Political News

ఏపీ నుంచి పెద్ద‌ల స‌భ‌కు అమిత్ షా శిష్యుడు?

ఏపీలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్య‌స‌భ స్థానాల్లో ఒక‌టి బీజేపీకి కేటాయించ‌నున్న‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌సాగుతోంది. మొత్తం నాలుగు స్థానాల్లో రెండు టీడీపీ ఉంచుకుని.. మిగిలిన రెండు స్థానాల‌ను మిత్ర‌ప‌క్షాలైన జ‌నసేన‌, బీజేపీల‌కు కేటాయించ నుంది. దీనిపై టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఈ క్ర‌మంలో బీజేపీ నుంచి కేంద్ర మంత్రి అమిత్ షా శిష్యుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌మిళ‌నాడుకు చెందిన అన్నామలైని పెద్ద‌ల స‌భ‌కు పంపించ‌నున్నార‌న్న చ‌ర్చ సాగుతోంది.

దీనిపై త‌మిళ మీడియా కూడా పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తోంది. త‌మిళ‌నాడులో ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల‌లో అన్నామ‌లైకి ఎక్క‌డా టికెట్ ఇవ్వ‌క‌పోవ‌డం.. ఆయ‌న‌ను కేవ‌లం ప్ర‌చారానికి మాత్ర‌మే ప‌రిమితం చేయ‌డం వంటివి ఈ వాద‌న‌కు బ‌లాన్ని చేకూరుస్తున్నాయి. ఐపీఎస్ అదికారి అయిన అన్నామ‌లై.. క‌ర్ణాట‌క‌లో ప‌నిచేసేవారు. ఆ స‌మ‌యంలో అమిత్ షా ఆయ‌న‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు. ఇలా.. ఆయ‌న‌ను ఐపీఎస్ నుంచి వాలంట‌రీ రిటైర్మెంట్‌కు ప్రోత్స‌హించి.. బీజేపీ కండువా క‌ప్పారు. అనంత‌రం.. తమిళ‌నాడు రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా నియ‌మించారు.

ఈ ఏడాది ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు కూడా అన్నామ‌లై.. త‌మిళ‌నాడు బీజేపీ చీఫ్‌గానే వ్య‌వ‌హ‌రించారు. ఆ స‌మ‌యంలోనే ఆయ‌న‌కు కేంద్రంలో మంత్రి ప‌ద‌విని ఇస్తార‌న్న ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యం కావ‌డంతో అన్నామ‌లైని ప్ర‌చారానికి మాత్ర‌మే ప‌రిమితం చేసిన బీజేపీ.. ఇప్పుడు ఏపీ కోటాలో రాజ్య‌స‌భ‌కు పంపించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అనంత‌రం.. ఆయ‌న‌కు మంత్రి వ‌ర్గంలోనూ చోటు ల‌భిస్తుంద‌ని బీజేపీ త‌మిళ‌నాడు వ‌ర్గాలు చెబుతున్నాయి.

బ‌ల‌మైన వాయిస్‌తో పాటు.. హిందూత్వ‌కు కూడా క‌నెక్ట్ అయిన అన్నామ‌లైని పెద్ద‌ల స‌భ‌కు పంపించ‌డం ద్వారా త‌మిళ‌నాడు లో బీజేపీ పుంజుకునే అవ‌కాశం ఉంటుంద‌ని లెక్క‌లు వేస్తున్నారు. కాగా.. ఇప్ప‌టికే త‌మిళ‌నాడు నుంచి ఎల్‌. మురుగ‌న్ కేంద్రంలో మంత్రిగా ఉన్న విష‌యం తెలిసిందే. ఇక‌, మాజీ గ‌వ‌ర్న‌ర్‌.. త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్‌కు కూడా కేంద్రంలో కీల‌క ప‌ద‌విని అందించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఆమె గ‌త, ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో పోటీ చేసి ప‌రాజ‌యం పాల‌య్యారు.

This post was last modified on May 16, 2026 10:09 pm

Share

Recent Posts

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

2 minutes ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

1 hour ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

1 hour ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

1 hour ago

దుబాయ్ విమానంలో ఫైటింగ్… 180 మందిని కాపాడిన ఇండియన్ కెప్టెన్

భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…

2 hours ago

405 అయినా సరే… తగ్గేదే లే!!

వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…

2 hours ago