంలోకి వ‌చ్చారు. తాజాగా ఓడిపోయారు.

This post was last modified on May 18, 2026 9:06 am

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

8 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

10 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

10 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

11 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

11 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

12 hours ago