Trends

బంగారం అయిపోయింది ఇక వెండి

ప్ర‌స్తుతం పొదుపు మంత్రం ప‌ఠిస్తున్న కేంద్ర ప్ర‌భుత్వం చ‌మురు స‌హా బంగారం వంటివాటిపై కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ప్ర‌భుత్వ ప‌రిధిలో చ‌మురు వినియోగం త‌గ్గించేందుకు కాన్వాయ్‌ల‌ను ఇప్ప‌టికే త‌గ్గించారు. ఇక‌, బంగారాన్ని ఏడాది పాటు కొనుగోలు చేయొద్ద‌ని ప్ర‌ధాని మోడీ స్వ‌యంగా ప్ర‌జ‌ల‌కు చెప్పారు. అనంత‌రం.. దీనిపై క‌స్ట‌మ్స్ సుంకాన్ని 6-15 శాతానికి పెంచారు. ఫ‌లితంగా బంగారం ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్నాయి. ఇక‌.. ఈప‌రంప‌ర‌లో తాజాగా వెండి దిగుమ‌తుల‌పై ఏకంగా నిషేధం విధించ‌డం గ‌మ‌నార్హం.

విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకునే వెండి స‌హా.. వెండి వ‌స్తువుల‌పై కేంద్రం నిషేధం విధించింది. ఈ నిషేధం వ‌చ్చే నెల 30వ తేదీ వ‌ర‌కు ఉంటుంద‌ని కేంద్రం ప్ర‌క‌టించింది. ముఖ్యంగా వజ్రాలు పొదిగిన వెండి ఆభరణాలపై ఈ ఏడాది జూన్ 30 వరకు దిగుమతులపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. వస్తువుల దిగుమతి విధానాన్ని స‌మీక్షించిన‌ట్టు పేర్కొన్న ప్ర‌భుత్వం… జూన్ 30, 2026 వరకు నిషేధం విధిస్తున్న‌ట్టు తెలిపింది. ఇది తక్షణమే అమల్లోకి వచ్చేలా ‘స్వేచ్ఛ’ నుండి ‘పరిమితం’గా సవరించిన‌ట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGTA) తెలిపింది.

ప్ర‌స్తుతం ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న సంక్షోభం నేప‌థ్యంలో డాల‌రుతో రూపాయి విలువ ప‌డిపోయింది. ఈ క్ర‌మంలోనే వెండి దిగుమ‌తుల‌పై నిషేధం విధించిన‌ట్టు మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీనివ‌ల్ల ఫారెక్స్ నిల్వ‌లు పెరుగుతాయ‌న్న అంచ‌నా ఉంది. అయితే.. ఇదేస‌మ‌యంలో స్మ‌గుల్ వ్య‌వ‌హారం కూడా ప్ర‌భుత్వానికి ఇబ్బంది క‌లిగించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఇదేస‌మ‌యంలో దేశీయ మార్కెట్‌ను బ‌లోపేతం చేయ‌డానికి కూడా ఈచ‌ర్య‌లు దోహ‌ద‌ప‌డ‌నున్నాయ‌ని మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలలో ఉన్న లొసుగులను సరిదిద్దడానికి, ముఖ్యంగా థాయ్‌లాండ్ వంటి దేశాల నుండి తక్కువ ధరలకు ఆభరణాలు పెద్ద ఎత్తున దిగుమతి అవ్వడాన్ని అరికట్టడానికి కూడా దోహ‌ద‌ప‌డుతుంద‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలో దేశీయ తయారీదారులను రక్షించడానికి ఉప‌యోగ‌ప‌డ‌నుంద‌ని అంటున్నారు. అయితే.. ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఎగుమతి ఆధారిత యూనిట్ల దిగుమతులకు మినహాయింపు ఉంటుందని కేంద్రం పేర్కొంది.

This post was last modified on May 16, 2026 11:08 pm

Share

Recent Posts

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

1 minute ago

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

3 hours ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

5 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

7 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

8 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

8 hours ago